ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది తారలు వారికి సంధించిన చేదు జ్ఞాపకాలను పంచుకుంటూ వస్తున్నారు. ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు.. బయటన వేధింపులు.. ఇలా ఇబ్బందిపడ్డవారు చాలా మంది ఉన్నారు. అలా తన చేదు అనుభవాలను పంచుకున్నారు బాలీవుడ్ నటి సోనమ్ కపూర్.
మహిళలపై వేధింపులు అప్పుడు ఇప్పుడు ఏమార్పు లేదు. వారు స్టార్లు కాని.. సామాన్యులు కాని.. జీవితంలో ఏదో ఒక సమంయం లో ఈ వేధుపులకు గురి అవ్వకుండే ఉండలేదు అనే చెప్పాలి. అలాంటి అనుభవాన్ని చాలా మంది స్టార్ హీరోయిన్లు పలు ఇంటర్వ్యూలలోచెప్పుకున్నారు. తాజాగా సోనమ్ కపూర్ కూడా తన చేదు అనుభవాన్ని వెల్లడించింది.
26
సమాజంలో మహిళలపట్ల వేధింపులు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. దేశంలో రోజు ఏదో ఓ మూలన అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఎంత టెక్నాలజీవచ్చినా.. ఎంత చదువులు చదివినా.. ఈ విషయంలో మాత్రం అజ్ఞానులుగానే మిగిలిపోతున్నారు కొంత మంది జనాలు. దీనిని నియంత్రించడానికి ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకువస్తున్నప్పటికి దారుణాలను అరికట్టలేకపోతున్నారు.
36
Sonam Kapoor
ఇక ఈ విధమైన వేధింపులు సాధారణ మహిళలతో పాటు సెలబ్రిటీలు కూడా ఎదుర్కొంటున్నారు. తాజాగా సోనమ్ కపూర్ ఒ ఇంటర్య్వూలో తను ఎదుర్కొన్న వేధింపుల గురించి ప్రస్తావించింది. తాను చెప్పిన ఆ షాకింగ్ విషయాలతో అందరూ షాక్ అయ్యారు.
46
Image: Katy Perry, Sonam Kapoor / Instagram
సినిమా ఇండస్ట్రీలో నటీనటుల మధ్య గాసిప్స్, రూమర్స్ చెక్కర్లు కొడుతుంటాయి. అవి వారి వ్యక్తిగత జీవితంతో పాటు, వృత్తిపరంగా కూడా నష్టాన్ని చేకూరుస్తాయి. బాలీవుడ్ లో సోనమ్ కపూర్ స్టార్ హీరోయిన్ పలు హిట్ సినిమాల్లో నటించి నాలుగు ఫిలిం ఫేర్ పురస్కారాలను కూడా పొందింది. బాలీవుడ్ లో లీడ్ పాత్రల్లో నటిస్తూ.. అందరి మెప్పును పొందిన ఈ హీరోయిన్.. ను ఓ సారి ఒక వ్యాక్తి లైంగికంగా హించించాడట. అది కూడా పబ్లిక్ లో.
56
Image: Sonam Kapoor / Instagram
సోనమ్ కపూర్ యుక్త వయస్సులో ఉన్నప్పుడు.. పదమూడేళ్ల వయసులో..స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్లానని తెలిపింది. థియేటర్ లో ఇంట్రవెల్ టైమ్ లో స్నాక్స్ కోసం బయటకు వచ్చినప్పుడు... ఓ వ్యక్తి ఆకస్మాత్తుగా వెనక నుంచి వచ్చి తనను గట్టిగా పట్టుకున్నాడట. తన ఎదపై చేతులు వేశి గట్టగా నోక్కాడని చెప్పుకొచ్చింది.
66
Sonam Kapoor posed for a bold photo shoot for the first time after becoming a mother
సడన్ గా అలా జరిగే సరికి తాను గజగజా వణికిపోయానని తెలిపింది. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో గుక్కపెట్టి ఏడ్చానని తెలిపింది. దాంతో అక్కడ గందరగోళ వాతావరణం ఏర్పడిందని.. ఈరకంగా తానుమాత్రమే కాదు...చాలా మంది మహిళలు ఇలా వేధింపులకుగురి అవుతున్నారంటోంది సోనమ్. ఈ విషయంలో ఇంకా కటిన చట్టాలురావల్సి ఉంది అంటుంది.