Intinti Gruhalakshmi: పార్క్ లో కుర్రాళ్లతో ప్రవల్లిక, తులసి పరాచకాలు.. షాక్ లో నందు!

Published : May 02, 2022, 01:17 PM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత అనే నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ రోజు మే రెండవ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
16
Intinti Gruhalakshmi: పార్క్ లో కుర్రాళ్లతో ప్రవల్లిక, తులసి పరాచకాలు.. షాక్ లో నందు!

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే తులసి (Tulasi) నీ కబుర్లతో రోజంతా సరదాగా గడిచిపోయింది. ఇల్లు ఇంట్లో వాళ్ళు గుర్తుకు రావడం లేదు అని ప్రవళిక తో అంటుంది. దాంతో నీకోసం నువ్వు కాసేపైనా బతికితే లైఫ్ త్రిల్లింగ్ గా అనిపిస్తుంది అని ప్రవళిక (Pravalika) అంటుంది. అంతేకాకుండా బంధాలు సంతోషాన్ని ఇవ్వాలి కానీ బాధ పెట్టకూడదు అని అంటుంది.
 

26

ఆ తర్వాత ప్రవళిక (Pravalika) తులసిని పానిపూరి తినడానికి తీసుకుని వెళుతుంది. అంతేకాకుండా ఎవరు ఎక్కువగా తింటారో పందెం కట్టుకొని తినాలి అంటుంది. ఇక గెలిస్తే లైఫ్లో గెలిచినట్టే అని సీరియస్ గా పాల్గొను అని అంటుంది. ఇక ఆ పందెంలో తులసి గెలుస్తుంది. దాంతో తులసి (Tulasi) ఆనందంగా గంతులు వేస్తుంది.
 

36

మరోవైపు శృతి (Sruthi) కు తన యజమాని ఫోన్ చేసి పనిలోకి రానందుకు విరుచుకుపడుతూ ఉంటుంది. ఈ లోగా ప్రేమ్ (Prem) డాక్టర్ ను తీసుకొని వచ్చి శృతి కి వైద్యం చేపిస్తాడు. ఇక శృతి పనికి వెళ్ళడానికి గాను రేపటి లోపు జ్వరం తగ్గేలా డాక్టర్ ను టాబ్లెట్స్ అడుగుతుంది.
 

46

మరోవైపు తులసి (Tulasi) ప్రవళిక (Pravalika) లు పిట్టగోడ మీద కూర్చుని పాప్ కార్న్ తింటూ ఆనందంగా చిట్ చాట్ చేసుకుంటూ ఉంటారు. ఇక స్కూల్ లో జరిగిన తీపి జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకుంటూ చిల్ అవుతూ ఉంటారు. ఈ క్రమంలో వాళ్ళిద్దరు దగ్గరకు ఇద్దరు ఆకతాయి కుర్రాళ్లు వచ్చి కామెంట్ చేస్తూ ఉంటారు.
 

56

ఇక ప్రవళిక (Pravalika) ఆ కుర్రాళ్లను దగ్గరికి పిలిచి వాళ్లని పాట పాడమని బెదిరిస్తుంది. అంతేకాకుండా డ్యాన్స్ కూడా చేయమంటుంది. ఇక ఆ కుర్రాళ్ళ తో పాటు తులసి వాళ్ళు కూడా ఆనందంగా స్టెప్పులు వేస్తూ ఉంటారు. ఇక అది దూరం నుంచి చూసిన నందు ఎంతో కోపం వ్యక్తం చేస్తాడు. అది గమనించిన తులసి (Tulasi) ప్రవళికను అక్కడి నుంచి తీసుకుని వెళుతుంది.
 

66

ఇక తరువాయి భాగంలో లాస్య (Lasya) నందు లు కలిసి జాగింగ్ కి వెళ్తారు. ఇక వీళ్లకు ఎదురుగా తులసి జాగింగ్ డ్రెస్ వేసుకుని కనబడుతుంది. దాంతో నందు  తులసి (Tulasi) పై విరుచుకు పడతాడు. ఇక తులసి మీరెవరో తెలుసుకోవచ్చా అని నందు ని అంటుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.

click me!

Recommended Stories