ఆర్ఆర్ఆర్ హవా కొనసాగుతూనే ఉంది. కెజియఫ్2, ఆచార్య లాంటి సినిమాలు రిలీజ్ అయినా కూడా ఆర్ఆర్ఆర్ కు క్రేజ్ తగ్గలేదు. సినిమా రిలీజ్ అయ్యి నెల రోజులు దాటినా కలెక్షన్లు ఇంకా స్టడీగానే ఉన్నాయి. ఈ ఆదివారం కూడా ఆర్ఆర్ఆర్ థియేటర్లు హౌస్ ఫుల్ అయ్యాయి. ఆదివారం కూడా దాదాపు కోటీ వరకు కలెక్షన్లను రాబట్టింది. టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీలో రామ్‌చరణ్ రామ రాజుగా... జూ.ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటించారు.