`ప్రణయ గోదారి` మూవీ రివ్యూ, రేటింగ్‌

Published : Dec 13, 2024, 08:48 PM ISTUpdated : Dec 13, 2024, 11:50 PM IST

సాయికుమార్‌ ప్రధాన పాత్రలో నటించిన వింటేజ్‌ రా అండ్‌ రస్టిక్‌ మూవీ `ప్రణయగోదారి`. ఈ మూవీ శుక్రవారం విడుదలైంది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.   

PREV
15
`ప్రణయ గోదారి` మూవీ రివ్యూ, రేటింగ్‌

మాస్‌ యాక్షన్‌ సినిమాలతోపాటు విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో సాగే రా అండ్‌ రస్టిక్‌ సినిమాలకు కూడా ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఆ కోవలోనే మరో సినిమా `ప్రణయ గోదారి` వచ్చింది. సాయికుమార్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీలో సదన్‌, ప్రియాంక ప్రసాద్‌ జంటగా నటించారు. పృథ్వీ, జబర్దస్త్ రాజమౌళి, సునీల్‌ రవినూతల, ప్రభావతి, మిర్చి మాధవి ఇతర పాత్రలు పోషించారు. పీఎల్‌వీ క్రియేషన్స్ పతాకంపై వీఎల్‌ విగ్నేష్‌ నిర్మించారు. ఈ మూవీ నేడు శుక్రవారం విడుదలైంది. మరి ఆడియెన్స్ ని ఆకట్టుకుందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

25

కథః
ఊర్లో పెదకాపు(సాయికుమార్‌) అందరి బాగోగులు చూస్తారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా తానే పరిష్కరిస్తాడు. కానీ అదే గ్రామంలో ఉండే దత్తుడు(పృథ్వీ) గ్రామంపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో పెదకాపుతో తరచూ గొడవలు పడుతుంటాడు. ఆయనతో పోటీ పడుతుంటాడు. ప్రతి దాంట్లోనూ అడ్డు వస్తుంటాడు. అదే గ్రామంలో శ్రీను(సదన్‌) అల్లరి చిల్లరగా తిరిగే కుర్రాడు, గొయ్య లక్ష్మి (ప్రియాంక ప్రసాద్‌) అనే అమ్మాయిని ఇష్టపడతాడు. గొయ్య కూడా ఆయన ప్రేమకి ఓకే చెబుతుంది.

కానీ వీరి ప్రేమకి ఊర్లో అనేక సవాళ్లు ఎదురవుతుంటాయి. ప్రేమకి అనేక అడ్డంకులు ఎదురవుతుంటాయి. మరి ఆ సమస్యలేంటి? వాటిని ఈ ప్రేమ జంట ఎలా ఎదుర్కొంది? వీరికి పెదకాపు ఎలా సపోర్ట్ గా నిలిచాడు? ఆయన అండగా నిలిచాడా? లేదా? వీరి ప్రేమ ఎలాంటి మలుపులు తిరిగిందనేది మిగిలిన సినిమా. 
 

35

విశ్లేషణః

సినిమాల్లో ఒక్కో టైమ్‌లో ఒక్కో ట్రెండ్‌ నడుస్తుంది. ఇప్పుడు రా అండ్‌ రస్టిక్‌ సినిమాలకు మంచి ఆదరణ దక్కుతుంది. రియలిస్టిక్‌ సంఘటనలతో తెరకెక్కిన సినిమాలకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో అలాంటి కథలనే మేకర్స్ ఎక్కువగా అందిస్తున్నారు. చాలా వరకు సక్సెస్‌ అవుతున్నారు. ఇప్పుడు `ప్రణయగోదారి` సినిమా కూడా అలాంటి కథాంశంతో వచ్చిన సినిమా అనే చెప్పాలి.

పీరియడ్‌ అంశాలతో విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో పరువు హత్యల నేపథ్యంలో సాగే యాక్షన్‌ ఎమోషనల్‌ మూవీ ఇది. దీనికి పునర్జన్మ ల అంశం జోడించడం విశేషంగా చెప్పొచ్చు. యాక్షన్‌తోపాటు ఎమోషన్స్ ఈ సినిమాలో హైలైట్‌గా నిలుస్తాయి. అయితే కథ పరంగా కొంత రొటీన్‌గానే అనిపించినా, దాన్ని తెరకెక్కించిన తీరు, నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. ఆద్యంతం ఎంగేజ్‌ చేస్తుంది.

ఫస్టాఫ్‌ అంతా గొయ్య, శ్రీను మధ్య ప్రేమ కథ చుట్టూనే తిరుగుతుంది.  శ్రీను, గొయ్య లవ్‌ ట్రాక్‌ కూడా అంతే స్వచ్ఛంగా ఉంటుంది. ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సహజంగా అనిపిస్తుంది. అందుకే అది మనకు బాగా కనెక్ట్ అవుతుంది.ప్రారంభం కాస్త రొటీన్‌గా అనిపిస్తుంది. కాకపోతే గోచి పాత్ర చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. ఇంటర్వెల్‌ ట్విస్ట్ కట్టిపడేస్తుంది. ఫ్లాష్‌ బ్యాక్‌ అంశాలు ఆకట్టుకుంటాయి.

సెకండాఫ్‌ ఎమోషనల్‌గా మారుతుంది. శ్రీను ప్రేమ విషయం పెదకాపుకి తెలియడం, మరోవైపు గొయ్య లక్ష్మి మరో అబ్బాయితో పెళ్లి చేయాలనుకోవడం, ఈ క్రమంలో ఆ ఏర్పాట్లు జరుగుతుండగా, నెక్ట్స్ ఏం జరగబోతుందనే క్యూరియాసిటీ ఇంట్రెస్ట్‌ కలిగిస్తుంది. సినిమాలో అక్కడక్కడ ట్విస్టులు, క్లిష్టమైన కథని సరళంగా నడిపించిన తీరు బాగుంది. లవ్‌ట్రాక్, యాక్షన్‌ ఎపిసోడ్స్ సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయి.

క్లైమాక్స్ లో సాయికుమార్‌ డైలాగులు ఆకట్టుకుంటాయి. ఆలోచింప చేస్తాయి.  విజువల్స్, గ్రాండియర్‌ నెస్‌ సినిమా స్థాయిని పెంచేలా ఉంటాయి. సినిమాని ఎమోషనల్‌గా నడిపించిన తీరు బాగుంది. అయితే కథ పరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సింది. పాత స్టోరీలా అనిపిస్తుంది. అదే సమయంలో మరింత ఎంగేజింగ్‌గా స్క్రీన్‌ప్లే నడిపించాల్సి ఉంది. 
 

45

నటీనటులుః 

శ్రీను పాత్రలో సదన్‌ బాగా నటించాడు. కొత్త అబ్బాయి అయినా ఈజ్‌తో చేశాడు. మెప్పించే ప్రయత్నం చేశాడు. సిటీ కుర్రాడిగా, పల్లెటూరి అబ్బాయిగా ఆయన నటన ఆకట్టుకుంటుంది. గొయ్య లక్ష్మి పాత్రలో ప్రియాంక ప్రసాద్‌ పల్లెటూరి అమ్మాయిగా బాగా చేసింది. వీరిద్దరి లవ్‌ ట్రాక్ ఆకట్టుకుంటుంది. ఇక పెదకాపు పాత్రలో సాయికుమార్‌ తన మార్క్ నటనతో మెప్పించాడు. పాత్రలో జీవించాడు.

సినిమాలో మరో హైలైట్‌గా నిలిచిన పాత్ర గోచి. ఆ రోల్‌లో సునీల్‌ చాలా బాగా చేశాడు. ఆద్యంతం నవ్వులు పూయించాడు. నవ్విస్తూనే ఎమోషనల్ గా ఆకట్టుకునే పాత్ర ఇది. పృథ్వీ సైతం తన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడు. మిగిలిన పాత్రలో ఓకే అనిపిస్తాయి. 
 

55

టెక్నీషియన్లుః 
టెక్నీకల్‌గా సినిమా చాలా బలంగా ఉంది. విజువల్స్, మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. మార్కండేయ అందించిన పాటలు అలరిస్తాయి. బీజీఎం సైతం అదిరిపోయింది. పెద్ద సినిమాల రేంజ్‌లో ఉంది. ప్రసాద్‌ ఈదర కెమెరా వర్క్‌ బాగుంది. విజువల్స్ గా సినిమా గ్రాండియర్‌గా కనిపించాయి. సాంగ్స్ చిత్రీకరణ చాలా అందంగా ఉంది.

ఇక దర్శకుడు విఘ్నేష్‌ స్క్రీన్‌ప్లే పరంగా మ్యాజిక్‌ చేశాడు. కానీ కొత్త కథని రాసుకోలేకపోయాడు. కథ పరంగానూ కొత్తగా ప్రయత్నించాల్సింది. కానీ సినిమాని నడపించే విషయంలో ఆయన చాలా వరకు సక్సెస్‌ అయ్యాడని చెప్పొచ్చు. పునర్జన్మల ఎపిసోడ్‌ని బాగా డీల్‌ చేయాల్సింది. బలమైన విలన్‌ లేకపోవడం సినిమాకి పెద్ద మైనస్‌. దీంతో హీరోయిజం పండలేదు. ఆ జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. 

ఫైనల్‌గాః రా అండ్‌ రస్టిక్‌ కథలు ఇష్టపడేవారికి నచ్చే మూవీ. 

రేటింగ్‌ః2.75

read more: షూటింగ్‌ ప్రారంభమై ఆగిపోయిన సౌందర్య, వెంకటేష్‌ల సినిమా ఏంటో తెలుసా? కారణం ఎవరు? అసలేం జరిగిందంటే

also read: అల్లు అర్జున్‌ కేసులో ట్విస్ట్.. పోలీసులకు షాక్ ఇచ్చిన మృతురాలి భర్త ,హైకోర్ట్ ఏం చేసిందంటే..?

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories