అతనో స్టార్ హీరో తనయుడు, యంగ్ హీరోగా ప్రయత్నం చేశాడు. కాని సక్సెస్ లేక విదేశాలకు వెళ్లాడు.. అక్కడ ఉద్యోగం చేసుకుంటున్నాడు అనుకుంటున్నారా..? కాదు వ్యవసాయం చేస్తున్నాడు. ఇంతకీ ఎవరా హీరో.
ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమా స్టార్ల జీవితాలు చాలా లగ్జరీగా ఉంటాయి. ఏసీ కార్లు.. బ్రాండెడ్ దుస్తులు, ఎండ ఎరుగని బ్రతుకులు..మట్టి వాసన తెలియని జీవితాలు వారివి అని అనుకుంటారు చాలా మంది. కాని సెలబ్రిటీల లైఫ్ స్టైల్ లోపల ఎలా ఉంటుందో చాలా మందికి తెలియదు బ్రాండెడ్ వస్తువులు, ఖరీదైన కార్లు, విశాలమైన ఇళ్లలో విలాసవంతమైన జీవితం మాత్రమే వారికి కనిపిస్తుంది.
కాని లోపల వారు పడే కష్టాలు ఎవరికి కనిపించవు. అలా అని అందరు కష్టపడతారు అని లేదు. కొంత మంది స్టార్లు కాస్ట్లీ లైఫ్ కు.. దూరంగా..నిరాడంబర జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఎంత ఎదిగిన ఒదిగి ఉంటారు. అలాంటి హీరో గురించి మనం తెలుగుసుకుందాం..? ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ సౌత్ ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరో తనయుడు సినిమాలు సరిపడక.. ప్రపంచానికి దూరంగా బ్రతుకుతున్నాడు.
అతను ఎవరో కాదు మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ తనయుడు ప్రణవ్. మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ సినిమా ప్రపంచానికి దూరంగా బ్రతుకుతున్నాడు. లగ్జరీ లైఫ్ ను పక్కన పెట్టేసి.. తన మనసుకు నచ్చిన వ్యవసాయం చేస్తున్నాడు. అది కూడా ఇక్కడ కాదు విదేశాల్లో. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఒక్కగానొక్క కొడుకు ప్రణవ్ మోహన్ లాల్.
బాల నటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రణవ్... చైల్డ్ ఆర్టిస్ట్ గా ఫస్ట్ మూవీకే కేరళ రాష్ట్ర అవార్డును అందుకున్నాడు. ఆతరువాత సినిమాలు చేయలేదు ప్రణవ్. కాస్త గ్యాప్ తరువాత రీ ఎంట్రీ ఇచ్చిన స్టార్ వారసుడులు మల్టీ టాలెంట్ చూపిస్తున్నాడు. యాక్టర్ గా, ప్లే బ్యాక్ సింగర్ గా, లిరిక్ రైటర్ గా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. అంతే కాదు అతను స్పెషల్ ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నాడట.
ఈ విషయాన్ని మోహన్ లాల్ భార్య సుచిత్ర మోహన్ లాల్ వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. తన ఏకైక తనయుడు ప్రణవ్ వర్క్ అవే ప్రోగ్రాం లో భాగంగా విదేశాల్లో ఉన్నాడన్నారు. ప్రస్తుతం ప్రణవ్ స్పెయిన్ లో ఉన్నాడట. స్పెయిన్ లో వ్యవసాయం చేస్తూ అక్కడి రైతులతో కలిసిపోయి ప్రయోగాలు చేస్తున్నాడట.
అంతే కాదు గుర్రాలు, గొర్రెలు, పశువులను మేపుతూ.. తనకు ఇష్టమైన రైతు జీవితాన్ని గడుపుతున్నాడట ప్రణవ్. నలుగురు నడిచే దారిలో కాకుండా తానకు నచ్చింది, తాను నమ్మింది మాత్రమే చేస్తాడని.. చాలా సింపులు లైఫ్ ను గడపడానికి ప్రణవ్ ఇష్టపడతాడని సుచిత్ర అన్నారు.
66
ఇక ప్రణవ్ సినీ కెరీర్ విషయానికొస్తే.. 2018 లో హీరోగా ప్రస్థానం మొదలుపెట్టిన ప్రణవ్.. తొలి సినిమాతోనే బెస్ట్ డెబ్యూ విభాగంలో సైమా అవార్డు అందుకున్నారు. 2022 లో వచ్చిన హృదయం మూవీ తో విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ సక్సెస్ కూడా సాధించాడు. ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి రైతు అవతారం ఎత్తాడు.