నయన్ డాక్యుమెంటరీ: మహేష్‌ రివ్యూ పై ఫన్ని ట్రోలింగ్,సరదా కామెంట్స్

First Published | Nov 21, 2024, 6:14 AM IST

 మహేష్‌ బాబు నయన్‌ డాక్యుమెంటరీ నచ్చడంతో అందరి దృష్టి దీనిపై పడింది.  దీంతో నెటిజన్లు ఫన్నీ సెటైర్లు వేయటం మొదలెట్టారు. 

Mahesh Babu, Nayanthara, Documentary


గత  కొద్ది  రోజులుగా నయనతార-ధనుష్ వివాదం తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. 3 సెకన్ల ఫుటేజీ కోసం రూ.10 కోట్లు డిమాండ్ చేయడం ఏంటా అని నయనతార  అడగడంతో ధనుష్ ఫ్యాన్స్ దానికి ఓ రేంజిలో కౌంటర్స్ ఇస్తున్నారు.

మరోవైపు నయన్ అభిమానులు.. ధనుష్ కు చెందిన పాత విషయాల్ని తవ్వి తీసే పనిలో ఉన్నారు. ఇలా ఎవరి హడావిడిలో వాళ్లు ఉండగానే డాక్యుమెంటరీ నెట్ ప్లిక్స్ లో స్ట్రీమింగ్ మొదలెట్టేసింది. 


 'నయనతార: బియాండ్ ద లైఫ్ స్టోరీ'  అనే టైటిల్ తో వచ్చిన  డాక్యుమెంటరిలో నయనతార జీవితం, పెళ్లి గురించిన విషయాలు ఉన్నాయి. ఈ డాక్యుమెంటరీ అద్బుతం కాదు కానీ సోసో అనే రివ్యూస్ వచ్చాయి.

అయితే ఈ డాక్యుమెంటరీ చూసిన మహేశ్ బాబు.. మూడు లవ్ ఏమోజీలతో ఇన్ స్టాలో స్టోరీ పెట్టాడు. ఎలాంటి కామెంట్‌ చేయకుండ జస్ట్‌ మూడు రెడ్‌ ఎమోజీలతో తన రియాక్షన్‌ తెలిపటం, నయన్ డాక్యుమెంటరీపై ఆయన స్పందించడం ప్రస్తుతం ఆసక్తిని సంతరించుకుంది.


 ఈ విషయమై  నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. సినిమాలే కాకుండా డాక్యుమెంటరీలు కూడా చూస్తున్నారా? అని కొందరు ఫన్నీగా కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక మహేష్‌ బాబు నయన్‌ డాక్యుమెంటరీ నచ్చడంతో అందరి దృష్టి దీనిపై పడింది.  దీంతో నెటిజన్లు ఫన్నీ సెటైర్లు వేయటం మొదలెట్టారు. డాక్యుమెంటరి కన్నా ఆ కామెంట్సే ఇప్పుడు ఎక్కువ  వైరల్ అవుతున్నాయి. ఇంతకీ మహేష్ ని ఉద్దేశించి ఫ్యాన్స్ ఏమన్నారో చూద్దాం. 
 


మహేష్ ని సీరియస్ గా కాదు కానీ సరదా కామెంట్స్ తో సోషల్ మీడియా జనం మోతెత్తిస్తున్నారు. ఆ కామెంట్స్ లో కొన్ని నయన్ డాక్యుమెంటరీ మహేశ్‌కి అంత నచ్చేసిందా? షూటింగ్ లేకపోయేసరికి ఫుల్ ఖాళీగా ఉన్నట్లున్నాడు?  అని కొందరు.... సినిమాలే కాకుండా డాక్యుమెంటరీలని కూడా వదలకుండా రివ్యూస్ ఇచ్చేస్తున్నాడుగా అనే ఫన్నీ సెటైర్లు నుంచి స్వయంగా అతడి అభిమానుల నుంచే వస్తున్నాయి.

Nayanthara


మరికొందరు ఇంకో అడగు ముందుకు వేసి, రాజమౌళి గారు..మహేష్ బాబుకు ఏదైనా వర్క్ ఇవ్వచ్చు కదా అంటూ ఫన్నీ ట్రోలింగ్ మొదలెట్టారు. అయితే ఇందులో సీరియస్ ట్రోలింగ్ కాదు, సరదా విషయాలే కాబట్టి అందరూ లైట్ తీసుకుంటున్నారు.

ఏదైమైనా  ఈ వ్యవహారంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు చేసిన ఇన్ స్టా పోస్ట్ మరింత ఆసక్తి కరంగా మారింది. నయన్ ఫ్యామిలీ ఫోటో ను ఇన్ స్టా స్టోరీ గా పెడుతూ లవ్ సింబల్ జత చేస్తూ షేర్ చేయటం చాలా మందికి నచ్చేసింది. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారి డాక్యుమెంటరీకు వ్యూస్ గా కన్వర్ట్ అవుతాయి. 


ఈ నేపధ్యంలో కొందరు తమిళ సినిమా అభిమానులు ఓ అడుగు ముందుకు వేసి...ధనుష్ తో నయనతార వ్యవహారనికి సంబంధించి ఒక స్టార్ హీరో పై ధైర్యంగా మాట్లాదారు అంటూ మెచ్చుకుంటున్నారు. నయనతార ఎన్నో అవమానాలు ఎదుర్కొని నేడు లేడీ సూపర్ స్టార్ రేంజ్ కు చేరుకున్నావ్ అని ఆమెను  అభినందిస్తున్నారు. అందుకే మహేష్ బాబు ..ఆమెను సపోర్ట్ చేయటానికే పోస్ట్ పెట్టాడని అంటున్నారు. 
 


ప్రస్తుతం రాజమౌళి సినిమా మేకోవర్ అవుతున్న మహేశ్ బాబు.. మొన్నటివరకు గడ్డంతో కనిపించాడు. తాజాగా కీరవాణి కొడుకు ప్రీ వెడ్డింగ్‌లో క్లీన్ షేవ్‌తో దర్శనమిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అ‍య్యాయి.
 

Latest Videos

click me!