Prabhas Raja Saab Movie: ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ మూవీ నిరాశ పరచడంతో చాలా లెక్కలు మారిపోయాయి. ఇప్పడు ప్రభాస్ సినిమాల లైనప్ గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు రాజాసాబ్ చిత్రం అతి పెద్ద నిరాశగా మారింది. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఒక్క సినిమా ఫ్లాప్ అయితే చాలు.. చాలా లెక్కలు మారిపోతాయి. ఇప్పుడు ప్రభాస్ విషయంలో కూడా అదే జరిగింది.
25
రాజాసాబ్ రిజల్ట్
రాజాసాబ్ రిజల్ట్ తో ప్రభాస్ క్రేజీ ప్రాజెక్ట్స్ ని వెంటవెంటనే పూర్తి చేయాలని అనుకుంటున్నారట. ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్, ఫౌజీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఆ తర్వాత ప్రభాస్ సలార్ 2 ప్రారంభిస్తారు అని వార్తలు వచ్చాయి. కానీ సలార్ 2 ఇప్పట్లో ఉండే అవకాశం లేదని.. తాత్కాలికంగా ఈ చిత్రాన్ని ప్రభాస్ పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
35
కల్కి 2 ప్రారంభించబోతున్న ప్రభాస్
ఈ క్రమంలో ప్రభాస్ కల్కి 2 చిత్రాన్ని తెరపైకి తీసుకువచ్చారు. కల్కి 2 చిత్రం సెట్స్ పైకి వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది అని అంతా భావించారు. కానీ వచ్చే నెలలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ప్రభాస్ కాల్షీట్లు కూడా కేటాయించారు.
స్పిరిట్ మంచి క్రేజ్ ఉన్న మూవీ. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై కనీ వినీ ఎరుగని క్రేజ్ ఉంది. ఇక కల్కి 2 గురించి చెప్పనవసరం లేదు. కల్కి 2898 ఎడి మూవీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీనితో కల్కి 2 పై భారీ అంచనాలు ఉన్నాయి.
55
ఫౌజీ చిత్రం
ఈ లెక్కలన్నీ వేసుకునే ప్రభాస్ కల్కి 2 చిత్రాన్ని తెరపైకి తీసుకువస్తున్నారు అని అంటున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కావలసి ఉంది.