Jagapathi Babu: టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున కి ఇండస్ట్రీలో చాలా మంది స్నేహితులు ఉన్నారు. అలాంటి వారిలో జగపతిబాబు కూడా ఒకరు. అయితే.. నాగార్జున తో తన స్నేహం గురించి జగపతిబాబు స్వయంగా చెప్పారు..
టాలీవుడ్ స్టార్స్ నాగార్జున,జగపతి బాబులకు పరిచయం అవసరం లేదు. వీరిద్దరూ.. సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినవారే. నాగార్జున ఇప్పటికీ.. హీరోగా సినిమాలు చేస్తున్నారు. జగపతిబాబు మాత్రం.. తన సెకండ్ ఇన్నింగ్స్ రూట్ మార్చి.. విలన్ రోల్స్ చేయడం మొదలుపెట్టారు. కాగా.. వీరిద్దరి మధ్య చాలా మంచి స్నేహం ఉంది. కాగా, వీరు ఒకరినొకరు తమ పేర్లతో కాకుండా నిక్ నేమ్ తో పిలుచుకుంటారట. ఈ విషయాన్ని జగపతి బాబు ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.
23
జగతిబాబుని ఏమని పిలుస్తారో తెలుసా?
సినిమా ఇండస్ట్రీలో ప్రతి హీరో మధ్య పోటీ ఉంటుంది. వాళ్ల కోసం అభిమానులు కొట్టుకుంటూ ఉంటారు. కానీ, హీరోల మధ్య స్నేహం మాత్రం బాగానే ఉంటుంది.నాగార్జున, జగపతి బాబు కూడా తమ స్నేహాన్ని దశాబ్దాలుగా కాపాడుకుంటూ వస్తున్నారు. తనను నాగార్జున ఎప్పుడూ ‘చౌ’ అని పిలుస్తారు అని జగపతి బాబు చెప్పారు. అయితే.. ‘చౌ’ అంటే.. చాలా మంది క్యాస్ట్ చౌదరి అనుకుంటారని.... కానీ కాదు అని ఆయన చెప్పారు.
‘నాకు మా తాత గారు జగపతిరావు పేరు పెట్టారు. అయితే.. మా అమ్మ పేరు పెట్టి పిలవలేక.. ముద్దుగా చౌదరి అని పిలిచేది. ఇంట్లో అందరూ అలానే పిలిచేవారు. ఆ చౌదరి కాస్త.. ముద్దుగా ‘చౌ’లాగా మారిపోయిందని.. స్నేహితులు అందరూ తనను అలానే పిలుస్తారు.. నాగార్జున కూడా అలానే పిలుస్తారు’ అని జగపతి బాబు చెప్పారు.
33
వీరి స్నేహం ఎలా మొదలైందంటే...
జగపతి బాబు అన్నయ్య రామ్ ప్రసాద్, నాగార్జున ప్రాణ స్నేహితులు. ఈ పరిచయమే నాగ్ , జగపతి బాబులను మరింత దగ్గర చేసింది.వీరిద్దరూ కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. ఆ షూటింగ్ సమయంలో వీరి మధ్య స్నేహం మరింత బలపడింది. ఇక ఈ ఇద్దరూ టాలీవుడ్‌లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరోలుగా పేరు తెచ్చుకున్నారు.హీరోగా ఒక దశ దాటాక, ఇద్దరూ తమ సెకండ్ ఇన్నింగ్స్‌ను చాలా ధైర్యంగా ప్రారంభించారు. జగపతి బాబు విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తుంటే, నాగ్ విభిన్నమైన పాత్రలతో అలరిస్తున్నారు.