Anudeep Lovestory: నవ్వులు పూయించే అనుదీప్‌ లవ్ స్టోరీ.. ఆ దెబ్బతో ఏకంగా పెళ్లికే దూరం

Published : Jan 28, 2026, 05:08 PM IST

దర్శకుడు అనుదీప్‌ ప్రస్తుతం `ఫంకీ` చిత్రాన్ని రూపొందించారు. ఇది త్వరలో రిలీజ్‌ కాబోతుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తన లవ్‌ స్టోరీని పంచుకున్నారు. మొదటిసారి ఓపెన్‌ అయ్యాడు. 

PREV
15
కామెడీకి కేరాఫ్‌ దర్శకుడు అనుదీప్‌

కామెడీ చిత్రాల దర్శకుడు అనుదీప్‌ `జాతిరత్నాలు`తో ఎంతగా ఆకట్టుకున్నాడో తెలిసిందే. ఈ మూవీ కామెడీ చిత్రాల్లో ఒక నయా ట్రెండ్‌ సెట్టర్‌. ఆ తర్వాత ఈ జోనర్‌లో చాలా సినిమాలు వచ్చాయి. కానీ `జాతిరత్నాలు`ని కొట్టే మూవీ మాత్రం రాలేదని చెప్పొచ్చు. ఈ ఒక్క సినిమాతోనే పాపులర్‌ అయిపోయాడు దర్శకుడు అనుదీప్‌. ఆయన సినిమాలో కామెడీ ఉండటం కాదు, తనలోనే కామెడీ ఉంది. తన ఇన్నోసెంటే నవ్వులు పూయిస్తుంది.

25
అనుదీప్‌ సీక్రెట్‌ లవ్‌ స్టోరీ

అనుదీప్‌ తాజాగా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన లవ్‌ స్టోరీని బయటపెట్టాడు. అనుదీప్‌ ప్రేమ కథ వింటే మాత్రం నవ్వుకోవాల్సిందే. తాజాగా ఆయన సుమకి ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటి వరకు బయటపెట్టని రహస్య ప్రేమకథని ఆయన వెల్లడించారు. స్కూల్‌ టైమ్‌లోనే ఆయన ప్రేమలో పడ్డాడట. ఓ అమ్మాయిని బాగా ప్రేమించాడట. కానీ ఆ అమ్మాయి తనకు హ్యాండిచ్చిందని చెప్పాడు అనుదీప్‌. అయితే తన ప్రేమని ఆమెతో వ్యక్తం చేయలేదట. అప్పట్లో ఎక్కువగా వన్‌ సైడ్‌ లవ్‌ మాత్రమే ఉంటుందని, ప్రపోజ్‌ చేసే ధైర్యం లేదని తెలిపారు.

35
ఇప్పుడు పెళ్లి, ప్రేమ ఆలోచన లేదు

అలా తన స్కూల్‌ లవ్‌ స్టోరీ బ్రేకప్‌ లవ్‌ స్టోరీగా మారిపోయిందని చెప్పాడు. దీనికి సుమ స్పందిస్తూ, ప్రపోజ్‌ చేయకపోతే అది లవ్‌ ఎలా అవుతుందని ప్రశ్నించగా, తనది వన్‌ సైడ్‌ లవ్‌ అని చెప్పి ఆశ్చర్యపరిచాడు. ఆ అమ్మాయి ఎప్పుడో పెళ్లి చేసుకొని ఉంటదని చెప్పాడు. ఆ తర్వాత కాలేజీ టైమ్‌లో కూడా ఎవరితోనూ ప్రేమలో పడలేదట.

45
ప్రేమికుల రజు సందర్భంగా `ఫంకీ` మూవీ రిలీజ్‌

ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ అయ్యారు కదా ఇప్పుడు మళ్లీ ప్రేమ, పెళ్లి సంగతేంటి? అని సుమ ప్రశ్నించగా, ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదని, ఆ వైపు ఆలోచించడం లేదని చెప్పాడు అనుదీప్‌. మొత్తంగా ఇప్పట్లో పెళ్లి లేదని తెలిపారు అనుదీప్‌. ప్రస్తుతం ఆయన `ఫంకీ` అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. విశ్వక్‌ సేన్‌, కయదు లోహర్‌ జంటగా నటించారు. ఈ మూవీ ఫిబ్రవరి 13న ప్రేమికుల రోజు సందర్భంగా విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా సుమకి ఇచ్చిన టీమ్‌ ఇంటర్వ్యూలో అనుదీప్‌ మొదటిసారి తన లవ్‌ స్టోరీని వెల్లడించారు.

55
కొంత గ్యాప్‌ తర్వాత `ఫంకీ` మూవీతో వస్తున్న అనుదీప్‌

అనుదీప్‌ `జాతిరత్నాలు` వంటి హిట్‌ తర్వాత శివకార్తికేయన్‌తో `ప్రిన్స్` అనే మూవీని రూపొందించారు. ఈ చిత్రం ఆడలేదు. దీంతో కొంత గ్యాప్‌తో ఇప్పుడు విశ్వక్‌ సేన్‌ తో `ఫంకీ`మూవీని రూపొందించారు. ఇది ఆద్యంతం కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. ఇటీవల విడుదల చేసిన టీజర్‌ ఆద్యంతం నవ్వులు పూయించిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ మూవీ నుంచి ట్రైలర్‌ రిలీజ్‌ కాబోతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories