ప్రభాస్ ని మార్చి నెలకి సంబంధించిన ఒక బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతుంది. దీంతో ఇప్పుడిది `స్పిరిట్`ని వెంటాడే ప్రమాదం ఉంది. మరి దాన్ని సందీప్ రెడ్డి వంగా బ్రేక్ చేస్తాడా? అనేది చూడాలి.
ప్రభాస్ ఈ సంక్రాంతికి `ది రాజా సాబ్` మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ హర్రర్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్ చేసింది. ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. ఈ క్రమంలో ఇప్పుడు ప్రభాస్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో `ఫౌజీ` చిత్రంలో నటిస్తున్నారు. దీంతోపాటు `స్పిరిట్` చిత్రం చేస్తున్నారు.
25
స్పిరిట్ పై భారీ అంచనాలు
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న `స్పిరిట్` మూవీ ఇటీవలే ప్రారంభమైంది. `అర్జున్ రెడ్డి`, `యానిమల్` వంటి చిత్రాలతో సందీప్ రెడ్డి వంగా తానేంటో నిరూపించుకున్నారు. ఇండియన్ సినిమా మేకింగ్ లెక్కలను మార్చేశారు. అలాంటి దర్శకుడితో ఇండియా బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్ మూవీ చేస్తుండటంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రారంభం నుంచి భారీ హైప్ నెలకొంది.
35
స్పిరిట్ రిలీజ్ డేట్
ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిపోయింది. క్రేజీగా ఉంది. ఆ అంచనాలను మరింతగా పెంచింది. దీనికితోపాడు ఈ సంక్రాంతి సందర్భంగా మరో గుడ్ న్యూస్ చెప్పారు సందీప్ రెడ్డి వంగా. సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 5న ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. దీంతో ప్రభాస్ అభిమానులు హ్యాపీ అవుతున్నారు. సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
అయితే `స్పిరిట్` రిలీజ్ డేట్ అభిమానులను కలవరానికి గురి చేస్తుంది. మార్చి నెల ప్రభాస్ బ్యాడ్‌సెంటిమెంట్‌గా మారింది. ఈ నెలలో విడుదలైన చిత్రాలు పరాజయం చెందాయి. `రాఘవేంద్ర`, `చక్రం`, `రాధేశ్యామ్` చిత్రాలు ఈనెలలోనే విడుదలయ్యాయి. `రాఘవేంద్ర` మూవీ మార్చి 28 2003లో విడుదలయ్యింది. `చక్రం` మార్చి 25 2005లో విడుదలయ్యింది. అలాగే `రాధేశ్యామ్` మార్చి 11న 2022లో విడుదలయ్యింది. ఈ మూడు సినిమాలు బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయం చెందాయి. ఇదే ఇప్పుడు `స్పిరిట్`ని కలవరపెడుతుంది. ప్రభాస్‌కి ఉన్న ఈ మార్చి బ్యాడ్ సెంటిమెంట్ కంటిన్యూ అయితే ఏంటనే ఆలోచనలో పడ్డారు అభిమానులు.
అయితే అక్కడ ఉన్నది సందీప్ రెడ్డి వంగా. అలా జరగానికి వీళ్లేదని, ఇలాంటి బ్యాడ్‌సెంటిమెంట్లు ఆయన్నిఏం చేయలేవని అభిమానులు అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఈ మూవీలో డిమ్రీ తృప్తి హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రకాష్‌రాజ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల మాఫియా నేపథ్యంలో సినిమా సాగుతుందని సమాచారం. ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా బ్రదర్స్ నిర్మిస్తున్నారు.