MSG Movie 5 Days Collections: తన బ్లాక్‌ బస్టర్‌ రికార్డ్ ని బ్రేక్‌ చేసుకున్న చిరంజీవి, ఇక మిగిలింది ఒక్కటే

Published : Jan 17, 2026, 01:37 PM IST

MSG Movie 5 Days Collections: చిరంజీవి నటించిన మన శంకర వర ప్రసాద్‌ గారు మూవీ లేటెస్ట్ కలెక్షన్ల రిపోర్ట్ వచ్చింది. చిరు తన రికార్డులను తానే బ్రేక్‌ చేయడం విశేషం.  

PREV
16
మెగా అభిమానులనే కాదు, యూత్‌ని ఆకట్టుకుంటోన్న చిరంజీవి

`మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీ సంక్రాంతికి విడుదలై ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా మూవీ ఉండటంతో వారు క్యూ కడుతున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి చాలా ఏళ్ల తర్వాత తన వింటేజ్‌ కామెడీ, యాక్షన్‌, స్టయిల్‌తో ఆకట్టుకున్నారు. మరోవైపు ట్రెండ్‌కి తగ్గట్టుగా డాన్స్ లు వేయడం, పంచ్‌లు వేయడంతో నేటి తరం యువత కూడా ఈ మూవీని బాగా చూస్తున్నారు.

26
మన శంకర వర ప్రసాద్‌ గారు 5 రోజుల కలెక్షన్లు

ప్రస్తుతం `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీ ఆద్యంతం అలరిస్తోంది. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ మూవీ లేటెస్ట్ కలెక్షన్ల రిపోర్ట్ వచ్చింది. దీనికి భారీగా కలెక్షన్లు రావడం విశేషం. ఐదు రోజుల్లో ఈ సినిమా ఏకంగా రూ.226 కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. తాజాగా ఈ విషయాన్ని టీమ్‌ ప్రకటించింది. ఈ మేరకు కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది. ఆల్‌ టైమ్‌ ఇండస్ట్రీ రికార్డుని క్రియేట్‌ చేసిందని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక షేర్‌ సాధించిన చిరంజీవి మూవీగా నిలిచింది.

36
మన శంకరవర ప్రసాద్‌ గారు రోజు వారి కలెక్షన్లు

ఈ సినిమా మొదటి రోజు రూ.84కోట్లు రాబట్టింది. రెండో రోజు రూ.36(టోటల్‌ రూ.120)కోట్లకుపైగా వసూలు చేసింది. మూడో రోజు రూ.32(టోటల్‌ రూ. 152)కోట్లు వసూలు చేయగా, నాల్గో రోజు రూ.38(రూ.190)కోట్లు వసూలు చేసింది. ఇక ఐదో రోజులు రూ.36కోట్లు రాబట్టింది. ఇలా మొత్తంగా ఐదు రోజుల్లో ఏకంగా రూ.226కోట్లకుపైగా గ్రాస్‌ సాధించింది. షేర్‌ పరంగా ఇది తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ వసూళ్లు సాధించిందని టీమ్‌ వెల్లడించింది. ఇవన్నీ టీమ్‌ అధికారికంగా ప్రకటించిన వసూళ్లు మాత్రమే.

46
వాల్తేర్‌ వీరయ్య రికార్డు బ్రేక్‌

గతంలో సీనియర్‌ హీరోల్లో అత్యధిక కలెక్షన్లని సాధించిన మూవీస్‌ చిరంజీవి పేరుతోనే ఉన్నాయి. `వాల్తేర్‌ వీరయ్య`, `సైరా` చిత్రాలున్నాయి. దీంతోపాటు వెంకటేష్‌ నటించిన `సంక్రాంతికి వస్తున్నాం` మూవీ ఉంది. తాజాగా వీటి రికార్డులను చిరంజీవి `మన శంకర వర ప్రసాద్‌ గారు` క్రాస్‌ చేసినట్టుగా టీమ్‌ ప్రకటించింది. ఇక గ్రాస్‌ కలెక్షన్ల పరంగా చిరంజీవి నటించిన `వాల్తేర్‌ వీరయ్య`ని బ్రేక్‌ చేసింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.219కోట్లు రాబట్టగా, దాన్ని మన శంకర వర ప్రసాద్‌ గారు దాటేసింది.

56
మన శంకరవర ప్రసాద్‌ గారు టార్గెట్‌ `సైరా`

ఇక ఇప్పుడు చిరంజీవి నటించిన మరో మూవీ `సైరా` టాప్‌లో ఉంది. ఇది రూ.246కోట్లు రాబట్టింది. ఈ శనివారంతో ఆ రికార్డు కూడా బ్రేక్‌ చేయబోతున్నారు చిరు. ఇక మిగిలింది `సంక్రాంతికి వస్తున్నాం` మూవీనే ఉంది. ఈ వీకెండ్‌లో వెంకీ మూవీని కూడా ఇది దాటే అవకాశం ఉంది. ఇదే జరిగితే తెలుగులో సీనియర్స్ లో అత్యధిక కలెక్షన్లని రాబట్టిన హీరోగా చిరంజీవి సరికొత్త రికార్డు క్రియేట్‌ చేస్తారు.

66
మన శంకరవర ప్రసాద్‌ గారు మూవీ ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్లు

చిరంజీవి హీరోగా, వెంకటేష్‌ స్పెషల్‌ అప్పీయరెన్స్ లో మెరిసిన `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీలో నయనతార హీరోయిన్‌గా నటించింది. వీరితోపాటు సచిన్‌ ఖేడ్కర్‌, శరత్‌ సక్సేనా, హర్ష వర్థన్‌, అభినవ్‌ గోమటం, కేథరిన్‌ థ్రేస్సా, బుల్లిరాజు(రేవంత్‌), ఊహా, శ్రీనివాస్‌ రెడ్డి వంటి వారు కీలక పాత్రలు పోషించారు. చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల, సాహు గారపాటి సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన విషయం తెలిసిందే.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories