మెగాస్టార్ చిరంజీవిని ఓ నటి ముద్దుగా నల్లబావ అని పిలుస్తారట. అలా పిలిచినప్పుడు చిరంజీవి రియాక్షన్ ఏంటి ? ఆయన ఫ్యామిలీతో ఆమెకి ఉన్న అనుబంధం ఏంటి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం మన శంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. సంక్రాంతి ముగిసినా శంకర వరప్రసాద్ జోరు తగ్గేలా లేదు. ఇది పక్కన పెడితే చిరంజీవికి సంబంధించిన ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల వివాదాల్లో నిలిచిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ చిరంజీవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
25
నల్ల బావ అని పిలిచిన నటి
చిరంజీవిని హేమ ముద్దుగా నల్ల బావ అని పిలుస్తారట. గతంలో ఓ స్టార్ డైరెక్టర్ ముందు అలా పిలవడంతో చిరంజీవి గారు తనకి చుక్కలు చూపించారు అని హేమ గుర్తు చేసుకుంది. హేమ మాట్లాడుతూ చాలా ఏళ్ళ క్రితం పోకిరి సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో పక్కనే చిరంజీవి గారి సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది.
35
పూరి జగన్నాధ్ కి తెలుసు
పూరి జగన్నాధ్ గారు నాకు బాగా కావలసిన వారు కావడంతో ఆయన్ని కలవడానికి వెళ్ళాను. ఏంటి ఇక్కడ ఉన్నావ్ అని పూరి అడిగారు. పక్కనే నల్ల బావ సినిమా షూటింగ్ జరుగుతోంది అని చెప్పా. అవునా.. అయితే నేను కూడా వస్తాను.. వెళదాం పద అని పూరి అన్నారు. నేను చిరంజీవి గారిని నల్ల బావ అని పిలుస్తాను అని పూరి గారికి మరికొందరికి తెలుసు అని హేమ తెలిపింది.
ఇద్దరం వెళ్లి చిరంజీవి గారిని కలిశాం. మిమ్మల్ని హేమ నల్లబావ అని పిలుస్తోంది అని పూరి జగన్నాధ్ చిరంజీవి గారికి చెప్పేశారు. దీనితో నాకు టెన్షన్ మొదలైంది. నేను మరీ అంత నల్లగా ఉన్నానా హేమ అని అడిగారు. అంటే ఏంటి ఇప్పుడు నాగబాబు తెల్లబావ, పవన్ కళ్యాణ్ చిన్న బావ అవుతారా నీకు అని నన్ను ఆడేసుకున్నారు.
55
సురేఖ కొణిదెల ఏం చేశారంటే
మరుసటి రోజు షూటింగ్ కి పరుచూరి వెంకటేశ్వర రావు గారు వచ్చారు. నన్ను ముందు పెట్టుకుని.. నేను నల్లగా ఉన్నానా వెంకటేశ్వర రావు గారు అని అడిగారు. ఆయన మీరు నల్లగాలేరు బాబు.. చామనఛాయ అని చెప్పారు. నన్ను చిరంజీవి గారు ఆడుకుంటున్నారు అనే విషయం ఆయనకి తెలియదు. తన ఇంట్లో ఏ మంచి విషయం జరిగినా తాను నాగార్జున, చిరంజీవి గారికి చెబుతాను అని హేమ అన్నారు. తాను బీఎండబ్ల్యూ ఎక్స్ 5 కారు కొన్నప్పుడు తొలిసారి కీస్ చిరంజీవి గారి చేతుల మీదుగా తీసుకొవాలి అనుకున్నా. చిరంజీవి గారికి చెబితే వెంటనే ఓకె చెప్పారు. అలా ఆయన చేతుల మీదుగా కీస్ తీసుకుని కారు డ్రైవ్ చేశా. చిరంజీవి గారు కారులో కూర్చున్నారు. ఆయన ఇంటి చుట్టూ డ్రైవ్ చేశా. ఈ లోపు చిరంజీవి గారి సతీమణి సురేఖ గారు పట్టు చీర, పసుపు కుంకుమ రెడీ చేసి నాకు కానుకగా ఇచ్చి పంపారు. చిరంజీవి గారి ఫ్యామిలీతో అంత మంచి రిలేషన్ ఉంది అని హేమ గుర్తు చేసుకున్నారు.