హ్యాట్రిక్ విన్నింగ్ కోసం యంగ్ రెబల్ స్టార్ ప్రయత్నం
యంగ్ రెబల్ స్టార్ దూసుకుపోతున్నాడు. వరుస పాన్ ఇండియా సినిమాలతో హడావిడి చేస్తున్నాడు. బాహుబలితో అంతర్జాతీయ గుర్తింపు సాధించిన ప్రభాస్, ఆతరువాత వరుసగా మూడు పాన్ ఇండియా ప్లాప్ లను తన ఖాతాలో వేసుకున్నాడు. అయినా సరే ప్రభాస్ ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆయన క్రేజ్ కూడా అలాగే ఉంది. టైమ్ కోసం ఎదురు చూస్తూ.. తన పని తాను చేసకుంటూ వెళ్లిన యంగ్ రెబల్ స్టార్ కు, సలార్, కల్కీ రూపంలో మళ్లీ టైమ్ వచ్చింది. కోల్పోయిన ఫామ్ తిరిగి వచ్చింది. అదే జోష్ తో హ్యాట్రిక్ హిట్ కు గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు ప్రభాస్.