మెగా హీరోల వెరైటీ మీటింగ్.. గుర్తు పట్టలేని విధంగా రామ్ చరణ్, సాయి దుర్గ తేజ్

Published : Aug 10, 2025, 02:35 PM IST

మెగా హీరోలు ఊహించని ప్రదేశంలో మీట్ అయి ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేశారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 

PREV
15
మెగా హీరోల మీటింగ్ 

మెగా కుటుంబంలోని హీరోల మధ్య ఉన్న బంధం ఎప్పుడూ ప్రత్యేకమే. సందర్భం వచ్చినప్పుడల్లా మెగా హీరోలు ఫ్యామిలీ మొత్తం మీట్ అవుతారు. ఆ క్షణాలని మెమొరబుల్ గా మార్చుకుంటారు. ఈసారి మెగా హీరోల మీటింగ్ చాలా వెరైటీగా జరిగింది. ఆదివారం రోజు మెగా హీరోలు రాంచరణ్ తేజ్, సాయి దుర్గ తేజ్, వరుణ్ తేజ్ జిమ్ లో కలుసుకున్నారు. 

DID YOU KNOW ?
పెద్ది మూవీలో కీలక పాత్రల్లో..
రామ్ చరణ్ పెద్ది చిత్రంలో బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
25
గుర్తుపట్టలేని విధంగా రామ్ చరణ్ 

సాయి దుర్గ తేజ్, వరుణ్ తేజ్ ఈ ఫోటోని తమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, అది మెగా అభిమానుల్లో ఉత్సాహం నింపింది. ఆ ఫోటోలో రామ్ చరణ్ బలమైన శరీర నిర్మాణంతో, బాగా పెరిగిన గడ్డంతో, స్ట్రాంగ్  బైసెప్స్‌తో కనిపిస్తున్నారు. రాంచరణ్ ని సడెన్ గా చూస్తే గుర్తు పట్టడం కష్టం. అంతలా చరణ్ బాడీ ట్రాన్స్ ఫర్మేషన్ ఉంది.చరణ్ తో పాటు వరుణ్ తేజ్, సాయి దుర్గ తేజ్ కూడా వర్కౌట్‌లో పాల్గొన్నారు. సాయి దుర్గ తేజ్ కూడా గుర్తు పట్టలేని విధంగా మారిపోయాడు. ఆదివారం విశ్రాంతి తీసుకోకుండా, ఫిట్‌గా ఉండేందుకు ముగ్గురు హీరోలు జిమ్‌కి హాజరైన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది.

35
అంచనాలు పెంచేస్తున్న చరణ్ మేకోవర్ 

ఈ ఫోటో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ముఖ్యంగా ‘పెద్ది’ చిత్రంలో రామ్ చరణ్ షర్ట్‌లెస్ లుక్ చూడాలనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది. ఈ చిత్రం బుచ్చి బాబు దర్శకత్వంలో రూపొందుతోంది.ఈ మూవీలో రామ్ చరణ్ మేకోవర్ అంచనాలు పెంచేస్తోంది. 

45
వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ చిత్రాలు

ఇక వరుణ్ తేజ్ ప్రస్తుతం ‘కొరియన్ కనకరాజు’ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. మరోవైపు సాయి ధర్మ తేజ్ ‘సంబరాల ఏటి గట్టు’ చిత్రంలో నటిస్తున్నారు. ముగ్గురూ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, ఫిట్‌నెస్ విషయంలో మాత్రం ఎప్పుడూ సమయం కేటాయిస్తారు.

55
ఫ్యాన్స్ ఆశలన్నీ పెద్ది పైనే 

రామ్ చరణ్ పెద్ది చిత్రం కోసమే ఇలా తన మేకోవర్ మార్చుకుంటున్నారు. గేమ్ ఛేంజర్ ఫ్లాప్ కావడంతో మెగా అభిమానుల ఆశలన్నీ ఇప్పుడు పెద్ది చిత్రంపైనే ఉన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ కి కూడా సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది.ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కానుంది.  

Read more Photos on
click me!

Recommended Stories