ప్రభాస్ తో సినిమా అంటే సెట్ లో సందడి తో పాటు.. కడుపునిండా తిండి కూడా ఉంటుంది. యంగ్ రెబల్ స్టార్ ఆతిథ్యం ఎలా ఉంటుంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక హీరోయిన్ అయితే ప్రభాస్ పెట్టిన ఫుడ్ తిని షూటింగ్ అయిపోయేవరకూ 4 కేజీలు బరువు పెరిగిందట.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. పాన్ ఇండియా హీరోగా వెలుగు వెలుగుతున్నాడు. తాజాగా ఆయన ది రాజాసాబ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈసినిమాపై నెగెటీవ్ టాక్ వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ టైమ్ లో ప్రభాస్ ఆతిథ్యం గురించి మరోసారి చర్చల్లోకి వచ్చింది. ప్రభాస్ మంచి భోజన ప్రియుడు అని అందరికి తెలిసిందే..? ఆయనతో పాటు.. ఆయన వెంట ఉన్నవారికి.. కూడా కడుపునిండా.. మంచి విందు ఉంటుంది. ప్రభాస్ షూటింగ్ కు వెళ్తే.. అక్కడ టీమ్ అందరికి.. ప్రభాస్ తను తినే ఫుడ్డే అందిస్తుంటాడు.
24
ప్రభాస్ ఇంట రాజుల భోజనం..
ప్రభాస్ తన ఇంటికి ఎవరు వచ్చినా.. రాజుల భోజనం రుచు చూడాల్సిందే. ప్రభాస్ షూటింగ్ లో హీరోయిన్లు, ఆర్టిస్ట్ లు అందరికి ప్రభాస్ ఇంటి నుంచే భోజనాలు వస్తుంటాయి. ఈ ట్రెడిషన్ ను తన పెదనాన్న కృష్ణం రాజు నుంచి ప్రభాస్ నేర్చుకున్నారు. ప్రభాస్ ట్రీట్ ను టేస్ట్ చేసిన స్టార్స్ ఎవరైనా కూడా ఫిదా అయిపోతుంటారు. ఎన్నోసార్లు ఇంటర్వ్యూలో ఎంతో మంది స్టార్స్ ప్రభాస్ ఇంటి భోజనం గురించి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా రాజాసాబ్ షూటింగ్ లో కూడా ప్రభాస్ ట్రీట్ గురించి ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. హీరోయిన్లతో పాటు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా ప్రభాస్ ఇంటి భోజనం గురించి కామెట్ చేశాడు.
34
ఎవరికైనా ఒకే రకం భోజనం..
ప్రభాస్ ఇంటి భోజనం అంటే.. షూటింగ్ లో లైట్ బాయ్ దగ్గర నుంచి స్టార్ హీరోయిన్లు.. స్టార్ డైరెక్టర్ల వరకూ..అందరూ ఎంతో ఇష్టపడుతుంటారు. ప్రభాస్ సెట్స్ లో ఉన్నాడంటే.. వారు కడుపునిండా నాలుగైదు రకాల నాన్ వెజ్ ఐటమ్స్ తో భోజనం చేసినట్టే. ఇక తన కో ఆర్టిస్ట్ లకు కూడా తన ఇంటి భోజనాన్ని రుచి చూపించి.. జన్మలో మర్చిపోలేని ట్రీట్ ఇస్తుంటాడు ప్రభాస్. ఈక్రమంలో ప్రభాస్ ఇంటి భోజనం గురించి టాలీవుడ్ లో ఎప్పటికప్పుడు పెద్ద చర్చ నడుస్తూనే ఉంటుంది.
ప్రభాస్ ఇంటి భోజనం తిని 4 కేజీలు బరువు పెరిగానంటోంది హీరోయిన్ రిద్ధి కుమార్. రాజాసాబ్ సినిమాలో ఒక హీరోయిన్ గా రిద్ధి కుమార్ నటించింది. ఈసినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు ప్రభాస్ తో పాటు భోజనం చేసేవారమని చెప్పిన ఆమె.. ఆ భోజనం ఎంత అద్భుతంగా ఉంటుందో వివరించింది. అది తినకుండా ఉండలేము.. తింటే డైట్ బ్రేక్ అవుతుంది. కానీ తినక తప్పదు. అలా తినే తాను 4 కేజీలు బరువు పెరిగానని రిద్ధి కుమార్ అన్నారు. ఆ వెయిట్ లూస్ అవ్వడానికి మళ్లీ గట్టిగా వర్కౌట్లు చేయాల్సి వచ్చిందని రిద్ధి కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం ఆమె కామెంట్లు వైరల్ అవుతున్నాయి.