Sridivya without Makeup: మేకప్ లేకుండా నేచురల్‌ అందంతో కట్టిపడేస్తున్న శ్రీదివ్య.. లేటెస్ట్ ఫోటోలు

Published : Jan 10, 2026, 09:57 PM IST

Sridivya without Makeup: శ్రీదివ్య తెలుగు అమ్మాయి అయినా తమిళంలో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. తాజాగా ఆమె అభిమానులను సర్‌ప్రైజ్‌ చేసింది. మేకప్ లేకుండా తన లేటెస్ట్ ఫోటోషూట్ ఫోటోలను పంచుకుంది. 

PREV
17
కోలీవుడ్‌లో పాపులర్‌ అయిన తెలుగు నటి శ్రీదివ్య

తెలుగు ఫ్యామిలీకి చెందిన హీరోయిన్‌ శ్రీదివ్య ఇప్పుడు తమిళంలో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తోంది. అక్కడ మంచి విజయాలు అందుకుని మెప్పిస్తుంది. ఇటీవల `సత్యం సుందరం` మూవీలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే.  లేటెస్ట్ గా ఆమె అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. 

27
మేకప్‌ లేకుండా కనిపించి శ్రీదివ్య సర్‌ప్రైజ్‌

తాజాగా ఇన్‌ స్టాగ్రామ్‌లో తన ఫోటోలను పంచుకుంది. చాలా నేచురల్‌గా ఉన్న ఈ పిక్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇందులో శ్రీదివ్య మేకప్‌ లేకుండా కనిపించడం విశేషం. మేకప్‌ లేకపోయినా ఆమె అందం ఏమాత్రం తగ్గలేదు. పైగా  పెరిగింది. దీంతో శ్రీదివ్య ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అభిమానులను అలరిస్తున్నాయి. 

37
శివకార్తికేయన్‌ సినిమాతో కోలీవుడ్‌ ఎంట్రీ

శివకార్తికేయన్ నటించిన 'వరుత్తపడాద వాలిబర్ సంగం' సినిమాతో కోలీవుడ్‌లో  ఫేమస్ అయ్యింది. ఆమె సొంతూరు హైదరాబాద్‌ అయినా, తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేసింది. ఇటీవలి కాలంలో ఆమెకు సినిమా అవకాశాలు తగ్గాయని చెప్పొచ్చు.

47
బాలనటిగా శ్రీదివ్య తెలుగు ఆడియెన్స్ కి పరిచయం

`హనుమాన్‌ జంక్షన్‌` మూవీతో బాలనటిగా తెలుగు ఆడియెన్స్ కి పరిచయం అయ్యింది శ్రీదివ్య. తొలి చిత్రంతోనే బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత మహేష్‌ బాబు హీరోగా నటించిన `యువరాజు` చిత్రంలోనూ బాలనటిగా మెరిసింది.

57
బాలనటిగా నంది అవార్డు

ఇలా వరుసగా `వీడే`, `భారతి` చిత్రాల్లో నటించింది. `భారతి` మూవీకిగానూ ఉత్తమ బాలనటిగా నంది అవార్డుని అందుకుంది. ఆ తర్వాత నాలుగేళ్లు గ్యాప్‌ ఇచ్చింది శ్రీదివ్య.

67
`మనసారా` మూవీతో హీరోయిన్‌గా పరిచయం

`మనసారా` మూవీతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది శ్రీదివ్య. `బస్‌ స్టాప్‌` మూవీ మంచి గుర్తింపుని, బ్రేక్‌ని తీసుకొచ్చింది. తెలుగులో పాపులర్‌ అయ్యింది. ఆ తర్వాత `మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు` మూవీతో మరో డీసెంట్‌ హిట్‌ని అందుకుంది.

77
సినిమాలు తగ్గించిన శ్రీదివ్య

ఆ తర్వాత తెలుగులో `వారధి`, `కేరింత` తో మెప్పించింది. ఆ తర్వాత తమిళంలోకి షిఫ్ట్ అయి అక్కడ వరుసగా సినిమాలు చేసింది. తెలుగులో మళ్లీ మూవీస్‌ చేయలేదు. తమిళంలోనూ చాలా సెలక్టీవ్‌గా వెళ్తోంది శ్రీదివ్య.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories