నాగార్జున ను 15 ఏళ్లుగా వెంటాడుతున్న అనారోగ్య సమస్య ఏంటో తెలుసా? ఎందుకు తగ్గడంలేదు?

Published : Dec 18, 2025, 12:48 PM IST

Nagarjuna Health Issue : కింగ్ నాగార్జున 66 ఏళ్ల వయస్సులో కూడా కుర్ర హీరోలను మించి ఫిట్ నెస్ ను మెయింటేన్ చేస్తున్నారు. అంత ఫిట్ గా కనిపించే నాగ్ కు ఒక అనారోగ్య సమస్య ఉందంటే.. ఎవరైనా నమ్ముతారా? దాదాపు 15 ఏళ్లుగా ఆయను వెంటాడుతున్న ప్రాబ్లమ్ ఏంటి? 

PREV
15
66 ఏళ్ల కుర్రాడు కింగ్ నాగార్జున

టాలీవుడ్ మన్మధుడు నాగార్జునకు పేరుకే 66 సంవత్సరాలు.. మనసు మాత్రం ఇంకా 30 దగ్గరే ఆగిపోయింది. నాగార్జునకు ఏజ్ పెరిగేకొద్ది పిట్ నెస్ తో పాటు గ్లామర్ కూడా పెరుగుతూ వస్తోంది. ఈ ఏజ్ లో కూడా ఫిట్ నెస్ ,జిమ్ ను మెయింటేన్ చేస్తూ.. ఇండస్ట్రీలో కూడా దూసుకుపోతున్నాడు నాగార్జున. అమ్మాయిల మనసులో కలల రాకుమారిడిగా మారిన నాగ్ కు టాలీవుడ్ లో మన్మధుడు అన్న పేరుంది. ఈమధ్యే 66 లోకి అడుగు పెట్టిన కింగ్ .. వయసు పెరుగుతున్నా కొద్ది గ్లామర్, ఫిట్నెస్ కూడా పెంచుకుంటూ.. అంతకు ముందు కంటే ఎక్కువ ఉత్సాహంతో దూసుకుపోతున్నాడు. చిరునవ్వుతో, ప్రశాంతంగా కనిపించే నాగార్జునను చూసి చాలా మంది ఆయన ఇంత యంగ్‌గా ఎలా ఉంటారో, రోజూ ఏం తింటారో తెలుసుకోవాలనుకుంటారు.

25
నాగార్జునను వెంటాడుతున్న అనారోగ్య సమస్య..

చాలా ఫిట్ గా.. హెల్దీగా కనిపించే అక్కినేని నాగార్జునను కూడా ఓ అనారోగ్య సమస్య వెంటాడుతోందట. అది ఇప్పుడు వచ్చింది కాదు.. దాదాపు 15 ఏళ్లుగా ఆ సమస్య తనకు ఉందట. ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాజాగా నాగార్జున ఒక హెల్త్ ఈ వెంట్ కి గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఈవెంట్ అనంతరం నాగార్జున మీడియాతో మాట్లాడగా తనకున్న సమస్య గురించి తెలిపారు.

35
నాగార్జున మాట్లాడుతూ....

''15 ఏళ్ళ క్రితం నాకు మోకాలి నొప్పి మొదలైంది. అప్పట్నుంచి బాధపడుతూనే ఉన్నాను. సర్జరీ అవసరం అని డాక్టర్లు చెప్పినా.. నేను మోకాలు రీప్లేస్మెంట్ చేయించలేదు. ఆపరేషన్ ను అవాయిడ్ చేశాను.కానీ దాన్ని అలా వదిలేయకుండా.. బెటర్ అవ్వడానికి ల్యూబ్రికెంట్ ఫ్ల్యూయిడ్స్ వాడాను, PRP చేయించుకున్నాను. , మోకాలు లోపల కణజాలం రీ జనరేట్ అవ్వడానికి డాక్టర్స్ హెల్ప్ చేశారు. ఒక్కోసారి నొప్పి లేకపోయినా నేను ప్రతి రోజు ఉదయం మోకాలి కోసం రిహాబ్ చేశాను. దాని మీద ప్రత్యేకంగా వర్క్ చేశాను. ఎప్పట్నుంచో ఈ మోకాలి నొప్పికి చికిత్స తీసుకుంటున్నాను. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను''. అని ఆయన అన్నారు.

45
ఆరోగ్యంపై నాగార్జున శ్రద్ధ

ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని నాగార్జున వెల్లడించారు. సర్జరీ చేయించుకోవడం అనే కాన్సెప్ట్ లేకుండా.. జాగ్రత్తలు తీసుకుంటూ.. ఇలా కంటీన్యూ చేయాలని అనుకుంటున్నట్టు నాగ్ వెల్లడించారు. ఇక నాగార్జున చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కింగ్ తన ఆరోగ్యంపై ఇంత శ్రద్ద పెడతారా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. అంత పట్టుదలతో, క్రమశిక్షణతో ఉండబట్టే.. ఈ ఏజ్ లో కూడా నాగార్జున చాలా ఫిట్ గా, హుషారుగా.. కుర్రహీరోలకు పోటీ ఇచ్చే విధంగా ఉన్నారు. సోషల్ మీడియాలో నాగార్జునపై ప్రశంసలు కురుస్తున్నాయి.

55
నాగార్జున 100వ సినిమా ఎప్పుడు?

ప్రస్తుతం నాగార్జున బిగ్ బాస్ బిజీలో ఉన్నారు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 నుంచి ఆయన హోస్ట్ గా ఉన్నారు. ఇప్పటికే విజయవంతంగా 7 సీజన్లను హోస్ట్ చేశారు. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎండ్ కార్డుకు దగ్గరలో ఉంది. ఇక నాగార్జున తన 100 సినిమా సన్నాహాలలో ఉన్నాడు. ఈసినిమాపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. తమిళ యంగ్ డైరెక్టర్ కార్తీక్ ఈసినిమాను తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. డిఫరెంట్ కాన్సెప్ట్ తో.. పక్కా హిట్ కొట్టే విధంగా ఈసినిమాను రూపొందించబోతున్నట్టు తెలుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories