సో ఈమూవీ అయిపోగానే విక్రమ్ 2 వర్క్ ను ఫినిష్ చేసుకుంటాడట. మణిరత్నం సినిమా పూర్తి అవ్వగానే కమల్ హాసన్ లోకేష్ తో జాయిన్ అవ్వబోతున్నడని సమాచారం. అయితే ఇక్కడే మరో బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈసినిమాలో ఓ గెస్ట్ రోల్ చేయబోతున్నాడని తెలుస్తోంది. కమల్ హాసన్ తో ప్రభాస్ కు మంచి సంబధం ఉంది.
ఇద్దరిమధ్య స్నేహం కారణంగా కమల్ హాసన్ అడగ్గానే ప్రభాస్ ఓకే చెప్పినట్టు సమాచారం. ఇక ఈసినిమాను పాన్ ఇండియా రేంజ్ లో భారీ స్థాయిలో తెరెక్కించబోతున్నట్టు సమాచారం. మరి ఈ ప్రాజెక్ట్ఎప్పుడు పట్టాలెక్కబోతోంది. ఎలా ఉండబోతోంది. ఈ వార్తలో నిజం ఎంత అనేది చూడాలి.