విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ సినిమాలను రష్మిక ప్రమోట్ చేయడం. ప్రమోషనల్ ఈవెంట్స్ కు వచ్చి ఆనంద్ తో క్లోజ్ గా మూవ్ అవ్వడం. ఈ ఈవెంట్స్ లో వదినమ్మ అని ఆడియన్స్ అరుస్తున్నా కాస్త కూడా స్పందిచకపోవడం విచిత్రం.
సరే స్పందించకపోయినా.. అదేం లేదు సోషల్ మీడియాలో జరిగేదంటా ఫేక్ న్యూస్.. అంతా గాసిప్స్.. మామధ్య ఏంలేదు అని ఓ స్టెట్మెంట్ అయిన ఇవ్వలేదు ఇద్దరు. దాంతో ఇప్పుడు జనాలంతా ఇక వీళ్లుద్దరు మధ్య ఏదో ఉంది అని అనుకోవడం కాదు.. ఇద్దరు ప్రేమించుకుంటున్నారు.. ఇక పెళ్ళే తరువాయి అంటున్నారు.
దాంతో విజయ్ దేవరకొండ - రష్మికల పెళ్లి ఎప్పుడు అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు ఫ్యాన్స్. కొంత మంది మాత్రం వీళ్ళది ప్రేమే అనడం కరెక్ట్ కాదని.. బెస్ట్ ఫ్రెండ్స్ అయితే ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా మారడంలో తప్పులేదు కదా.. క్లోజ్ గా ఉన్నంత మాత్రాన ప్రేమికులు అయిపోతారా అని అంటున్నారు. అలాంటప్పుడు మే బెస్ట్ ఫ్రెండ్స్ అని స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా అని ఇంకొదరి ప్రశ్న.