రూపాయి కోసం ఇబ్బంది పడ్డ హీరో.. జాతీయ అవార్డ్ స్థాయికి ఎదిగిన స్టార్ ను గుర్తుపట్టారా..?

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ. స్టార్ గా ఎదిగిన వారి వెనుక ఏదో ఒక కథ తప్పకుండా ఉంటుంది. తాజాగా జాతీయ స్థాయి ఉత్తమ నటుడిగా ఎదిగిన హీరో.. ఒకప్పుడు రూపాయి కూడా లేకుండా ఇబ్బందిపడ్డారట. 
 

సినిమా అంటేనే మాయా ప్రపంచం.. అది ఎప్పుడు ఎవరిని ఎక్కడ తీసుకెళ్ళి కూర్చో పెడుతుందో ఎవరికీ తెలియదు. ఎంత కష్టపడ్డా స్టార్లు కాకుండా.. కనుమరుగైన వారు ఉన్నారు.. తమ కష్టంతో పైకి వచ్చినవారు ఎందరో ఉన్నారు. సాధారణ బస్ కండెక్టర్ ఇప్పుడు తమిళ సూపర్ స్టార్.. కానిస్టేబుల్ తనయుడు టాలీవుడ్ ను ఏలుతున్న మెగాస్టార్.. ఇలా ఎవరి జాతకం ఎలా ఉంటుందో తెలియదు. అలానే జేబులో రూపాయి కూడా లేని ఓ వ్యక్తి.. ప్రస్తుతం జాతీయ స్థాయి అవార్డ్ అందుకునే రేంజ్ కు ఎదిగాడు..? 

ప్రభాస్ కోసం 100 ఎకరాలు.. యంగ్ రెబల్ స్టార్ ఏం చేయబోతున్నారో తెలుసా..?

కాంతార పాత్రలో నటించడమే కాదు.. ఆ సినిమాను డైరెక్ట్ చేసి... రెండు డ్యూటీలను అద్భుతంగా పోషించాడు రిషబ్. ఇక కెజియఫ్ తో కన్నడ పరిశ్రమకు మంచి గుర్తింపు వస్తే... కాంతారతో ప్రపంచ వ్యాప్తంగా పేమస్ అయ్యింది. కన్నడ ఇండస్ట్రీ. 

నేషనల్ అవార్డ్స్ లో రికార్డ్ అతనిదే..? అత్యధికంగా జాతీయ అవార్డ్స్ సాధించిన స్టార్ ఎవరు..?
 


National Film Awards Kantara director hero Rishab Shetty profile

ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు.. కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి.  అవును ఒక్క సినిమాలో ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నాడు రిషబ్. ఎక్కడో కన్నడనాట మారుమూల దాగి ఉన్న ఓ ఆచారాన్ని బేస్ చేసుకుని.. ప్రపంచానికి వారిని గొప్పగా చూపించాడు రిషబ్ శెట్టి

రజినీకాంత్ మాటలకు షాక్ అయిన అల్లు అర్జున్, ఏదో అనుకుంటే మరేదో అయ్యింది..?

ఇక రీసెంట్ గా రిషబ్ శెట్టికి.. కాంతారా సినిమాకు గాను బెస్ట్ హీరో క్యాటగిరీలో జాతీయ అవార్డ్ వరించింది. దాంతో శాండల్ వుడ్ పండగ చేసుకుంటుంది. ఈక్రమంలోనే రిషబ్ శెట్టి మరోసారి వైరల్ టాపిక్ అయ్యాడు. ఇండియా వ్యాప్తంగా అతని గురించి మాట్లాడుకుంటున్నారు. ఈక్రమంలో రిషబ్ శెట్టికి సబంధించిన మరో వార్త కూడా సోషల్ మీడియాలో తెగ తిరిగేస్తోంది.  అదేంటంటే..? 

కోట శ్రీనివాసరావు ను ఓవర్ నైట్ స్టార్ ను చేసిన సినిమా ఏదో తెలుసా..?
 

రిషబ్ శెట్టి ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయి. రిషబ్ శెట్టి ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తెలిస్తే సాధారణ వ్యక్తుల కళ్లు సైతం చెమర్చుతాయి. ఒకానొక సమయంలో రిషబ్ శెట్టి బేకరీలో తిన్న ఫుడ్ కు 20 రూపాయలు బిల్లు కాగా జేబులో 19  రూపాయలు చిల్లర మాత్రమే ఉండటంతో.. ఆ ఒక్క రూపాయి కోసం ఆయన చాలా ఇబ్బండి పడ్డాడట.  

అప్పుడు రూపాయి లేదని బాధ పడ్డ స్టేజ్ నుంచి ఇప్పుడు తన సినిమాకు జాతీయ అవార్డ్ అందుకునే స్థాయికి రిషబ్ ఎదిగారు. అందుకే కన్నడ పిల్మ్ ఇండస్ట్రీలో యంగ్ స్టార్స్ కు ఆయన ఆదర్శంగా నిలుస్తున్నాడు. టాలెంట్ తో పైకి ఎలా  ఎదగాలో బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఉన్నారు రిషబ్. ఇక కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి.. ఇతని తమ్ముడే కావడం విశేషం. 

Latest Videos

click me!