లెజెండ్రీ సింగర్ పి సుశీలకి అస్వస్థత.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు 

First Published | Aug 18, 2024, 7:39 AM IST

లెజెండ్రీ గాయని, పద్మభూషణ్ అవార్డు గ్రహీత పి సుశీల అస్వస్థతకి గురయ్యారు. ప్రస్తుతం ఆమె వయసు 88 ఏళ్ళు. తెలుగు, తమిళం, హిందీ తోపాటు మొత్తం 9 భాషల్లో సుశీల 40 వేల పైగా పాటలతో సంగీత ప్రియులని ఉర్రూతలూగించారు.

Singer P Susheela admits in hospital dtr
P Susheela

లెజెండ్రీ గాయని, పద్మభూషణ్ అవార్డు గ్రహీత పి సుశీల అస్వస్థతకి గురయ్యారు. ప్రస్తుతం ఆమె వయసు 88 ఏళ్ళు. తెలుగు, తమిళం, హిందీ తోపాటు మొత్తం 9 భాషల్లో సుశీల 40 వేల పైగా పాటలతో సంగీత ప్రియులని ఉర్రూతలూగించారు. శనివారం రోజు ఆమె అస్వస్థతకి గురయ్యారు. 

Singer P Susheela admits in hospital dtr

ఒక్కసారిగా ఆమె తీవ్రమైన కడుపునొప్పికి గురయ్యారని కుటుంబ సభ్యులు, సన్నిహితులు తెలిపారు. దీనితో హుటాహుటిన చెన్నైలోని కావేరి ఆసుపత్రికి తరలించారు. దీనితో వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించారు. 


ప్రస్తుతం సుశీల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని బయట ప్రచారం జరగడంతో ఆసుపత్రి వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. ఆమె సాధారణ కడుపునొప్పితోనే ఆసుపత్రికి వచ్చారు. కడుపునొప్పి మందులతోనే నయం అవుతుంది అని తెలిపారు. 

అభిమానులు, సన్నిహితులు సుశీల త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు. తన మధుర గాత్రంతో సుశీల దశాబ్దాల కాలం ప్రేక్షకులని అలరించారు. వయసు రీత్యా ఆమె కొంతకాలంగా పాటలు పాడడం లేదు. ఇంటికే పరిమితం అయ్యారు. 

Latest Videos

click me!