నీ భార్య పిల్లలు జాగ్రత్త..క్రేజీ హీరో సినిమా కొనకుండా డిస్ట్రిబ్యూటర్ కి డైరెక్టర్ వార్నింగ్, పెద్ద రచ్చ

First Published | Aug 18, 2024, 9:28 AM IST

టాలీవుడ్ క్రేజీ హీరోల్లో నితిన్ ఒకరు. కెరీర్ ఆరంభం నుంచి నితిన్ ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే నిలదొక్కుకున్నాడు. తిరుగులేని సూపర్ హిట్ చిత్రాలతో పాటు.. అంతే దారుణమైన ఫ్లాప్ చిత్రాలని కూడా నితిన్ చూశారు. 

టాలీవుడ్ క్రేజీ హీరోల్లో నితిన్ ఒకరు. కెరీర్ ఆరంభం నుంచి నితిన్ ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే నిలదొక్కుకున్నాడు. తిరుగులేని సూపర్ హిట్ చిత్రాలతో పాటు.. అంతే దారుణమైన ఫ్లాప్ చిత్రాలని కూడా నితిన్ చూశారు. నితిన్ నటించిన ఒక ఫ్లాప్ చిత్రానికి విచిత్రమైన సంఘటన జరిగింది. 

డైరెక్టర్ తేజ నితిన్ ని టాలీవుడ్ కి పరిచయం చేశారు. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన జయం చిత్రంతో నితిన్ హీరోగా మారాడు. ఆ మూవీ రీ సౌండింగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత నితిన్, తేజ కాంబినేషన్ లో ధైర్యం చిత్రం వచ్చింది. ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. జయం సక్సెస్ ని తేజ, నితిన్ రిపీట్ చేయలేకపోయారు. 


ఈ చిత్రం పూర్తయిన తర్వాత ఒక ఆసక్తికర సంఘటన జరిగిందట. ఆ సంఘటన దర్శకుడు, నిర్మాతల మధ్య వివాదానికి కారణం అయింది. ఈ విషయాన్ని తేజ స్వయంగా చెప్పారు. ధైర్యం షూటింగ్ మొత్తం పూర్తయి రిలీజ్ కి రెడీ అవుతోంది. బిజినెస్ మొదలయింది. 

బయ్యర్లు వచ్చి చిత్రాన్ని కొంటున్నారు అని తేజ అన్నారు. ఒక డిస్ట్రిబ్యూటర్ నా దగ్గరికి వచ్చాడు. సార్ జయం చిత్రాన్ని కూడా నేనే కొన్నా. మంచి లాభాలు వచ్చాయి. ఇప్పుడు ధైర్యం చిత్రాన్ని కొంటున్నా అని చెప్పాడట. ధైర్యం చిత్రం డిజాస్టర్ అవుతుందని తేజకి ఆల్రెడీ తెలుసు. డైరెక్టర్ అతనే కాబట్టి సినిమా ఎలా ఉందో తెలిసిపోయింది. 

దీనితో తేజ ఆ డిస్ట్రిబ్యూటర్ తో.. నీ భార్య పిల్లలు బావున్నారా అని అడిగారు. బావున్నారు సర్ అని అతడు చెప్పాడు. అయితే నీ ఇష్టం, కొంచెం జాగ్రత్త అని తేజ చెప్పారట. తేజ ఎందుకు అలా అన్నారు అని ఆ బయ్యర్ కాస్త అలోచించి ధైర్యం చిత్రం కొనకుండా వెళ్ళిపోయాడు. ధైర్యం ఫ్లాప్ అవుతుందని పరోక్షంగా తేజ అతడికి హింట్ ఇచ్చినట్లు అయింది. 

సినిమా రిలీజ్ అయ్యాక ఈ విషయాన్ని ఆ డిస్ట్రిబ్యూటర్ స్వయంగా నిర్మాతలకి చెప్పాడట. దీనితో నిర్మాతలు తేజపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వే డైరెక్టర్ అయి ఉండి ఇలా చేయడం కరెక్ట్ కాదు అని ప్రశ్నించారు. దీనికి తేజ నేనేమి అతడిని సినిమా కొనద్దు అని చెప్పలేదు. తెలిసిన వ్యక్తి కాబట్టి భార్య పిల్లలు జాగ్రత్త అని చెప్పా అని అన్నారట. ఏది ఏమైనా సినిమా బిజినెస్ ని దెబ్బతీసేలా డైరెక్టర్ వ్యవహరించడం తప్పని అప్పట్లో వివాదం అయింది. 

Latest Videos

click me!