మీమ్ పేజీలు నన్ను కంటిన్యూగా ట్రోల్ చేసిన ఒక టైమ్ ఉంది, వాళ్లు ఎందుకు నా గురించి కంటిన్యూగా నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారని నేను ఆలోచించాను. అది కూడా నన్ను కరెక్ట్‌గా టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారని నేను ఫీలయ్యాను. వేరేవాళ్లను తక్కువ చేయడానికి ఒక గుంపు చాలా డబ్బులు ఖర్చు చేస్తున్నారని తర్వాత నాకు అర్థమైంది. అది నాకు తెలిసినప్పుడు, మా పేరెంట్స్, నేను చాలా బాధపడ్డాం.
కానీ నేను దాన్ని ఒక ప్రైడ్‌గా తీసుకున్నాను. ఎందుకంటే ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేయాలనుకుంటే, మీరు వాళ్లకంటే హై పొజిషన్‌లో ఉన్నారని అర్థం. ఏం ప్రాబ్లం లేదు అని నేను మా పేరెంట్స్‌ను ఓదారుస్తూ ఉండేదాన్ని. కానీ ఒక స్టేజ్‌కి తర్వాత అది ఎక్కువైంది. నన్ను ట్రోల్ చేయడానికి కొంతమంది లక్షల్లో ఖర్చు చేస్తున్నారని నేను కనుక్కున్నాను" అని పూజా అన్నారు.
Also Read: డేవిడ్ వార్నర్ పై అనుచిత వ్యాఖ్యలు, స్పందించిన రాజేంద్ర ప్రసాద్, ఏమన్నాడంటే?