కొన్ని కథలు వినడానికి అంత బాగోవు, కాని సినిమాగా తీస్తేమాత్రం బ్లాక్ బస్టర్ హిట్లు అవుతాయి. అద్భుతమైన సినిమాలుగా మారుతాయి. కథ బాలేదు కదా అని రిజెక్ట్ చేసిన హీరోలు మాత్రం ఆతరువాత అర్రే..చేసి ఉంటే బాగుండేది అనుకుంటారు. కాని మరికొంత మంది హీరోలు మాత్రం కథను విజ్యువలైజ్ చేసుకుని ఫలితాన్ని ముందుగానే అంచనా వేస్తారు.
అలాంటి సినిమా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ కథను 12 మంది హీరోలు తిరస్కరిస్తే.. ఒక్క స్టార్ హీరో మాత్రం నేను చేస్తాను అని ముందుకు వచ్చాడు. అనుకున్నట్టే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇంతకీ ఆసినిమా ఏదో తెలుసా?
Ghajini 2
ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు గజిని. ఆ హీరో సూర్య అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే సూర్యకంటే ముందు ఈసినిమా కథ చాలా మంది హీరోల దగ్గరకు వెళ్ళిందట. కాని హీరో క్యారెక్టరైజేషన్ నచ్చక కొంత మంది. కథ నచ్చక కొంతమంది. ఇతర కారణాలతో మరికొంత మంది ఈసినిమాను రిజెక్ట్ చేశారట.
అందులో మన సూపర్ స్టార్ మహేష్ బాబు తో పాటు అజిత్, మాధవన్, కమల్ హాసన్, విక్రమ్, విశాల్ లాంటి 12 మంది నటులు ఉన్నారు. కాని సూర్య మాత్రం ఈసినిమా కథ నచ్చి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గజినీలో సూర్య ఎంత అద్భుతంగా నటించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏఆర్ మురుగదాస్, సూర్య కాంబినేషన్‌లో వచ్చిన ‘గజిని’ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
Ghajini
ఒక్క తమిళ భాషలో మాత్రమే కాకుండా.. తెలుగులో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేయగా తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది గజినీ సినిమా. టాలీవుడ్ లో డబ్బింగ్ వర్షన్ హిట్ అవ్వడమే కాదు తెలుగులో సూర్య మార్కెట్ డబుల్ చేసింది గజినీ సినిమా . ఇక ఈమూవీ రిలీజ్ అయిన కొన్ని సంవత్సరాల తరువాత తర్వాత హిందీలో రీమేక్ చేసి విడుదల చేశారు. ఇందులో అమీర్ ఖాన్ హీరోగా నటించగా.. బాలీవుడ్ లో ఈసినిమా సంచలనంగా మారింది.
Actor Suriya starrer Ghajini film update
హిందీలో ఈసినిమా 100 కోట్లు వసూలు చేసి బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. హిందీలో ఈ సినిమాను గీతాఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో నిర్మించారు. అక్కడ భారీ స్పందన రావడంతో ఇతర భాషల్లో కూడా ఈసినిమా రిలీజ్ అయ్యింది. ప్రతీ భాషలో హిట్ అయ్యింది.
Ghajini
సూర్య, అసిన్, జంటగా నటించిన గజిని సినిమాలో ప్రదీప్ రావత్ తో పాటు ప్రస్తుత లేడీ సూపర్ స్టార్ హీరోయిన్ నయనతార సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఇక AR మురుగదాస్ దర్శకత్వంలో 2005లో విడుదలైన ఈసినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. దాదాపు రూ.7 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన గజిని బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల వరకు వసూలు చేసింది.
suriya starrer ghajini was rejected by r madhavan
అదేవిధంగా బాలీవుడ్ లో రూ.62 కోట్ల బడ్జెట్ తో రూపొందిన గజినీ ప్రపంచ వ్యాప్తంగా రూ.200 కోట్ల వరకు వసూలు చేసింది. ఎవర్ గ్రీన్ సినిమాగా నిలిచింది. మెమెరీ పవర్ ను లాస్ అయిన సూర్య, నయనతార సహాయంతో తన ప్రేయసి అసిన్ హంతకులను కనుగొని ప్రతీకారం తీర్చుకోవడం గజినీ కథ.