రెండో బిడ్డకు జన్మనిచ్చిన రామ్ చరణ్ హీరోయిన్, ఏం పేరు పెట్టిందో తెలుసా?
రెండో భర్తతో రెండో బిడ్డకు జన్మనిచ్చింది రామ్ చరణ్ హీరోయిన్. రెండో సారి కూడా మగబిడ్డనే పొందింది. ఇంతకీ ఈబ్యూటీ తన కొడుక్కి ఏం పేరు పెట్టిందో తెలుసా?
రెండో భర్తతో రెండో బిడ్డకు జన్మనిచ్చింది రామ్ చరణ్ హీరోయిన్. రెండో సారి కూడా మగబిడ్డనే పొందింది. ఇంతకీ ఈబ్యూటీ తన కొడుక్కి ఏం పేరు పెట్టిందో తెలుసా?
లండన్‌కు చెందిన నటి ఎమీ జాక్సన్. చిన్న వయసులోనే మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన ఎమీ జాక్సన్, దర్శకుడు ఏ.ఎల్.విజయ్ దర్శకత్వంలో వచ్చిన 'మద్రాసపట్టణం' సినిమాతో నటిగా పరిచయమైంది. పాత చెన్నై నేపథ్యంలో, ఆంగ్లేయుల పాలనను ఆధారంగా చేసుకుని చారిత్రక కథగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఎమీ జాక్సన్ దురైయమ్మగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
'సౌత్ ఇండియాన్ సినిమాలో వరుస అవకాశాలు సాధించింది ఏమీ. తెలుగులో అడుగు పెట్టి స్టార్ హీరోల సరసన నటించింది. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో బిజీగా మారింది. తెలుగులో ఎవరు తో పాటు తమిళంలో ఐ, 2.0 లాంటి పెద్ద పెద్ద సినిమాల్లోమంచి మంచి పాత్రలు చేసింది ఏమి జాక్సాన్.
ఆమె చివరగా అరుణ్ విజయ్ హీరోగా నటించిన, ఏ.ఎల్.విజయ్ దర్శకత్వంలో వచ్చిన 'మిషన్ చాప్టర్ 1' సినిమాలో నటించింది. ఇందులో ఆమె పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. నటనలోనే కాకుండా యాక్షన్‌లోనూ అదరగొట్టింది. సౌత్ సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ హాలీవుడ్ వెబ్ సిరీస్‌లో నటించే అవకాశం రావడంతో, దక్షిణ భారత భాషా చిత్రాల నుంచి పూర్తిగా తప్పుకుని హాలీవుడ్‌పై దృష్టి సారించింది.
2015 నుంచి జార్జ్ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్న ఎమీ జాక్సన్, అతని ద్వారా గర్భవతి అయి మగబిడ్డను కన్న తర్వాత, అతనితో నిశ్చితార్థం చేసుకుంది. 2021లో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పినప్పటికీ, పెళ్లికి ముందే అభిప్రాయభేదాలు రావడంతో విడిపోయారు. ప్రస్తుతం ఎమీ జాక్సన్ మొదటి భర్త కొడుకు ఎమీ జాక్సన్‌తోనే ఉన్నాడు.
ఆ తర్వాత కొన్ని సంవత్సరాలుగా ఎడ్ వెస్ట్‌విక్ అనే హాలీవుడ్ టీవీ నటుడితో ఎమీ జాక్సన్ డేటింగ్ చేసింది. అతనితో తీసుకున్న ఫోటోలను తరచుగా పోస్ట్ చేసేది. ఆ తర్వాత ఎమీ జాక్సన్‌కు, ఎడ్ వెస్ట్‌విక్‌కు గత ఏడాది ఆగస్టులో పెళ్లి జరిగింది. తాను గర్భవతి అని ప్రకటించింది. ఎడ్ వెస్ట్‌విక్ ద్వారా పెళ్లికి ముందే గర్భవతి అయిన ఎమీ, ఆ తర్వాత ప్రకటించింది.
తాజాగా ఎమీ జాక్సన్ తన రెండో బిడ్డను కూడా కనేసిందని, రెండోసారి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు ప్రకటించి, బిడ్డకు ఆస్కార్ అలెగ్జాండర్ వెస్ట్‌విక్ అని పేరు పెట్టినట్లు తెలిపింది. భర్త, బిడ్డతో ఎమీ జాక్సన్ విడుదల చేసిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి (Amy Jackson and Ed Westwick blessed with a baby boy). అభిమానులు ఎమీ జాక్సన్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.