పూజా హెగ్డేకు ఈపరిస్థితి రావడానికి కారణం రీసెంట్ గా ఆమె ఫేస్ చేసిన ఫ్లాప్స్ మాత్రమే కారణం అని తెలుస్తోంది. టాలీవుడ్ లో ప్లాప్ లు, అవకాశాలు లేక బాలీవుడ్‌కు వెళ్తే అక్కడ కూడా ఆశించిన స్థాయిలో వర్క్ చేయకపోవడంతో అవకాశాలు తగ్గిపోయాయి. సౌత్‌లో కూడా పెద్ద సినిమాలు లేవు పూజా హెగ్డేకు. దాంతో ఆమె స్పెషల్ సాంగ్స్ కు తక్కువ రెమ్యునరేషన్ అయినా ఓచే చేపుతున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికైతే పూజా హెగ్డే నాలుగు సినిమాల్లో నటిస్తోంది. అందులో రెండు సినిమాలు హిట్ అయితే మళ్లీ పూజా ఫుల్ ఫామ్ లోకి వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఇది కేవలం స్పెషల్ సాంగ్‌కి మాత్రమేనని, ఒక పూర్తి సినిమాలో హీరోయిన్ గా నటిస్తే ఆమె రెమ్యునరేషన్ 2 కోట్లు నుంచి 3 కోట్లు వరకూ ఉండొచ్చని ఇండస్ట్రీలో టాక్.