అల్లు అర్జున్ తో నటించి కనిపించకుండా పోయిన సూపర్ హిట్ హీరోయిన్లు.. ఒక్కరూ ఇద్దరూ కాదు ఏకంగా ఆరుగురు

Published : Jul 20, 2025, 11:08 AM IST

అల్లు అర్జున్ తో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆరుగురు హీరోయిన్లు కనుమరుగైపోయారు. హిట్ చిత్రాల్లో నటించినప్పటికీ ఆ హీరోయిన్లు ఇండస్ట్రీకి దూరం కావడం ఊహించని పరిణామం. 

PREV
17
కనుమరుగైన అల్లు అర్జున్ హీరోయిన్లు 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని హీరోగా దూసుకుపోతున్నారు. పుష్ప 1, పుష్ప 2 చిత్రాలు అల్లు అర్జున్ కి నేషనల్ వైడ్ పాపులారిటీ తెచ్చిపెట్టాయి. గత ఏడాది విడుదలైన పుష్ప 2 చిత్రం ఇండియాలో బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అల్లు అర్జున్ గంగోత్రి చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పుడు అతడి లుక్స్ విషయంలో విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఆ అల్లు అర్జునే స్టైలిష్ స్టార్ గా, ఐకాన్ స్టార్ గా ఎదిగారు.  

ఇదిలా ఉండగా గంగోత్రి చిత్రం నుంచి ఇప్పటివరకు అల్లు అర్జున్ తో నటించిన ఆరుగురు హీరోయిన్లు ఇండస్ట్రీకి దూరమై కనిపించకుండా పోయారు. అలాగని వాళ్ళు ఫ్లాప్ హీరోయిన్లు కాదు. బన్నీతో సూపర్ హిట్ చిత్రాల్లో నటించినవారే. వాళ్లెవరో ఇప్పుడు చూద్దాం. 

27
గంగోత్రి - అదితి అగర్వాల్ 

ఆర్తి అగర్వాల్ చెల్లెలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అదితి అగర్వాల్ అల్లు అర్జున్ సరసన గంగోత్రి చిత్రంలో నటించింది. గంగోత్రి మూవీ సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ అదితి అగర్వాల్ ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలబడలేదు. 

37
ఆర్య - అను మెహతా

అను మెహతాకి ఆర్య మూవీనే తొలి చిత్రం. ఆర్య చిత్రం సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఫీల్ మై లవ్ అనే కాన్సెప్ట్ తో సుకుమార్ మ్యాజిక్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రంలో మరో హైలైట్. అను మెహతా హోమ్లీ లుక్స్ కి కూడా మంచి మార్కులు పడ్డాయి. కానీ ఆ తర్వాత ఆమె నటించిన చిత్రాలు వర్కౌట్ కాలేదు. దీనితో ఆమె త్వరగానే టాలీవుడ్ నుంచి ఫేడ్ అవుట్ అయ్యారు. 

47
బన్నీ - గౌరీ ముంజల్ 

వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన బన్నీ చిత్రంతో అల్లు అర్జున్ హ్యాట్రిక్ హిట్ సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రంతో గౌరీ ముంజల్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. బన్నీ తర్వాత ఆమె శ్రీకృష్ణ 2006, భూకైలాస్, కౌసల్య సుప్రజ రామ లాంటి చిత్రాల్లో నటించింది. 2011 నుంచి ఆమె పూర్తిగా సినిమాలకు దూరమైంది. 

57
దేశముదురు - హన్సిక 

హన్సిక కూడా అల్లు అర్జున్ చిత్రంతోనే హీరోయిన్ గా పరిచయమైంది. పూరి జగన్నాధ్ ఆమెని దేశముదురు చిత్రంతో ఇంట్రడ్యూస్ చేశారు. తొలి చిత్రంతోనే హన్సిక క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ముఖ్యంగా యువతలో ఆమెకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. హన్సికని యాపిల్ బ్యూటీ అని పిలవడం ప్రారంభించారు. దీనితో టాలీవుడ్ లో ఆమెకి అవకాశాలు వెల్లువెత్తాయి. అయితే ప్రస్తుతం తెలుగులో హన్సికకి అస్సలు అవకాశాలే లేవు. ఇతర భాషల్లో మాత్రం నటిస్తోంది. 

67
పరుగు - షీలా కౌర్ 

బొమ్మరిల్లు భాస్కర్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందిన పరుగు చిత్రంతో షీలా కౌర్ కి హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కింది. లంగావోణీ ధరించి ఈ చిత్రంలో హోమ్లీగా కనిపించింది. పరుగు మూవీ మంచి విజయం సాధించింది. ఆ తర్వాత అదుర్స్, మస్కా లాంటి హిట్ చిత్రాల్లో కూడా షీలా కౌర్ నటించింది. పరమవీర చక్ర డిజాస్టర్ తర్వాత షీలా కౌర్ సినిమాలకు పూర్తిగా దూరమైంది. 

77
జులాయి - ఇలియానా 

ఇలియానా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ లో ఫస్ట్ టైం కోటి రెమ్యునరేషన్ అందుకున్న హీరోయిన్ ఇలియానా కావడం విశేషం. ఇలియానా, అల్లు అర్జున్ తో కలిసి జులాయి చిత్రంలో నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత ఇలియానా టాలీవుడ్ కి క్రమంగా దూరం అవుతూ వచ్చింది. బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. అక్కడ అవకాశాలు సరిగ్గా రాలేదు. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరమై ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. భర్త, పిల్లలతో సంతోషంగా జీవిస్తోంది. ఇలియానాకి ఇద్దరు కుమారులు సంతానం. 

Read more Photos on
click me!

Recommended Stories