Pooja Hegde Tongue Slip: నోరు జారిన పూజా హెగ్డే, తెలుగు బ్లాక్ బస్టర్ ను తమిళ సినిమా అనేసిందేంటి?

Published : Feb 05, 2025, 11:29 AM IST

Pooja Hegde Tongue Slip: తను చేసిన సినిమా ఏ భాష అనేది కూడా గుర్తు పెట్టుకోలేకపోయింది పూజా హెగ్డే. తెలుగులో పూజాకు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సినిమాను తమిళ సినిమా అనేసింది. ఇంతకీ ఏంటా సినిమా, పూజా ఎలా నోరు జారింది.   

PREV
16
Pooja Hegde Tongue Slip: నోరు జారిన పూజా హెగ్డే, తెలుగు బ్లాక్ బస్టర్ ను తమిళ సినిమా అనేసిందేంటి?

Pooja Hegde Tongue Slipపాపం పూజా హెగ్డే  చెతిలో సరైన సినిమాలు లేక డల్ అయ్యింది. తమిళంలో అవకాశాలు వచ్చినా, సాలిడ్ సినిమాలు తగలకు ఇండస్ట్రీలో ఆమె ఇమేజ్ చాలా వరకు డౌన్ అయిపోయింది.  వరుసగాపూజా హెగ్టే మూడు నాలుగు సినిమాలు డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి. పాన్ఇండియా రేంజ్ లో ఆమె నటించిన రాధే శ్యామ్ లాంటి సినిమాలు ప్లాప్ లు గా నిలవడంతో పూజా కెరీర్ డేంజర్ లోపడింది. 

Also Read: సమంత ఇలా మారిపోయిందేంటి, అంతా హాలీవుడ్ కోసమేనా?

26

అంతే కాదు అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఒకప్పుడు పూజాహెగ్డే అంటే ఎగబడి సినిమాలకు బుక్ చేసుకునే నిర్మాతలు..ఆమె అంటేనే  ఐరన్ లెగ్ అనే పేరు పడిపోయింది. టాలీవుడ్‌లో దాదాపు  స్టార్ హీరోలందరితో నటించి మెప్పించింది పూజా హెగ్డే.  అయితే, గతకొంత కాలంగా టాలీవుడ్‌లో సరైన హిట్స్ లేకపోవడంతో, ప్రస్తుతం ఆమె తన ఫోకస్ పూర్తిగా బాలీవుడ్‌పైనే పెట్టింది. 
 

Also Read: వేల కోట్లకు వారసుడు, ఇంట్లో నుంచి పారిపోయి హీరోగా మారిన నటుడు ఎవరో తెలుసా..?

36

అంతే కాదు తమిళంలో కూడా అవకాశాలు సాధిస్తోంది. కాని తెలుగులో మాత్రం ఎవరు పూజా హెగ్డేను పట్టించుకోవడంలేదు. ఇక రీసెంట్ గా బాలీవుడ్ లో  కొత్త సినిమా చేసింది పూజా. తాజాగా ఆమె నటించిన ‘దేవా’ మూవీ రిలీజ్ అయ్యింది. ఈసినిమా ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గోంటోంది పూజా. ఇక ఈమూవీ ప్రమోషనల్ ఈవెంట్ లో ఆమె నోరు జారి మాట్లాడిన మాటలు సంచలనంగా మారాయి. రకరకాల  విమర్శలకు దారి తీస్తున్నాయి.   పూజా హెగ్డే చేసిన ఓ స్టేట్మెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read: 3 సినిమాలు, ఒక్కో సినిమాకు 100 కోట్లు కొల్లగొట్టిన ప్రభాస్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

46
Pooja Hegde

సౌత్ సినిమాల గురించి..  తాను నటించిన  సినిమాల గురించి మాట్లాడుతూ.. అల్లు అర్జున్ జతగా పూజా నటించిన అల వైకుంఠపురములో’ మూవీని తమిళ సినిమా అనేసింది పూజా. ఆమె మాట్లాడుతూ.. అలవైకుంఠపురములో మూవీ  తమిళ సినిమా అయినా కూడా హిందీ ఆడియెన్స్ దానిని పాన్ ఇండియా మూవీగా చాలా బాగా ఆదరించారని.. పనితనం బాగుంటే, అది ప్రేక్షకులకు నచ్చుతుందని ఆమె  అన్నారు. 

Also Read: మాజీ ప్రధాని మనవరాలు, స్టార్ హీరోకు రెండో భార్య, రాజవంశానికి చెందిన హీరోయిన్ ఎవరో తెలుసా?

56
Ala Vaikunthapurramuloo

త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెకషన్ లో  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ మూవీలో  పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది.తాను నటించిన తెలుగు సినిమా.. పైగా  బ్లాక్ బస్టర్ హిట్ అయిన మూవీ ఏ భాషదో కూడా తెలియకపోవడం.. తెలిసినా మర్చిపోవడం.. అసలే ఏ ఉద్దుశ్యంతో ఆమె ఈ మాట అన్నారు అని బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలు పెట్టారు.  

66

అసలే సినిమాలు లేక ఐరన్ లెగ్ అని పేరు తెచ్చుకున్న పూజా.. ఇలా నోరు జారి ఉన్న ఇమేజ్ ను కూడా పోగోట్టుకుంటుందంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇప్పటికైనా పూజా తన మాట్లాడిన పొరపాటును సరిదిద్దుకుంటారా లేదా అనేది చూడాలి. ఈ విషయంలో మాత్రం సోసల్ మీడియాలో గట్టిగా ట్రోల్ చేస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories