Vijay-Ajith: ప్రీ సేల్స్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన తమిళ చిత్రాలు.. విజయ్‌, రజనీ, అజిత్‌ ఎవరు టాప్‌ ?

Published : Feb 05, 2025, 09:52 AM IST

Vijay-Ajith: `విడాముయర్చి`(పట్టుదల) సినిమాకి ప్రీ-బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటివరకు ప్రీ-బుకింగ్స్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 5 సినిమాలేంటో చూద్దాం. 

PREV
16
Vijay-Ajith: ప్రీ సేల్స్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన తమిళ చిత్రాలు.. విజయ్‌, రజనీ, అజిత్‌ ఎవరు టాప్‌ ?
టాప్ 5 ప్రీ-సేల్స్ హిట్స్

Vijay-Rajini-Ajith: స్టార్ హీరోల సినిమాలకు భారీ ఓపెనింగ్స్ ఉంటాయి. విజయ్, అజిత్, రజినీ లాంటి స్టార్ల సినిమాలకు రిలీజ్ కంటే ముందే ప్రీ-బుకింగ్స్ మొదలవుతాయి. ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ సంపాదించడానికి ఫ్యాన్స్ పోటీపడతారు. తమిళంలో అత్యధిక ప్రీ-సేల్స్ వసూళ్లు సాధించిన టాప్ 5 సినిమాలు ఇవే.

26
5. విడాముయర్చి

అజిత్ నటించిన `విడాముయర్చి` 5వ స్థానంలో ఉంది. ఈ సినిమా ప్రీ-బుకింగ్స్ ఫిబ్రవరి 1 నుంచి జరుగుతున్నాయి. ఇప్పటివరకు తమిళఃలో రూ.12.02 కోట్లు ప్రీ సేల్స్ ద్వారా సాధించింది. ఇది 3044 షోలకు సంబంధించిన ప్రీ-బుకింగ్స్. ఈ సినిమా రేపు (ఫిబ్రవరి 6న) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించారు.

36
4. పొన్నియిన్ సెల్వన్ 1

మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియిన్ సెల్వన్ 1, 4వ స్థానంలో ఉంది. ఈ సినిమా తమిళంలో రూ.12.49 కోట్లు వసూలు చేసింది. ఇది 2640 షోలకు సంబంధించిన ప్రీ-బుకింగ్స్. విక్రమ్‌తోపాటు కార్తి, జయం రవి, ఐశ్వర్యా రాయ్‌, త్రిష, శోభితా, ఐశ్వర్య లక్ష్మీ వంటి భారీ తారగణం ఇందులో నటించిన విషయం తెలిసిందే.

 

46
3. కోట్

వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ నటించిన `గోట్` మూవీ 3వ స్థానంలో ఉంది. ఈ సినిమా గతేడాది విడుదలైంది. తమిళంలో 2390 షోలకు రూ.12.56 కోట్లు వసూలు చేసింది. టాప్‌లో అన్నీ విజయ్‌ సినిమాలే నిలవడం విశేషం. 

56
2. లియో

లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ నటించిన `లియో` 2వ స్థానంలో ఉంది. ఈ సినిమా 2023లో విడుదలైంది. తమిళంలో 2197 షోలకు రూ.13 కోట్లు ప్రీ సేల్స్ ద్వారా సాధించింది. 

66
1. బీస్ట్

1వ స్థానంలో విజయ్ నటించిన `బీస్ట్` ఉంది. ఈ సినిమా 2022లో విడుదలైంది. రెండు వారాల ముందే ప్రీ-బుకింగ్స్ మొదలవ్వడంతో 2939 షోలకు రూ.15.05 కోట్లు వసూలు చేసింది. కోలీవుడ్‌లోనే హైయ్యేస్ట్ ప్రీ సేల్స్ సాధించిన చిత్రంగా ఈ మూవీ నిలిచింది. విజయ్‌ టాప్‌లో ఉన్నారు. ఆయనే వరుసగా మూడు స్థానాల్లో నిలవడం విశేషం. 

read more:Rajini v/s Ajith : రజినీకాంత్ కు షాక్ ఇచ్చిన అజిత్, మరీ ఇంత దారుణమా?

also read: Pooja Hegde: `రెట్రో` సినిమాలో ఛాన్స్ ప్రభాస్‌ మూవీ వల్లే.. క్రేజీ విషయాలు బయటపెట్టిన పూజా హెగ్డే!

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories