ఎపిసోడ్ ప్రారంభంలో మీకు తలనొప్పి తగ్గకపోతే అర్ధరాత్రి అయినా లేపి అడగండి, మొహమాట పడకండి టాబ్లెట్ ఇస్తాను అంటూ వెటకారంగా మాట్లాడుతుంది ధరణి. చూసావా మామ్ తను హద్దులు దాటి ఎలా మాట్లాడుతుందో అంటాడు శైలేంద్ర. నేను హద్దులు దాటలేదు, నేను హద్దులు దాటినట్లయితే మీ ఇద్దరూ ఇలా మాట్లాడుకునే వారు కాదు. మావయ్య మీ ఇద్దరినీ ఇవ్వకుండా చూడమని చెప్పారు కానీ నేను అలా చేయడం లేదు.