Kriti Shetty
ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది కృతి శెట్టి. దర్శకుడు బుచ్చి బాబు సాన తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ షేక్ చేసింది. ఉప్పెన విజయంలో కృతి శెట్టి కీలక పాత్ర వహించింది. ఆమె గ్లామర్ సినిమాకు ప్లస్ అయ్యింది. కాలేజ్ గర్ల్ పాత్రలో కృతి శెట్టి కుర్ర హృదయాలు కొల్లగొట్టింది.
Kriti Shetty
ఉప్పెన బ్లాక్ బస్టర్ కావడంతో కృతికి ఆఫర్స్ వెల్లువెత్తాయి. వెంటనే నానికి జంటగా శ్యామ్ సింగరాయ్ చిత్రం చేసింది. సాయి పల్లవి మరో హీరోయిన్. విభిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్ సైతం హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక బంగార్రాజు మూవీతో కృతి హ్యాట్రిక్ పూర్తి చేసింది.
Kriti Shetty
అరంగేట్రంతో వరుస విజయాలు నమోదు చేసిన హీరోయిన్స్ జాబితాలో చేరింది. లక్కీ హీరోయిన్ ట్యాగ్ కూడా ఆమె సొంతమైంది. అనూహ్యంగా కృతికి వరుస పరాజయాలు ఎదురయ్యాయి. గత ఏడాది కృతి శెట్టి నటించిన ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రాలు పరాజయం పొందాయి.
Kriti Shetty
ఎన్నో ఆశలు పెట్టుకొని చేసిన కస్టడీ సైతం బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యింది. కృతికి ఒక్కసారిగా ఆఫర్స్ తగ్గాయి. మరోవైపు శ్రీలీల నుండి ఆమెకు గట్టి పోటీ ఎదురవుతుంది. తెలుగులో కృతి శెట్టి కేవలం ఒక మూవీ చేస్తుంది. శర్వానంద్ కి జంటగా నటిస్తుంది. తమిళంలో ఒక చిత్రం, మలయాళంలో మరో మూవీ చేస్తుంది.
Kriti Shetty
స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ కృతి శెట్టి తృటిలో చేజార్చుకుంది. శర్వానంద్ మూవీపై పెద్దగా నమ్మకాలు లేవు. శర్వానంద్ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. ఆయన కూడా సక్సెస్ కోసం స్ట్రగుల్ అవుతున్నాడు.
Kriti Shetty
కెరీర్ నెమ్మదించిన నేపథ్యంలో కృతి శెట్టి గ్లామర్ షో చేస్తుంది. ఇంస్టాగ్రామ్ వేదికగా అందాల విందు చేస్తుంది. దర్శక నిర్మాతలకు హింట్ ఇస్తుంది. ఇకపై తాను గ్లామరస్ పాత్రలకు సిద్దమే అని చెప్పకనే చెబుతుంది.
Kriti Shetty
తాజాగా నల్ల చీరలో సూపర్ హాట్ ఫోజులతో చంపేసింది. నడుము అందాలు, నాభి సొగసులు చూపిస్తూ ఊపిరి ఆపేసింది. నల్ల చీర కట్టిన చందమామలా ఉన్న కృతి శెట్టి గ్లామర్ సోషల్ మీడియా జనాల మైండ్ బ్లాక్ చేస్తుంది.