వరుణ్‌లవ్‌ బ్యూటిఫుల్‌ వెడ్డింగ్‌ మూమెంట్స్.. మెగా జోడీకి దిష్టి తీయాల్సిందే!

Published : Nov 03, 2023, 07:03 PM ISTUpdated : Nov 03, 2023, 07:08 PM IST

మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి రెండు రోజుల క్రితం ఒక్కటైన విషయం తెలిసిందే. తాజాగా వారికి మ్యారేజ్‌కి సంబంధించిన బ్యూటిఫుల్‌ మూమెంట్స్ ని షేర్‌ చేసుకుంటున్నారు.   

PREV
18
వరుణ్‌లవ్‌ బ్యూటిఫుల్‌ వెడ్డింగ్‌ మూమెంట్స్.. మెగా జోడీకి దిష్టి తీయాల్సిందే!
photo credit - hotc

వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి.. ఇటలీలో తమ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకున్నారు. అత్యంత గ్రాండ్‌గా వీరి పెళ్లి వేడుక జరిగింది. అతికొద్ది మంది బంధుమిత్రులతో ఈ వివాహం జరగడం విశేషం. మెగా ఫ్యామిలీ అంతా పాల్గొన్నారు. 
 

28
photo credit - hotc

అయితే తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను పంచుకుంటున్నారు వరుణ్‌, లావణ్య. మెగా ఫ్యామిలీ మెంబర్స్ సైతం ఈ పిక్స్ ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. అందులో భాగంగా తమ బెస్ట్ పిక్స్ ని షేర్‌ చేసుకున్నారు. ఇందులో వరుణ్‌ లావణ్య బ్యూటీఫుల్‌ పిక్స్ ఉండటం విశేషం. 

38
photo credit - hotc

లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్లు వేసేటప్పుడు లావణ్య ఆనందానికి అవదుల్లేవు. ఆమె కళ్లల్లో ఆనందానికి ఆకాశమే హద్దులా మారిందని చెప్పొచ్చు. మరోవైపు ఇద్దరు కలిసి జోడీగా అలా వాక్‌ చేస్తూ ఇచ్చిన పోజు సైతం ఆకట్టుకుంటుంది. చూడ్డానికి ఎంతో మచ్చటగా ఉందీ జంట. దీంతో మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతూ, వీరికి దిష్ట తీయాల్సిందే అంటూ కామెంట్లు పెడుతుండటం విశేషం.

48
photo credit - hotc

దీంతోపాటు పెళ్లి పీఠలమీదకు వచ్చేటప్పుడు ఆమె చేతిలో కొబ్బరికాయని పట్టుకుని వస్తుంది. ఆమె డ్రెస్‌ని పట్టుకుని వెనకాల సహాయకులు, బంధువులు ఉండటం ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 

58
photo credit - hotc

వీటితోపాటు.. నూతన పెళ్లి జంటతో అల్లు అర్జున్‌, అల్లు స్నేహారెడ్డి, వారి పిల్లలు అల్లు అయాన్‌, అర్హలు కలిసి దిగిన పిక్‌ సైతం బ్యూటీఫుల్‌గా ఉంది. విజువల్‌ ట్రీట్‌లా ఉంది. 
 

68
photo credit - hotc

మరోవైపు వరుణ్‌ ఫ్రెండ్, హీరో నితిన్‌ దంపతులు కూడా ఈ పెళ్లిలో హైలైట్‌ అయ్యారు. వరుణ్‌, లావణ్యలతో కలిసి నితిన్‌, ఆయన వైఫ్‌ కలిసి దిగిన ఫోటో కూడా నెట్టింట చక్కర్లు కొడుతుంది. 
 

78
photo credit - hotc

ఇంకోవైపు నిహారిక, అలాగే మెగా మరో డాటర్‌ శ్రీజలతో కలిసి దిగిన ఫోటోలు కూడా ఆకట్టుకుంటున్నాయి. మెగా ఫ్యాన్స్ కి ఫీస్ట్ లా ఉన్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

88
photo credit - hotc

ఇటలీలో మూడురోజు పెళ్లి పూర్తయ్యింది. హైదరాబాద్‌కి రిటర్న్ అవుతున్నారు. ఈ రోజు రాత్రి, రేపటి వరకు హైదరాబాద్‌కి చేరుకుంటారు. ఆదివారం సాయంత్రం ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్‌ నిర్వహిస్తున్నారు. దీనికి చిత్ర పరిశ్రమ మొత్తం కదిలి రాబోతుంది. పలువురు రాజకీయ ప్రముఖులు కూడా హాజరు కానున్నారు.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories