Pawan Kalyan : అఫిషియల్ గా పేరు మార్చుకున్న పవన్ కల్యాణ్ భార్య.. అన్నా లెజినోవా కొత్త పేరేంటో తెలుసా?

Published : Jul 28, 2026, 02:40 PM IST

ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం, తెలుగువారి అభిమాన హీరో పవన్ కల్యాణ్ భార్యపేరు అన్నా లెజినోవా అనే చాలామందికి తెలుసు. అయితే ఆమె తాజాగా తన పేరును మార్చుకుంది.. మరి కొత్తపేరు ఏంటో తెలుసా?

PREV
15
పేరు మార్చుకున్న పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా

Anna Lezhneva : అన్నా లెజినోవా... తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. ఎక్కడో రష్యాలో పుట్టిపెరిగిన ఈమె కొణిదల వారి ఇంటి కోడలిగా మారి తెలుగువారికి పరిచయం అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షులు, ప్రముఖ సినీనటుడు పవన్ కల్యాణ్ భార్యగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది... అయితే ఆమె పేరు మాత్రం తెలుగు వారికి అంత కనెక్ట్ అవ్వదు. తెలుగుదనం లేకపోవడంతో విదేశీ మహిళగానే భావిస్తుంటాం. అందుకే తన పేరును పూర్తిగా తెలుగువారికి నచ్చేలా మార్చుకున్నారు అన్నా లెజినోవా. తాజాగా తన పేరు మార్పుకు సంబంధించి సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టారామె. ఇంతకూ అన్నా లెజినోవా కొత్త పేరు ఏంటి? అనేది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

25
అన్నా లెజినోవా కొత్త పేరు ఇదే...

ఏ అమ్మాయికైనా పెళ్లి తర్వాత ఇంటిపేరు మారుతుంది. ఇదే అన్నా లెజినోవా విషయంలోనూ జరిగింది. పవన్ కల్యాణ్ ను పెళ్ళాడిన తర్వాత కూడా ఆమెను అన్నా లెజినోవాగానే సంబోధిస్తున్నారు... అందుకే తన పేరుపై ఆమె క్లారిటీ ఇవ్వాల్సి వస్తోంది. తాను అన్నా లెజినోవా కాదు అన్నా కొణిదల... భర్త ఇంటిపేరే తన పేరులో ఉంటుంది అని తెలిపారు. ఇకపై తనను అన్నా కొణిదల అనే పిలవాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను... అంటూ పవన్ కల్యాణ్ భార్య సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. పెద్ద అక్షరాలతో అన్నా కొణిదల అన్న పేరుతో ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు.

35
పేరు మార్పుపై పవన్ వైఫ్ ఆసక్తికర పోస్ట్..

''త్వరలోనే నా పుట్టినరోజు రాబోతోంది. కాబట్టి ఓ విషయంపై క్లారిటీ ఇవ్వడానికి ఇదే మంచి సమయం. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసినప్పటి నుండి ఓ పని చేయాలనుకున్నాను. చాలాసార్లు ఓ విషయం గురించి రాయడానికి ప్రయత్నించాను... కానీ టైప్ చేసి డిలేట్ చేశాను. ఇదే సరైన సమయం... అందుకే ఆ విషయం గురించే ఇప్పుడు చెప్పాలనుకుంటున్నా.

చాలామందికి నేను అన్నా లెజినోవాగా తెలుసు. పవన్ కల్యాణ్ ను పెళ్లి చేసుకున్నప్పుడు నా పేరు అదే... అందుకే అలాగే అందరికీ పరిచయం అయ్యాను. అయితే ఫన్నీ విషయం ఏంటంటే మా మ్యారేజ్ సర్టిఫికేట్ లో మాత్రమే చివరిసారిగా నా పేరు అన్నా లేజినోవాగా ఉంది… పెళ్లి తర్వాత నా భర్త ఇంటిపేరు నా పేరులో చేరిపోయింది... అన్నా లెజినోవా కాస్త అన్నా కొణిదలగా మారింది'' అని పవన్ కల్యాణ్ భార్య తన పేరుపై క్లారిటీ ఇచ్చారు.

''ఈ ఫోస్ట్ చదువుతున్నవారికి ఓ చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా. ఇకపై నన్ను అన్నా కొణిదల అనే పిలవండి. ఇదే నా పేరు... ఈ పిలుపునే నేను కోరుకుంటున్నా. నా రిక్వెస్ట్ ను అర్థం చేసుకుంటారని భావిస్తున్నా.. ధన్యవాదాలు. అన్నా కొణిదల అనే పేరు నాకెంతో ప్రత్యేకమైనది'' అంటూ ఏపీ డిప్యూటీ సీఎం సతీమణి ఇన్స్టాగ్రామ్ లో ఆసక్తికర పోస్ట్ పెట్టారు.

45
పవన్ కల్యాణ్ తో దిగిన స్పెషల్ ఫోటో షేర్ చేసిన అన్నా కొణిదల

తన పేరు మార్పు పోస్ట్ తో పాటు భర్త పవన్ కల్యాణ్ తో దిగిన ఓ అరుదైన ఫోటోను కూడా అభిమానులతో పంచుకున్నారు అన్నా కొణిదల. భర్తతో కలిసి తన పుట్టింటికి అంటే రష్యాకు వెళ్లినప్పుడి దిగిన ఫోటోను ఇన్స్టాలో పోస్ట్ చేశారు. పెళ్లయిన కొత్తలొ రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ లో దిగిన ఫోటో ఇదని అన్నా కొణిదల తెలిపారు. ఈ ఫోటోలో పవన్, అన్నా జోడి యంగ్ లుక్ లో చూడముచ్చటగా ఉన్నారు... అందుకే అభిమానులకు తెగ నచ్చింది. ఈ ఫోటోను పవన్ ప్యాన్స్ షేర్ చేస్తుండటంతో వైరల్ గా మారింది.

55
వైరల్ గా మారిన అన్నా కొణిదల పోస్ట్

తనను అన్నా లెజినోవా అని కాదు అన్నా కొణిదలగా పిలవాలంటూ ఆమె చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కూడా వైరల్ గా మారింది. పవన్ కల్యాణ్ అభిమానులు 'మా అన్నయ్య కోసం వదినమ్మ అచ్చ తెలుగులోకి పేరు మార్చుకుంది'' అంటూ కొందరు, ''అన్నా కొణిదల... ఈ పేరెంత బాగుంది. ఇకపై ఇలాగే పిలుస్తాం  వదినమ్మ'' అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరేమో అడ్వాన్స్ గా పవన్ కల్యాణ్ వైఫ్ కి భర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇలా అన్నా కొణిదల పేరు మార్పు ప్రకటన పోస్ట్ పెట్టిన కొన్ని గంటల్లోనే 90 వేలకు పైగా లైక్స్ వచ్చాయి... అలాగే వందలాది కామెంట్స్ వస్తున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories