AK47: ఆదర్శ కుటుంబంలో వెంకటేష్‌, శ్రీనిధి శెట్టి పాత్రలివే.. ఆ విషయంలో ఇద్దరూ ఒక్కటే

Published : Jul 28, 2026, 12:53 PM IST

వెంకటేష్‌, శ్రీనిధి శెట్టి జంటగా నటిస్తోన్న మూవీ `ఆదర్శ కుటుంబం హౌస్‌ నెం.47`. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి వెంకటేష్‌, శ్రీనిధి శెట్టిల పాత్రలను పరిచయం చేశారు.

PREV
13
ఆదర్శ కుటుంబం మూవీ అప్‌ డేట్‌

వెంకటేష్‌ హీరోగా `ఆదర్శ కుటుంబం` మూవీ రూపొందుతుంది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. నారా రోహిత్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. యువినా పార్థవి, రాజా ప్రజ్వల్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు)   నిర్మిస్తున్న `ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47` చిత్రం 2026 అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది.

23
చిట్టిబాబుగా వెంకటేష్‌

ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ షురూ చేసింది టీమ్‌. వరుసగా పాత్రలను పరిచయం చేస్తున్నారు. నిన్న వెంకటేష్ పాత్రని పరిచయం చేశారు. ఆయన ఏం చేస్తాడు, ఆయన పాత్ర తీరుతెన్నుల గురించి చెప్పారు. ఇప్పుడు హీరోయిన్‌ శ్రీనిధి శెట్టి పాత్రని పరిచయం చేశారు. ఇందులో వెంకటేష్‌ `చిట్టిబాబు` పాత్రలో కనిపించబోతున్నారు. కుటుంబాన్ని ప్రేమతో, ఆప్యాయతతో, బాధ్యతతో ఒకే తాటిపై నడిపించే కుటుంబ పెద్దగా ఆయన పాత్ర ఆకట్టుకోనుందని టీమ్‌ తెలిపింది.  విడుదలైన పాత్ర పరిచయ వీడియోలో వెంకటేష్‌తో పాటు శ్రీనిధి శెట్టి, నారా రోహిత్ కనిపిస్తూ, నవ్వులు, భావోద్వేగాలు, కుటుంబ అనుబంధాలతో నిండిన చిత్ర ప్రపంచాన్ని అందంగా పరిచయం చేశారు. సహజమైన నటన, అద్భుతమైన కామెడీ టైమింగ్, కుటుంబ కథా చిత్రాల్లో తనదైన ముద్ర వేసిన వెంకటేష్ మరోసారి అన్ని వయసుల ప్రేక్షకులను అలరించే పాత్రతో రాబోతున్నారు. చిట్టిబాబు పాత్ర ఆయన కెరీర్‌లో మరో చిరస్మరణీయమైన పాత్రగా నిలిచేలా కనిపిస్తోంది. ఆనందం, అనుబంధాలు, కుటుంబ విలువలకు ప్రతిరూపంగా ఈ పాత్ర ఉండబోతోంది.

33
స్వర్ణగా శ్రీనిధి శెట్టి

మరోవైపు ఇందులో శ్రీనిధి శెట్టి `స్వర్ణ` పాత్రలో నటిస్తున్నారు. చిట్టిబాబుకు భార్యగా, చిరునవ్వే చిరునామాగా ఉండే ఓ ఆప్యాయమైన మధ్యతరగతి ఇల్లాలిగా ఆమె పాత్ర ప్రేక్షకుల హృదయాలను హత్తుకోనుంది. చిట్టిబాబు–స్వర్ణల మధ్య ఉండే అనుబంధం, చిలిపి సంభాషణలు, అనురాగం, కుటుంబ విలువలు సినిమాకు మరింత ఆత్మను, ఆహ్లాదాన్ని అందించనున్నాయి. ఫ్యామిలీ విషయంలో ఇద్దరూ ఒకేలా ఉంటారు. విడుదలైన ఈ క్యారెక్టర్ గ్లింప్స్‌లో నివేదా పేతురాజ్, ప్రముఖ హాస్యనటుడు సత్య కనిపిస్తూ చిత్రంలోని ఎంటర్‌టైన్‌మెంట్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో చూపించారు. పాత్రల పరిచయం మూవీపై అంచనాలను పెంచింది. వీరితోపాటు ఇతర కీలక పాత్రధారుల పాత్రలను కూడా వరుసగా పరిచయం చేయబోతున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories