Star Kids: అనుష్క నుంచి అలియా వరకు.. స్టార్ల్ హీరోయిన్ల పిల్లల పేర్లు భలే వెరైటీ గురూ.. చూస్తే వావ్ అంటారు

Published : Jul 28, 2026, 01:26 PM IST

Star Kids: మీరు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారా? మీ చిన్నారికి మంచి వెరైటీ పేరు పెట్టాలని చూస్తున్నారా? అయితే, బాలీవుడ్ సెలబ్రిటీలు తమ పిల్లలకు పెట్టిన ఈ పేర్లను చూడండి. ఇలాంటి పేర్లు ఎక్కడైనా విని ఉంటారా?

PREV
16
స్టార్ల్ హీరోయిన్ల పిల్లల పేర్లు

కొంత మంది సినిమా వాళ్ల పేర్లు చాలా వెరైటీగా ఉంటాయి. చాలా లోతుగా ఆలోచించి తమ పిల్లలకు అందరికంటే డిఫరెంట్ గా ఉండేట్టు  సెలక్ట్ చేస్తుంటారు. మరీ ముఖ్యంగా.. బాలీవుడ్ సెలబ్రిటీలు తమ పిల్లలకు చాలా వెరైటీ పేర్లు పెడుతుంటారు. అలియా భట్ కూతురి నుంచి కరీనా కపూర్ కొడుకుల వరకు, బాలీవుడ్ స్టార్ల పిల్లల కొన్ని ప్రత్యేకమైన పేర్ల గురించి ఇక్కడ చూద్దాం.

26
ఆలియా భట్ గారాల కూతురు పేరు..

చాలా చిన్న వయసులో పెళ్లి చేసుకుంది హీరోయిన్ ఆలియా భట్. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ తో పెళ్లి తరువాత వెంటనే ఓ ముద్దుల కూతురికి కూడా జన్మనిచ్చింది. ఇక  ఈ జంట తమ ముద్దుల కూతురికి 'రహా రణ్‌బీర్ కపూర్' అని పేరు పెట్టారు. ఈ పేరుకు చాలా మంచి అర్థాలున్నాయి.

36
కరీనా కపూర్ ఇద్దరు తనయుల పేర్లు చాలా స్పెషల్..

బాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్‌. సైఫ్ల కు ఇంతకు ముందే పెళ్ళై పిల్లలు ఉన్నారు. కరీనాను పెళ్లాడిన తరువాత వీరికి ఇద్దరు అబ్బాయిలు. వాళ్ల పేర్లు తైమూర్ అలీ ఖాన్, జెహంగీర్ అలీ ఖాన్. ఈ రెండు పేర్లు కూడా చాలా ప్రత్యేకమైనవి.

46
అనుష్క శర్మ ‌- విరాట్ కోహ్లీ

అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ జంట తమ కూతురికి 'వామిక' అని, రెండో సంతానమైన బాబుకి 'అకాయ్' అని పేరు పెట్టారు. ఈ పేర్లు చాలా యూనిక్‌గా ఉన్నాయి. స్టార్ క్రికెటర్ గా విరాట్ కోహ్లీ.. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో వీరి ప్రేమ కథలు.. దేశ మంతా మారు మోగిపోయాయి. పెళ్లి తరువాత కూడా వీరు చాలా స్పెషల్ అనిపించుకున్నారు.

56
కియారా అద్వానీ ‌- సిద్ధార్థ్ మల్హోత్రా

బాలీవుడ్‌లోని క్యూట్ కపుల్స్‌లో ఒకరైన కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా తమ కూతురికి 'సరాయా మల్హోత్రా' అని పేరు పెట్టారు. ఈ జంట కూడా పెళ్లికి ముందు చాలా రహస్యంగా తమ ప్రేమ కథను నడిపించారు. పెళ్లి తరువాత కూడా సినిమాల్లో బిజీ అయిపోయిన బాలీవుడ్ కపుల్.. ప్రస్తుతం తమ కూతురితో హ్యాపీగా సమయాన్ని గడుపుతున్నారు.

66
షాహిద్ కపూర్ పిల్లల పేర్లు ఏంటో తెలుసా?
షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్ దంపతులు తమ పిల్లలకు మిషా, జైన్ అని పేర్లు పెట్టారు. ఈ పేర్లు కూడా చాలా సింపుల్ అండ్ క్యూట్‌గా ఉన్నాయి.
Read more Photos on
click me!

Recommended Stories