Published : Mar 02, 2025, 09:35 AM ISTUpdated : Mar 02, 2025, 11:04 AM IST
రామ్ చరణ్ దగ్గర పవన్ కళ్యాణ్ అప్పు చేయడం ఏంటి..? వింటానికి విచిత్రంగా ఉందికదా. కాని ఇది నిజం. స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్పిన నిజం. తాను రామ్ చరణ్ దగ్గర డబ్బులు తీసుకున్నట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అసలు చరణ్ దగ్గర పవన్ ఎందుకు డబ్బులు తీసుకోవలసి వచ్చింది?
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ దూసుకుపోతున్నారు. తన శాఖపై పట్టు తెచ్చరకుని.. పరిపాలనలో రాటుదేలుతున్నారు. ఇక పవర్ స్టార్ మూడు సినిమాలు కంప్లీట్ చేయాల్సి ఉంది. త్వరలో ఆ సినిమాలు పూర్తి చేస్తానని కూడా ప్రకటించాడు.
ఇక మెగా ఫ్యామిలీ అంతా దిల్ ఖుష్ గా ఉన్న టైమ్ లో.. పవన్ కళ్యాణ్ కు సబంధించిన ఓ విషయం ప్రస్తుతం వైరల్ అవుతోంది. అదేంటంటే.. పవన్ కళ్యాణ్ అప్పు చేశారాట. అది కూడా రామ్ చరణ్ దగ్గర అప్పుగా తీసుకున్నాడట.
పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ దగ్గర అప్పు చేశారట, అంతే కాదు చరణ్ కు వడ్డీ కూడా ఇస్తానని చెప్పారట. ఇలా రామ్ చరణ్ దగ్గర చాలా సార్లు డబ్బులు అప్పుగా తీసుకున్నారట పవన్ కళ్యాణ్.
స్టార్ హీరోగా ఉన్న పవన్.. సినిమాకు 50 కోట్లకు పైగా తీసుకుంటున్న స్టార్ హీరో, కోట్ల ఆస్తి ఉన్న పవర్ స్టార్.. రామ్ చరణ్ దగ్గర అప్పు తీసుకోవడం ఏంటి అని అందరికి ఆశ్చర్యంగా ఉండవచ్చు. కాని ఇది ఇప్పుడు కాదు.. చేతిలో చిల్లిగవ్వ లేకుండా పవన్ ఖాళీగా ఉన్న రోజుల్లో జరిగిందట.
డబ్బులు లేక ఖాళీజేబుతో చాలా రోజులు గడిపేవారట పవన్ కళ్యాణ్. అందుకే రామ్ చరణ్ దగ్గర అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిందట. అయితే రామ్ చరణ్ దగ్గర పవన్ కళ్యాణ్ డబ్బులు తీసుకుంది ఇప్పడు కాదు.. ఎప్పుడో కెరీర్ బిగినింగ్ లో. చరణ్ అసలు అప్పటికి ఇండస్ట్రీలోకి రాలేదు. మెగా ప్యామిలీ అంతా ఉమ్మడి కుటుంబంగా...ఒకే ఇంట్లో ఉంటున్న టైమ్ లో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖాళీగా ఉండేవారట.
హీరోగా ఇండస్ట్రీకి అప్పుడప్పుడే వస్తున్న టైమ్ లో ఆయన పాకెట్ మనీకోసం చాలా ఇబ్బంది అయ్యేదట. చిరంజీవి ఇచ్చిన డబ్బులు సరిపోక ఎక్కడ డబ్బులు దొరుకుతాయా అని వెతుక్కునేవారట పవన్. ఈక్రమంలోనే చిన్నవాళ్లైన రామ్ చరణ్ కు నెల నెలా చిరు ఇచ్చిన పాకెట్ మనీ ఉండటం చూసేవారట పవన్.
అయితే చరణ్ ఆ డబ్బును ఖర్చు పెట్టకుండా ఒక దగ్గర దాచుకునేవాడట. ఇక ఆ డబ్బులు ఎలాగైనా కొట్టేయాలని చెప్పి.. రామ్ చరణ్ ను కాకా పడుతూ.. ఎక్కువ వడ్డీ ఇస్తానని ఆశ పెట్టి.. అప్పుగా ఆ డబ్బులు తీసుకునేవాడట పవర్ స్టార్.
చరణ్ చిన్నవాడు కావడంతో.. ఏదో ఒక కహానీలు చెప్పిడబ్బులు వసూలు చేసేవాడట పవన్. గతంలో జరిగిన ఈ స్వీట్ మెమరీస్ ను.. ఓ ఇంటర్వ్యూలో పవన్- చరణ్ కలిసి వెల్లడించారు.. సరదాగా నవ్వుకున్నారు కూడా.
అంతే కాదు.. టైమ్ పాస్ అవ్వాలని చెప్పి.. రామ్ చరణ్ కు.. చిరంజీవి పెద్ద కూతురు సుస్మితకు మధ్య చిన్న చిన్న తగవులు కూడా పెట్టేవాడట పవర్ స్టార్. బ్యాచిలర్ గా ఉన్న రోజుల్లో ఇలా అల్లరి చేస్తూ.. మెగాఫ్యామిలీలో సందడి వాతావరణ ఉండేదట.
మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ ఇంటర్వ్యూలో ఉండగా.. ముగ్గురు ఈ విషయాలు తలుచుకుని నవ్వుకున్నారు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. గేమ్ ఛేంజర్ తో భారీ ప్లాప్ ను అందుకున్న రామ్ చరణ్ కాస్త జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా తీరికలేకుండా గడుపుతున్నాడు.