ఫిల్మ్ ఇండస్ట్రీలో రెండు పెళ్లిళ్లు సాధారణమే, కాని ఇద్దరు హీరోయిన్లను పెళ్లి చేసుకున్న హీరోల గురించి మీకు తెలుసా? పవన్ కళ్యాణ్ నుంచి నాగచైతన్య వరకు, ప్రేమించి ఇద్దరు నటీమణులను పెళ్లి చేసుకున్న నటుల గురించి ఇప్పుడు చూద్దాం.
ఇద్దరు హీరోయిన్లను పెళ్లి చేసుకున్న హీరోలలో టాలీవుడ్ నుంచి పవన్ కళ్యాణ్ ముందు ఉన్నారు. రేణు దేశాయ్ తో ప్రేమలోపడి పెళ్లి చేసుకున్న పవన్, ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత రష్యన్ నటి అన్నా లెజినోవాతో మరోసారి ప్రేమలో పడ్డాడు. మనస్పర్ధల కారణంగా రేణు దేశాయ్ తో విడాకులు తీసుకుని అన్నాను పెళ్లాడాడు పవన్. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ OG సినిమాతో ఫ్యాన్స్ ను అలరించబోతున్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓజీ ఫీవర్ నడుస్తోంది.
25
నాగచైతన్య రెండు పెళ్లిళ్లు
అక్కినేని నట వారసుడు, నాగార్జున కొడుకు నాగ చైతన్య మొదట హీరోయిన్ సమంతను ప్రేమించి 2017లో పెళ్లి చేసుకున్నారు. 2021లో మనస్పర్ధల కారణంగా వారు విడిపోయారు. ఆ తర్వాత మరో హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల ప్రేమలో పడిన నాగ చైతన్య 2024 డిసెంబర్ లో పెళ్లి చేసుకున్నారు.
35
ఇద్దరు తారలను పెళ్లాడిన కమల్
సౌత్ స్టార్ యాక్టర్, లోకనాయకుడు కమల్ హాసన్ మొదట నటి వాణి గణపతిని పెళ్లి చేసుకుని విడిపోయారు. తర్వాత నటి సారికను వివాహం చేసుకున్నారు. వీరికి శ్రుతి హాసన్, అక్షర హాసన్ అనే ఇద్దరు కూతుళ్లు. సారికతో కూడా ఆయన విడాకులు తీసుకుని కొంత కాలం సీనియర్ హీరోయిన్ గౌతమితో సహజీవనం చేశాడు. ఆమెతో కూడా విడిపోయి ప్రస్తుతం సింగిల్ గా ఉంటున్నాడు.
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ మొదట నటి అమృతా సింగ్‌ను 1991లో పెళ్లి చేసుకున్నారు. 2004లో విడిపోయి, 2012లో నటి కరీనా కపూర్‌ను రెండో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
55
ప్రకాశ్ రాజ్ కూడా
సౌత్ సినిమాల్లో విలక్షణ నటుడిగా పేరు తెచ్చకున్న ప్రకాష్ రాజ్ కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. మొదట నటి లలిత కుమారిని 1994లో పెళ్లి చేసుకుని, 2009లో విడిపోయారు. 2010లో కొరియోగ్రాఫర్ పోనీ వర్మను ఆయన రెండో వివాహం చేసుకున్నారు.