Bigg Boss Telugu 9: సంజనా హీరోయిన్‌ కాకుండా ప్రియుడి కుట్ర, చివరికి ఏం జరిగిందంటే? క్రేజీ లవ్‌ స్టోరీ

Published : Sep 24, 2025, 12:14 AM IST

Bigg Boss Telugu 9: బిగ్‌ బాస్ తెలుగు 9 మంగళవారం ఎపిసోడ్‌లో సంజనా ఎవరికీ తెలియని తన గత లవ్‌ స్టోరీ బయటపెట్టింది. తనని హీరోయిన్‌ కాకుండా ప్రియుడు   కుట్ర చేసిన విషయాన్ని బయటపెట్టింది. 

PREV
18
శ్రీజ నామినేషన్‌పై రచ్చ

బిగ్‌ బాస్‌ తెలుగు 9 రెండు వారాలు పూర్తి చేసుకుని మూడో వారంలోకి చేరుకుంది. మూడో వారం శ్రీజ, కళ్యాణ్‌, రీతూ చౌదరీ, ఫ్లోరా, రాము రాథోడ్‌, హరీష్‌ నామినేట్‌ అయ్యారు. ఇక మంగళవారం (16వ రోజు) ఎపిసోడ్‌లో నామినేషన్ల గురించే చర్చ జరిగింది. శ్రీజ.. భరణి నామినేట్‌ చేస్తూ చేసిన కామెంట్‌ విషయంలో  ఆవేదన వ్యక్తం చేసింది. తాను ప్రతి ఒక్కరి దగ్గర నెగటివే అని చెప్పడాన్ని ఆమె తీసుకోలేకపోయింది. ఎవరి గురించి స్టాండ్‌ తీసుకోనని తెలిపింది. ఇదే విషయంలో భరణి కూడా.. ఇమ్మాన్యుయెల్‌ వద్ద మాట్లాడుతూ, మొదటి సారి నామినేషన్‌లోకి వచ్చింది ఏడ్చేస్తుందని కామెంట్‌ చేశారు. దీనిపై తనూజతోనూ వాదనలు జరిగాయి.

28
పవన్‌ వద్ద కన్నీళ్లు పెట్టుకున్న రీతూ చౌదరీ

మరోవైపు రీతూ చౌదరీ, పవన్‌ ల మధ్య నామినేషన్‌ చర్చ జరిగింది. తనని నామినేట్‌ చేసినందుకు రీతూ ఆవేదన వ్యక్తం చేసింది. కన్నీళ్లు పెట్టుకుంది. తన హార్ట్ బ్రేక్‌ అయ్యిందని పేర్కొంది. నువ్వు వెళ్లవు అని పవన్‌ చెప్పగా, ఎలా చెబుతావంటూ కన్నీళ్లు పెట్టుకుంది. శ్రీజ, రీతూ నామినేషన్‌కి సంబంధించి బాగా ఫీలవడం కనిపించింది. అనంతరం కుకింగ్‌ విషయంలో సంజనాకి, హరిత హరీష్‌కి మధ్య వాగ్వాదం జరిగింది. హరీష్‌ని కుకింగ్‌కి పిలిచి సంజనా కుక్‌ చేస్తుంది. దీన్ని హరీష్‌ తప్పుపడ్డారు. డ్రామాలు ఆడుతున్నారని, ఆమె డ్రామా క్వీన్‌ అని కామెంట్‌ చేశాడు హరీష్‌. అలా చేయడానికి ఒప్పుకోనని, ఆ స్థానంలో మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న సహించనని తెలిపారు.

38
రీతూకి బంపర్‌ ఆఫర్‌

ఇక నామినేషన్‌లో ఉన్నందుకు శ్రీజ కన్నీళ్లు పెట్టుకోగా, ఇమ్మాన్యుయెల్‌ వెళ్లి ఓదార్చాడు. నేను నీకు అన్నలాగా ఉంటానని, ధైర్యంగా ఉండమని ఓదార్చాడు. ఇంతలో బిగ్‌ బాస్‌ నుంచి రీతూ చౌదరీకి పిలుపు వచ్చింది. కన్ఫెషన్‌ రూమ్‌కి వెళ్లగా, చికెన్‌ పీస్‌లు చూపించాడు బిగ్‌ బాస్‌. దీంతో రీతూ కన్నీళ్లు పెట్టుకుంది. తనకు అమ్మ గుర్తొచ్చిందని, అన్నయ్య కూడా తన కోసం చికెన్‌ చేసి పెడతారని, అది గుర్తొచ్చి ఆనందంతో కన్నీళ్లు వస్తున్నట్టు తెలిపింది. అయితే ఆ చికెన్‌ దక్కాలంటే రహస్యాలు చెప్పాలనే కండీషన్‌ పెట్టాడు బిగ్‌ బాస్‌.

48
కళ్యాణ్‌పై తనూజ క్రష్‌ బయటపెట్టిన రీతూ

దీంతో కొన్ని రహస్యాలు బయటపెట్టింది. తనూజ ఒకరిని ఇష్టపడుతుందని తెలిపింది. కళ్యాణ్‌పై సాఫ్ట్ కార్నర్‌ ఉందని, ఆయనపై లేనట్టుగా చూపిస్తుంటుంది, కానీ పక్కన ఉంటే అది చూపిస్తుంటుందని వెల్లడించింది. ఇక పవన్‌ గురించి చెబుతూ, అతను ఇప్పుడు సింగిల్‌ అని, గతంలో ఒక అమ్మాయి ఉండేదని, సరిగా ప్రపోజ్‌ చేయలేకపోయాడని, దీంతో ఆ అమ్మాయికి పెళ్లైపోయిందని చెప్పాడని తెలిపింది. ఇక హౌజ్‌లోకి రాగానే తనపై మంచి ఓపీనియన్‌ ఏర్పడిందని, తనతో ఉండేందుకు ఇష్టపడుతుంటాడని చెప్పింది. ఇంకా రహస్యాలు కావాలని బిగ్‌ బాస్‌ అడగ్గా, హౌజ్‌లోకి వెళ్ళి మిగిలిన రహస్యాలు కనుక్కొని వస్తానని తెలిపింది.

58
సంజనా గల్రానీ షాకింగ్‌ లవ్‌ స్టోరీ

సంజనా రహస్యాలు అడగ్గా, షాకిచ్చే విషయం బయటపెట్టింది సంజనా. కాలేజీలో ఒక అబ్బాయి ఇష్టపడ్డానని, అయితే తనని కొట్టేందుకు ప్రయత్నించాడని తెలిపింది. తనని తలపై కొడితే, ఫేస్‌కి కుట్లు పడతాయని, దీంతో మొహం సరిగ్గా ఉండదు, హీరోయిన్‌ కాలేదని, ఆమెని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండొచ్చని అతను భావించాడని, ఆ తర్వాత రచ్చ అయ్యిందని, తాను వదిలేయడంతో పిచ్చోడై గెడ్డం, మీసాలు పెంచి పిచ్చోడిలా తిరిగాడని, ఓ రోజు కారు డ్రైవ్‌ చేస్తూ యాక్సిడెంట్‌లో మరణించాడని తెలిపింది సంజనా. ఇక ఇమ్మాన్యుయెల్‌ చెబుతూ సంజనా తన ఫేవరేట్‌ అని తెలిపాడు. పవన్‌ని అడగ్గా రీతూ తన ఫేవరేట్‌ అని తెలిపారు. అదే సమయంలో రీతూ ఏం చెబితే అది చేయోద్దని శ్రీజ.. పవన్‌కి చెప్పడం గమనార్హం. తనూజ.. తాను ఇంట్లో అబద్దాలు చెప్పి హైదరాబాద్‌కి వస్తుండేదాన్ని అని తెలిపింది.

68
బిగ్‌ బాస్‌ కంట్రోల్‌లోకి హౌజ్‌

ఇంతలో బిగ్‌ బాస్‌ మాట్లాడుతూ, హౌజ్‌ని తన కంట్రోల్‌కి తీసుకున్నానని అందరికి ఆపిల్స్ ఇచ్చాడు. అందులో ఉన్న గింజని బట్టి వారి భవిష్యత్‌ ఆధారపడి ఉంటుందన్నారు. అయితే ఆ విషయాలను సందర్భం వచ్చినప్పుడు చెబుతానని తెలిపారు బిగ్‌ బాస్‌. అనంతరం ఫ్యామిలీ నుంచి సందేశాలు వచ్చాయని, అవి పొందాలంటే కొన్ని కండీషన్స్ పెట్టాడు బిగ్‌ బాస్‌. ఫస్ట్ బజర్‌ నొక్కిన వారికి ఫస్ట్ అవకాశం వస్తుందన్నారు. అదే సమయంలో తమకు వచ్చే సందేశాన్ని బట్టి బ్యాటరీలో ఛార్జింగ్‌ తగ్గిపోతుందని, ఏ సందేశం తీసుకోవాలి, ఎంత మందికి ఆ అవకాశం రావాలనేది తాము ఎంచుకునే సందేశాన్ని బట్టి ఉంటుందని చెప్పారు.

78
మిగిలిన వారికోసం అమ్మ సందేశాన్ని త్యాగం చేసిన ఇమ్మాన్యుయెల్‌

మొదట ఇమ్మాన్యుయెల్‌ కి ఛాన్స్ రావడంతో ఆయన మిగిలిన వారి కోసం 25 శాతం ఛార్జింగ్‌ తగ్గే ఫ్యామిలీ ఫోటోని ఎంచుకున్నాడు. అమ్మని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇమ్మాన్యుయెల్‌. ఆ తర్వాత ఫ్యామిలీ ఫోటో రావడంతో హ్యాపీ అయ్యాడు ఇమ్మాన్యుయెల్‌. 

88
తనూజ, సుమన్‌ శెట్టి కామెడీ వేరే లెవల్‌

అయితే ఇందులో కాసేపు మంచి కామెడీ స్కిట్‌ ప్లే చేశారు. తనూజ, సుమన్‌ శెట్టి జంటగా ఈ స్కిట్‌ జరిగింది. సుమన్‌ శెట్టిని, తనూజ ఇష్టపడుతుంది. తన లవ్ ప్రపోజ్‌ చేస్తుంది. ఈ క్రమంలో సుమన్‌ శెట్టి చేసే కామెడీ నవ్వులు పూయించింది. దీనికి ఇమ్మాన్యుయెల్‌ తోడు కావడంతో కామెడీ బాగా పండింది. ఆద్యంతం అలరించింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories