75 జంటలకు సొంత డబ్బుతో పెళ్లి చేసి, 65 మందిని డిగ్రీ వరకూ చదివించిన తెలుగు స్టార్ కమెడియన్ ఎవరు?

Published : Sep 24, 2025, 07:45 AM IST

ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్స్ అంటే లగ్జరీ లైఫ్ ఉంటుంది. కోట్లు సంపాదిస్తారు, కొంత మంది మాత్రం సమాజసేవకోసం ఎంతో కొంత ఖర్చు చేస్తుంటారు. స్టార్ కమెడియన్ గా వెలుగు వెలిగిన ఓ నటుడు కూడా 75 జంటలకు పెళ్ళి చేసి, 65 మందిని డిగ్రీ వరకూ చదివించాడని మీకు తెలుసా?

PREV
14
సమాజ సేవలో స్టార్స్

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్క సారి స్టార్ డమ్ వస్తే చాలు.. కోట్ల సంపాదన, లగ్జరీ కార్లు, హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ.. లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటారు. అయితే వారిలో కొంత మంది మాత్రం సమాజ సేవకోసం అంతో ఇంతో డబ్బులు ఖర్చు చేస్తుంటారు. అలాంటి తారలు అప్పుడు ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు. ప్రస్తుతం చిరంజీవి బ్లడ్ బ్యాక్, ఐబ్యాంక్ నడిపిస్తున్నారు, మహేష్ బాబు చిన్న పిల్లలకు హార్ట్ ఆపరేషన్లు చేయిస్తున్నాడు.. ఇలా రకరకాలుగా స్టార్స్ మంచిపనులు చేస్తుంటారు. ఈక్రమంలో అలనాటి స్టార్ కమెడియన్ ఒకరు 65 మందిని చదివించడంతో పాటు 75 మందికి పైగా జంటలకు పెళ్ళిల్లు చేశాడు. ఇంతకీ ఎవరా నటుడు?

24
హీరోలకు సమానంగా ఇమేజ్

ఇప్పటి వరకూ మనం చెప్పుకున్న నటుడు ఎవరో కాదు రాజబాబు. అవును రాజబాబు కమెడియన్ గా స్టార్ డమ్ చూశాడు. కాని చాలా చిన్న వయస్సులో అనారోగ్యంతో మరణించాడు. అయితే అంత తక్కువ కాలంలోనే స్టార్ డమ్ తో పాటు, స్టార్ హీరోలకు సమానంగా రాజబాబు రెమ్యునరేషన్ తీసుకున్నాడు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ శోభన్ బాబు లాంటి స్టార్స్ సినిమాల్లో రాజబాబు ఉండాల్సిందే. అయితే రాజబాబు ఉన్న తక్కువ కాలంలోనే కోట్లలో ఆస్తులు సంపాదించాడు. ఆయన రేంజుకు తగ్గట్టుగానే తన సొంత ఊరికి సేవలు కూడాచేశాడు.

34
25 కోట్లకు పైగా ఆస్తులు

రాజబాబు తన కెరీర్ లో దాదాపు 25 కోట్లకు పైగా ఆస్తులు సంపాదించాడు. ఈ విషయాన్ని రాజబాబు తమ్ముడు, సీనియర్ నటుడు చిట్టిబాబు ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించాడు. రాజబాబు 25 కోట్ల ఆస్తలు, స్థలాలు, ఫియట్ లాంటి లగ్జరీ కార్లు, చైన్నైలో మూడు నాలుగు ఇళ్లు, ఎన్నో సంపాదించాడు. ఆయన మరణించేనాటికి అంత ఆస్తి ఉంది. అప్పుడే అంత ఆస్తి ఉంది. ఇప్పుడు దాని విలువ చాలాఎక్కువ ఉంటుంది అన్నారు.

44
రాజబాబు సమాజసేవ

రాజబాబు అన్ని కోట్లు సంపాదించడంతో పాటు సమాజసేవ కూడా ఎంతో చేశాడట. రాజబాబు తమ్ముడు మాట్లాడుతూ.. కెరీర్ బిగినింగ్ లో ఒక పూట భోజనం కోసం రాజబాబును ఒక రోజు మొత్తం వెయిట్ చేయించారు. అన్ని కష్టాలు చూశాడు కాబట్టే ఆయన ఆతరువా కాలంలో తన సొంత ఊరికి సేవ చేశాడు. 75 జంటలకు తన ఖర్చుతో పెళ్లిళ్లు చేశాడు, 65 మందిని డిగ్రీ వరకూ చదివించాడు. మా ఊరిలో సొంత డబ్బుతో స్కూల్, కాలేజీ కట్టించాడు. అలా ఆయన చేసిన సేవ చాలామందికి తెలియదు, ఎప్పుడు ప్రచారంచేసుకోలేదని చిట్టిబాబు ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Read more Photos on
click me!

Recommended Stories