OG Trailer Leak: పవన్‌ కళ్యాణ్‌ని ఫ్యాన్స్ చూడాలనుకున్నది ఇలా కదా, ఓజీ ట్రైలర్‌ విధ్వంసం

Published : Sep 22, 2025, 07:44 AM IST

పవన్‌ కళ్యాణ్‌ నటించిన `ఓజీ` మూవీ ట్రైలర్‌ని ఊరిస్తున్నారు. రెండు సార్లు వాయిదా వేశారు. ఈక్రమంలో పవన్‌ పట్టుపట్టి ఈవెంట్‌లో ప్రొజెక్ట్ చేయించారు. అయితే `ఓజీ` ట్రైలర్‌ లీక్‌ అయ్యింది. 

PREV
15
భారీ వర్షంలో ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించిన పవన్‌

పవన్‌ కళ్యాణ్‌ నటిస్తోన్న `ఓజీ` మూవీ మ్యూజిక్‌ కాన్సర్ట్ ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో గ్రాండ్‌గా జరిగింది. భారీ వర్షం ఈవెంట్‌కి అంతరాయం కలిగించింది. అయినా ఫ్యాన్స్ లో జోష్‌ నింపాడు పవన్‌. `వాషి ఓ వాషి` అంటూ స్టేజ్‌పైనే పాట పాడారు. ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించారు. కేవలం పాటే కాదు, ఈ వర్షం మనల్ని ఆపుతుందా అంటూ గొడుగు లేకుండా స్టేజ్‌ నుంచి ముందుకు అభిమానుల మధ్యలోకి వచ్చారు. దీంతో ఫ్యాన్స్ అరుపులతో హోరెత్తించారు. తన మాటలతో, చేష్టలతో సినిమాపై అంచనాలను పెంచారు పవన్‌. ఇది కదా పవన్‌ నుంచి కావాలనుకున్నది అనేలా చేశారు. తాను డిప్యూటీ సీఎంని అని మర్చిపోయి కత్తి పట్టి పూనకాలు తెప్పించారు.

25
`ఓజీ` ట్రైలర్‌ విడుదల చేయాల్సిందే, పట్టుబట్టిన పవన్‌

`ఓజీ` ట్రైలర్‌ ఆదివారం ఉదయమే రిలీజ్‌ చేస్తామన్నారు. కానీ వాయిదా పడింది. రాత్రి ఈవెంట్‌లో రిలీజ్‌ చేస్తామన్నారు. డీఏ కాలేదని, ఫైనల్‌ మిక్సింగ్‌ కాలేదని రిలీజ్‌ చేయలేదు. కానీ ఈవెంట్‌కి వచ్చిన పవన్‌ పట్టుపట్టాడు. అభిమానులకు ట్రైలర్‌ చూపించాల్సిందే అని తేల్చేశారు. దీంతో అప్పటికప్పుడు దర్శకుడు సుజీత్‌ టీమ్‌ ఆ రా ట్రైలర్‌ని విడుదల చేశారు. అక్కడ అభిమానుల కోసం మాత్రమే ఆ ట్రైలర్‌ని చూపించారు. కాకపోతే కొందరు దాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు.

35
`ఓజీ` ట్రైలర్‌ సోషల్ మీడియాలో లీక్‌

మరి ఈ లీకైన ట్రైలర్‌ ఎలా ఉందనేది చూస్తే, ట్రైలర్ లో మొదట కథ, కథనాన్ని ఎస్లాబ్లిష్‌ చేశారు. పాత్రలని పరిచయం చేశారు. శ్రియా రెడ్డి, అర్జున్‌ దాస్‌తోపాటు ఇతర గ్యాంగ్ స్టర్స్ గొడవలు వంటివి చూపించారు. నెమ్మదిగా ఆర్‌ఆర్‌ పెరిగిపోతుంది. దీనికితోడు ప్రకాష్‌ రాజ్‌.. ఓజాస్‌ గాంభీర గురించి ఎలివేషన్లు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఓమీగా నటించిన ఇమ్రాన్‌ హాష్మి పాత్రని పరిచయం చేశారు. హీరో రేంజ్‌లో ఆయన్ని పరిచయం చేయడం విశేషం. ఆయన సృష్టించే అరాచకం వేరే లెవల్‌. ఇక చివర్లో పవన్‌ కళ్యాణ్‌ ఎంట్రీ ఇచ్చారు. ఆయనపై వచ్చే షాట్స్ దానికి తగ్గ ఆర్‌ ఆర్‌ ఫ్యాన్స్ కి పిచ్చెక్కించేలా ఉంది. మోతమోగించింది. `ఓమీ ముంబయి వస్తున్నా.. తలలు జాగ్రత్త` అని చెప్పే డైలాగ్‌ మతిపోయేలా ఉంది. పవన్‌ ఎంట్రీ ఇస్తూ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు.

45
పవన్‌ కళ్యాణ్‌ విధ్వంసం

పవన్‌ కళ్యాణ్‌ని గతంలో ఎప్పుడూ ఇంతటి యాక్షన్‌తో, ఊరమాస్‌గా, రా గా చూసి ఉండరు. అసలు ఇది పవన్‌ కళ్యానేనా అనేలా ఆయన సీన్లు ఉన్నాయి. విలన్లని ఊచకోత కోశారు. చివర్లో గన్‌ ఫైర్‌ చేస్తూ ఓజాస్‌ గాంభీర.. ఓజాస్‌ గాంభీర.. అంటూ ఆయన అరుపులకు ఫ్యాన్స్ అరుపులు తోడవ్వడంతో ఎల్‌బీ స్టేడియం దద్దరిల్లింది. ట్రైలర్‌ మాత్రం అదిరిపోయింది. ఫ్యాన్స్ ఎలా అయితే కోరుకున్నారో, అలా ఈ ట్రైలర్‌ ఉంది. డీఐ, స్పెషల్‌ ఎఫెక్ట్స్ అవసరం లేదని ఈ ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతుంది. ఈ ట్రైలర్‌ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ముంబయి గ్యాంగ్‌స్టర్‌, మాఫియా ప్రధానంగా, పూర్తి యాక్షన్‌తో సినిమా సాగుతుందని, సెంటిమెంట్‌, ఎమోషనల్‌ సీన్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది.

55
మరో మూడు రోజుల్లోనే ఆడియెన్స్ ముందుకు `ఓజీ`

సుజీత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పవన్‌ కళ్యాణ్‌కి జోడీగా ప్రియాంక మోహన్‌ నటిస్తోంది. ఇమ్రాన్‌ హష్మీ విలన్‌గా నటిస్తుండగా, అర్జున్‌ దాస్‌, శ్రియా రెడ్డి, ప్రకాష్‌ రాజ్‌ కీలక పాత్రలు పోషించారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ నెల 25న పాన్‌ ఇండియా రేంజ్‌లో దీన్ని రిలీజ్‌ చేస్తున్నారు. 24 రాత్రి నుంచే పెయిడ్‌ ప్రీమియర్స్ వేయనున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతి కూడా లభించింది. ప్రీమియర్స్ ఒక్కో టికెట్‌ ధర వెయ్యి రూపాయలుగా నిర్ణయించారు. అలాగే పది రోజులపాటు సాధారణ టికెట్‌ రేట్లు కూడా పెంచారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories