
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన `ఓజీ` మూవీ కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పట్నుంచి మంచి బజ్ నెలకొంది. అది రాను రాను పెరుగుతూ వస్తోంది. గ్లింప్స్ తో హైప్‌ని పెంచారు. పాటలు ఆకట్టుకున్నాయి. ఇప్పుడు `ఓజీ` మ్యూజిక్ కాన్సర్ట్ లో విడుదల చేసిన ట్రైలర్ పూనకాలు తెప్పిస్తోంది. ఇప్పటికే సినిమాపై అంచనాలు భారీగానే ఉండగా, ఈ ట్రైలర్ వాటిని అమాంతం పెంచేసింది. ఈవెంట్‌లో ట్రైలర్ చూసి ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. ఇక ఫైనల్ కట్ చూస్తే ఎలా ఫీలవుతారో చూడాలి.
ఇదిలా ఉంటే `ఓజీ` మూవీకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సినిమాపై రివ్యూ ఇచ్చేశారు. పవన్ కళ్యాణ్ రియాక్షన్ చెప్పారు. పవన్ `ఓజీ` మూవీ ఫస్టాఫ్‌ని ఎడిటింగ్ రూమ్‌లో చూశారని, అందులో కొన్ని కీలక సన్నివేశాలున్నాయని, అవి అదిరిపోయేలా వచ్చాయని, పవన్‌కి బాగా నచ్చాయని తెలిపారు. థియేటర్స్ లో కూడా ఫ్యాన్స్ అదే ఫీలవుతారని, మొదటిభాగం అదిరిపోయిందని పవన్ చెప్పినట్టుగా తమన్ తెలిపారు.
మరోవైపు ఆదివారం రాత్రి జరిగిన `ఓజీ` మ్యూజిక్ కాన్సర్ట్ లోనూ తమన్ తన కాన్ఫిడెన్స్ ని మరోసారి వెళ్లడించారు. క్రేజీగా తన రివ్యూ ఇచ్చాడు. `ఓజీ` గురుంచి చెప్పడం కాదు అని మీసం మెలేశాడు. ఫ్యాన్స్ కి పిచ్చెక్కించాడు. నిజానికి తమన్ సినిమా ప్రారంభం నుంచి అదే చెబుతున్నారు. అంతే కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఇప్పుడు మరోసారి దాన్ని స్పష్టం చేశారు. ఇలా సింపుల్‌గా తన యాక్టివిటీతో సినిమా ఎలా ఉండబోతుందో, ఎలా వచ్చిందో తేల్చేశాడు తమన్. ఇప్పుడు ఆయన డైలాగ్, ఈ వీడియో వైరల్ అవుతుంది.
ఇక `ఓజీ` మూవీ క్రిటిక్ రివ్యూ కూడా వచ్చేసింది. ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడిగా చెలామణి అవుతున్న ఉమైర్ సందు తన రివ్యూ ఇచ్చాడు. ఆయన పెద్ద సినిమాలకు నెగటివ్ రివ్యూ ఇస్తుంటారు. పవన్‌కి చాలా సార్లు నెగటివ్ రివ్యూ ఇచ్చాడు. కానీ ఇప్పుడు `ఓజీ` మూవీ విషయంలో మాత్రం పాజిటివ్ రివ్యూ ఇచ్చాడు. దుబాయ్‌లో సినిమా చూసినట్టు వెల్లడించారు. పవర్ ప్యాక్డ్ గా సినిమా ఉందని, బ్లడీ మాస్ మూవీ అని, ఈ ఏడాదికి బెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ అని వెల్లడించారు. పవన్‌కి సాలిడ్ కమ్ బ్యాక్ అవుతుందని, చివరి ఇరవై నిమిషాలు అదిరిపోయిందని, సినిమాని మరో స్థాయికి తీసుకెళ్తుందన్నారు. సినిమా చూస్తుంటే మస్త్ మజా వచ్చిందని తెలిపారు.
సినిమాలో ఇమ్రాన్ హష్మి యాక్టింగ్ టెర్రిఫిక్ అని, ఆయన పాత్రలోని స్వాగ్ వాహ్ అనేలా ఉందని, డైలాగ్స్ కూడా క్రేజీగా ఉన్నట్టు చెప్పారు. సినిమా స్క్రీన్‌ప్లే ఎంగేజింగ్‌గా ఉందని, మంచి కమర్షియల్ మూవీ అని, పైసా వసూల్ సినిమా అవుతుందన్నారు. ఆయన ఈ మూవీకి 3.5 రేటింగ్ ఇవ్వడం విశేషం. బయట టాక్‌ని బట్టి చూస్తే, మూవీ క్లైమాక్స్ వరకు మామూలుగానే ఉంటుందని, పవన్‌పై ఎలివేషన్లు ఓవర్‌గా ఉన్నాయని, సెకండాఫ్‌లో వీఎఫ్‌ఎక్స్ నాసిరకంగా ఉన్నాయని, క్లైమాక్సే సినిమాకి బలం అని, అదే మూవీని నిలబెడుతుందని అంటున్నారు.
అయితే మూవీకి ఎబౌ యవరేజ్ టాక్ వినిపిస్తోంది. పండగ సీజన్ కావడం కలిసొచ్చేలా ఉంది. ఈ వారం ఇంకా వేరే సినిమాలు కూడా లేవు. పవన్ సోలోగా వస్తున్నారు. మాస్, యాక్షన్ సీన్లు, ఎలివేషన్లు గట్టిగానే ఉండటంతో సినిమా బాక్సాఫీసు వద్ద రచ్చ చేయడం ఖాయమంటున్నారు క్రిటిక్స్. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కాబోతుంది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ దానయ్య సుమారు రూ.250కోట్లతో ఈ మూవీని నిర్మించినట్టు సమాచారం.