పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. నన్ను పనిచేసుకోనివ్వండి. నా చుట్టు ముట్టేస్తే నేను పనిచేసుకోలేను. రోడ్లు ఎలా ఉంటాయో చూద్దామంటే మీరంతా చుట్టుముట్టేసి రోడ్లు కనపడట్లేదు. యువతకు ఒకటే చెప్తున్నా మీరు ఇప్పుడు సినిమాల మోజులో పడి, పోస్టర్లు పెట్టి, OG OG అని, లేదా వేరే హీరోలకు జేజేలు కొడుతున్నారు. ఇవన్నీ చేయొచ్చు కానీ మీరు మీ జీవితంపై ఫోకస్ చేయకపోతే ముందుకు వెళ్ళలేరు. మాట్లాడితే అన్న మీసం తిప్పు, మీసం తిప్పు అంటారు.