యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ఏడాది కల్కి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ని ఆడియన్స్ కి ఇచ్చాడు. మరిన్ని పాన్ ఇండియా చిత్రాల్లో ప్రభాస్ నటిస్తున్నాడు. బాహుబలితో ప్రభాస్ పాన్ ఇండియా హవా మొదలైంది. ఏ హీరోకి అయినా కెరీర్ లో హిట్స్ అండ్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా గర్వంగా చెప్పుకునే చిత్రాలు కొన్ని ఉంటాయి. ప్రభాస్ కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం వర్షం. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన చిత్రం బాహుబలి ఇలా ప్రభాస్ అనేక బ్లాక్ బస్టర్స్ లో నటించాడు.
కానీ ఒక ఫ్లాప్ మూవీ గురించి కూడా ప్రభాస్ గర్వంగా చెప్పుకుంటాడు. ఆ మూవీ ఇంకేదో కాదు బుజ్జిగాడు. కమర్షియల్ గా బుజ్జిగాడు అంత గొప్పగా ఆడలేదు. కానీ ఈ చిత్రంలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్ క్రేజీగా ఉంటుంది. రజనీకాంత్ అభిమానిగా ప్రభాస్ ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు.
టిప్పర్ లారీ వచ్చి స్కూటర్ ని గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా లాంటి క్రేజీ డైలాగులు అప్పట్లో బాగా ఆకట్టుకున్నాయి. ఒక ఈవెంట్ లో ప్రభాస్ చెబుతూ తన కెరీర్ లో గర్వంగా చెప్పుకునే చిత్రాల్లో బుజ్జిగాడు ఒకటి అని అన్నారు. ఆ మూవీ అంటే నాకు చాలా ఇష్టం. కేవలం హీరో క్యారెక్టరైజేషన్ పై కథ రాయగల దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అది పూరి జగన్నాధ్ మాత్రమే.
తాను వంద రోజుల్లో తీసే సన్నివేశాన్ని కూడా పూరి జగన్నాధ్ ఒక్క డైలాగ్ తో హైలైట్ చేయగలరు అని స్వయంగా రాజమౌళి చెప్పిన విషయాన్ని ప్రభాస్ గుర్తు చేశారు. బుజ్జిగాడు చిత్రంలో ప్రభాస్, త్రిష మధ్య వచ్చే సన్నివేశాలు కూడా హైలైట్ గా నిలిచాయి.