గేమ్ ఛేంజర్ ఫ్లాప్ కు పవన్ కళ్యాణ్ కు సంబంధం ఏంటి..? యాంటీ ఫ్యాన్స్ ఏం చెపుతున్నారంటే..?

Published : Jan 21, 2025, 11:03 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ ప్లాప్ అవ్వడానికి ఆయన బాబాయి..ఏపీ డిప్యూటీ సీఎం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కారణమా..? కొంత మంది ట్రోల్ చేస్తున్నదాంటో నిజం ఎంత..? అసలు లాజిక్ ఉందా..?   

PREV
16
గేమ్ ఛేంజర్ ఫ్లాప్ కు పవన్ కళ్యాణ్ కు సంబంధం ఏంటి..? యాంటీ ఫ్యాన్స్ ఏం చెపుతున్నారంటే..?

ఎన్నో ఆశలతో.. దాదాపు మూడేళ్ళు కష్టపడి మరీ గేమ్ ఛేంజర్ సినిమాను తెరకెక్కించారు. రామ్ చరణ్ ఆరేళ్ళ తరువాత సోలో హీరోగా వచ్చిన సినిమా.. ఆర్ఆర్ఆర్ తరువాత రామ్ చరణ్ ఇమేజ్ భారీగా పెరగడంతో గేమ్ ఛేంజర్ పై అదే రేంజ్ లో అంచనాలు పెరిగాయి. కాని ఈసినిమా రిలీజ్ అవ్వడంతోనే ప్లాప్ టాక్ ను మూటగట్టుకుంది. ఎన్నో విమర్శు ఫేస్ చేసింది. 

Also Read: జూనియర్ ఎన్టీఆర్ హాలీవుడ్ ఎంట్రీ

26

అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ నటనకు మాత్రం 100 మార్కులు పడ్డాయి. చరణ్ వైపు నుంచి 100 పర్సంట్ ఎఫర్ట్ కనిపించింది. కాని చరణ్ ఇమేజ్ ను సరిగ్గా క్యారీచేయలేకపోయాడు శంకర్. చరణ్ లాంటి పాన్ ఇండియా స్టార్ అవకాశం ఇస్తే.. అది ఉపయోగించుకోలేకపోయాడు అనే చెప్పాలి. ఈవిషయంలో శంకర్ అండ్ టీమ్ చేసిన పొరపాట్లే అక్కడే కనిపిస్తున్నాయి . రామ్ చరణ్ వైపు నుంచి ఎటువంటి పొరపాటు లేదని చెప్పాలి. నష్టం మాత్రం జరిగిపోయింది. 

Also Read:అఖండ 2 లో బాలయ్య సెంటిమెంట్ హీరోయిన్..?

36

ఇకనుంచి అయినా రామ్ చరణ్ జాగ్రత్తగా లేకపోతే.. ముందు ముందు చాలా ఇబ్బండి పడాల్సి వస్తుంది అంటున్నారు సినిమా జనాలు. ఇక అది అలా ఉంచితే.. గేమ్ ఛేంజర్ ప్లాప్ కు పవన్ కళ్యాణ్ కూడా కారణమా..? ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోలర్స్ ప్రచారం చేస్తున్న విషయం ఇదే. పవన్ కళ్యాన్ లెగ్గు కారణంగానే గేమ్ ఛేంజర్ ప్లాప్ అయ్యిందంటూ.. మెగా యాంటీ ఫ్యాన్స్ ప్రచారం చేసే పనిలో ఉన్నారు. 

Also Read:విరాట్ కోహ్లీ మరదలు.. టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్

46
pawan kalyan

అది కూడా రామ్ చరణ్ సినిమా ఈవెంట్ కు పవన్ రావడం వల్లే  ఈసినిమా ప్లాప్ అయ్యిందన్నారు. గతంలో కూడా ఆయనహాజరయిన కొన్ని సినిమాల ఈవెంట్లను కూడా ప్రచారం చేస్తున్నారు ఆ బ్యాచ్.  సాయి ధరమ్ తేజ్... రిపబ్లిక్, చిరంజీవి.. సైరా నరసింహా రెడ్డి,  నాని  నటించిన అంటే సుందరానికి’ సినిమాల ఈవెంట్స్‌కు పవన్ వెళ్లడం, అవి ఫ్లాప్ అయ్యాయని..పవన్ కు బ్యాడ్ సెంటిమెంట్ ఇలా ఉందంటూ ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. 
Also Read:

56

అయితే ఈ విషయంలో ఎన్ని ప్రచారాలు చేసినా.. ఎంత ట్రోల్ చేసినా.. నిజం అందరికి తెలుసంటూ..ఎదురు దాడి చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఈవిషయంలో అసలు నిజాలుబయటపెడుతున్నారు. పవన్ కాలు పెట్టడం వల్లే ఇదంతా జరిగింది అని అంటే.. మరి గతంలో  ఆయన గెస్ట్‌గా వెళ్లిన  జులాయి,‘అ ఆ, మగధీర లాంటి సినిమాలకు ఇది వర్తించదా అంటు రివర్స్ కౌంటర్లు వేస్తున్నారు. 

66

అంతే కాదు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తరువాత పాల్గోన్న మొదటి సినిమా ఈవెంట్ ఇది. ఆయన క్రేజ్ వల్లే ఇంకాస్త ఇమేజ్ ఈసినిమాకు పెరిగింది. అంటున్నారు. అంతే కాదు రామ్ చరణ్, పవన్ వల్లే గేమ్ ఛేంజర్ కొంతలో కొంత ఆడిందంటేున్నారు. ఇలాంటి పిచ్చ పిచ్చి ట్రోలింగ్స్ కు భయపడేది లేదంటున్నారు మెగా ఫ్యాన్స్.

Read more Photos on
click me!

Recommended Stories