స్టార్‌ కమెడియన్‌ సంతానంకి ఊహించని ఆస్తులు.. నవ్వించి కోట్లు వసూలు చేస్తున్న హాస్య నటుడు

Published : Jan 21, 2025, 09:52 AM IST

హాస్యనటుడు సంతానం నేడు తన 45వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆయన ఆస్తుల వివరాలు తెలుసుకుందాం. ఆయన తీసుకునే పారితోషికం తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే. 

PREV
16
స్టార్‌ కమెడియన్‌  సంతానంకి ఊహించని ఆస్తులు.. నవ్వించి కోట్లు వసూలు చేస్తున్న హాస్య నటుడు
సంతానం

గౌండమణి - సెంథిల్, నాగేష్, వడివేలు, వివేక్ ల తర్వాత తమిళ సినిమాలో అగ్ర హాస్యనటుడిగా పేరు తెచ్చుకున్నారు సంతానం. 1980 జనవరి 21న చెన్నైలో జన్మించిన సంతానం, విజయ్ టీవీలో ప్రసారమైన `లోల్లు సభా` అనే షోతో తనదైన శైలిలో కామెడీ చేస్తూ  పాపులర్‌ అయ్యారు. 

26
నటుడు సంతానం

`లోల్లు సభా`లో సంతానం కామెడీ నచ్చిన సింబు, ఆయనను `వల్లవన్` సినిమా ద్వారా కమెడియన్ గా పరిచయం చేశారు. ఆ సినిమా విజయం సాధించడంతో సంతానం కెరీర్  ఊపందుకుంది. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

హీరోయిన్ లేకుండా సినిమా ఉండొచ్చు కానీ సంతానం లేకుండా సినిమా ఉండదు అనేంతగా ఆయనకు డిమాండ్ ఏర్పడింది. `బాహుబలి` దర్శకుడు రాజమౌళి కూడా `ఈగ` సినిమా కోసం సంతానం కాల్ షీట్ కోసం ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి.

36
సంతానం పుట్టినరోజు

కామెడీ నటుడిగా టాప్ లో ఉన్న సంతానం హీరోగా నటించాలని అనుకున్నారు. అందుకే అరై ఎన్‌ 305 11 కాదవుల్`, `కన్నా లడ్డు తిన్నా ఆశయ్యా` వంటి హాస్య చిత్రాల్లో హీరోగా నటించి, కామెడీ పాత్రలు చేయనని ప్రకటించారు. కానీ హీరోగా ఒకటి రెండు సినిమాలకే పరిమితమయ్యారు. అవి సక్సెస్‌ కాలేకపోవడంతో మళ్లీ కామెడీ సినిమాలు చేయాల్సి వచ్చింది. 

46

ఆయన కామెడీ చేస్తే ఆ సినిమా హిట్ అనే నమ్మకం ఉండేది. కానీ హీరోగా నటించిన సినిమాలు కొన్ని మాత్రమే విజయం సాధించాయి. సంతానం కామెడీ పాత్రలు చేయడం మానేయడంతో తమిళ సినిమాలో కామెడీకి కొరత ఏర్పడింది. ఇటీవల విడుదలైన `మద గజ రాజా` సినిమా ద్వారా అది స్పష్టమైంది.

56

ప్రస్తుతం `డిడి రిటర్న్స్` సినిమా రెండో భాగంలో నటిస్తున్నారు సంతానం. ఈ సినిమాను ఆర్యా నిర్మిస్తున్నారు. సెల్వరాఘవన్, గౌతమ్ మీనన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నేడు తన 45వ పుట్టినరోజు జరుపుకుంటున్న సంతానం ఆస్తుల విలువ గురించి తెలుసుకుందాం.

66
సంతానం ఆస్తుల విలువ

హీరోగా ఒక్కో సినిమాకు సంతానం  రూ.15 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్నారు. ఆయన ఆస్తుల విలువ రూ.80 నుంచి 90 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. 2004లో ఉషాను వివాహం చేసుకున్న సంతానంకు ఇద్దరు పిల్లలు. నటనతో పాటు ఆధ్యాత్మికతపైనా ఆసక్తి ఉన్న సంతానం సద్గురు భక్తుడు. చెన్నైలో సొంత బంగ్లా, అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి.

read more: బాలకృష్ణకి షాకిచ్చిన చిరంజీవి, వెంకటేష్‌.. నాగార్జున అసలు పోటీలోనే లేరుగా!

also read: కచ్చితంగా చూడాల్సిన పునీత్‌ రాజ్‌ కుమార్‌ 9 సూపర్ హిట్ సినిమాలు ఇవే!

 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories