బాలకృష్ణకి షాకిచ్చిన చిరంజీవి, వెంకటేష్‌.. నాగార్జున అసలు పోటీలోనే లేరుగా!

Published : Jan 21, 2025, 09:17 AM IST

సీనియర్‌ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌, నాగార్జున ల మధ్య ఇప్పుడు వంద కోట్ల కలెక్షన్ల పోటీ నెలకొంది. అయితే షేర్‌ విషయంలో బాలయ్యకి షాకిస్తున్నారు చిరు, వెంకీ.   

PREV
15
బాలకృష్ణకి షాకిచ్చిన చిరంజీవి, వెంకటేష్‌.. నాగార్జున అసలు పోటీలోనే లేరుగా!

సీనియర్‌ హీరోలకు సంబంధించి ఇప్పుడు వంద కోట్ల కలెక్షన్లకి సంబంధించిన చర్చ నడుస్తుంది. బాలయ్య బ్యాక్‌ టూ బ్యాక్ నాలుగు వంద కోట్ల సినిమాలు చేశారు. ఇప్పుడు వెంకటేష్‌ ఏకంగా రెండు వందల కోట్లని టచ్‌ చేయబోతున్నారు.

ఈ క్రమంలో వంద కోట్ల షేర్‌ ఏ హీరో సాధించారనే చర్చ మొదలైంది. ఈ విషయంలో బాలయ్యకి పెద్ద షాకిస్తున్నారు చిరంజీవి, వెంకటేష్‌. అయితే ఈ గేమ్‌లో నాగార్జున గేమ్‌లోనే లేకపోవడం గమనార్హం. 
 

25

బాలకృష్ణ `అఖండ`తో విజయ పరంపర స్టార్ట్ చేశారు. వరుసగా `వీరసింహారెడ్డి`, `భగవంత్‌ కేసరి`, ఇప్పుడు `డాకు మహారాజ్‌` చిత్రాలతో విజయాలను అందుకున్నారు. ఈ నాలుగు సినిమాలు వంద కోట్లకుపైగా వసూళ్లని రాబట్టాయి.

సీనియర్‌ హీరోల్లో ఇలా బ్యాక్‌ టూ బ్యాక్‌ నాలుగు వంద కోట్ల సినిమాలు చేసిన హీరోగా బాలయ్య రికార్డు సృష్టించారు. కానీ బాలయ్యకి షాకిచ్చారు ఇద్దరు సీనియర్లు చిరు, వెంకీ. బాలయ్య సినిమాలు వంద కోట్ల గ్రాస్‌ వచ్చాయి, కానీ షేర్‌ సాధించలేదు. ఈ రికార్డుని చిరు, వెంకీ సాధించారు. 
 

35

చిరంజీవి, వెంకటేష్‌ సినిమాలు వంద కోట్ల షేర్‌ని సాధించాయి. ఈ విషయంలో మెగాస్టార్‌ చిరంజీవివి మూడు సినిమాలున్నాయి. వాటిలో `ఖైదీ నెంబర్‌ 150`, `సైరా`, `వాల్తేర్‌ వీరయ్య` ఉన్నాయి. `ఖైదీ నెంబర్‌ 150` సినిమా 164కోట్ల గ్రాస్‌ని, 104 కోట్ల షేర్‌ని సాధించింది.

ఇక `సైరా నరసింహారెడ్డి` మూవీ రూ. 240కోట్ల గ్రాస్‌ని, 141కోట్ల షేర్‌ సాధించింది. కానీ ఇది ఫ్లాప్‌ అయ్యింది. అనంతరం `వాల్తేర్‌ వీరయ్య` 225కోట్ల గ్రాస్‌ని 136కోట్ల షేర్‌ని సాధించాయి. ఇలా మూడు సినిమాలు వంద కోట్లకుపైగా షేర్‌తో సీనియర్లలో టాప్‌లో ఉన్నారు చిరంజీవి. 

45

సీనియర్లలో ఈ అరుదైన ఘనత సాధించిన హీరోల్లో వెంకీమామ కూడా నిలిచారు. ఆయన నటించిన `సంక్రాంతికి వస్తున్నాం` మూవీ ఈ సంక్రాంతికి విడుదలైంది. ఇది ఇప్పటికే రూ.200కోట్ల గ్రాస్‌ని వసూలు చేసింది. ఈ లెక్కన ఇది ఇప్పటికే వంద కోట్ల షేర్‌ దాటింది. అంతేకాదు ఈ మూవీ చిరంజీవి హైయ్యెస్ట్ గ్రాస్‌ని కూడా క్రాస్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

read  more: ఓటీటీ రైట్స్ లో టాప్‌ 10 సినిమాలు, అత్యధికంగా ఆ స్టార్‌ హీరోవే.. పవన్‌, బన్నీ, తారక్, చరణ్‌ సినిమాలు ఎన్ని?
 

55

ఇక సీనియర్లలో నాగార్జున ఇప్పటి వరకు వంద కోట్ల సినిమా చేయలేకపోయారు. ఇక వంద కోట్ల షేర్‌ మాట లేదు. వంద కోట్ల పోటీలో నాగ్‌ వెనకబడటమే కాదు, అసలు గేమ్‌లోనే లేరని చెప్పొచ్చు. మొత్తంగా సీనియర్లలో చిరంజీవి, వెంకీ వంద కోట్ల సినిమాలతో దూసుకుపోతున్నారు.

ఈ విషయంలో బాలయ్యకి కూడా షాకిచ్చారు. ఈ సంక్రాంతికి వచ్చిన బాలయ్య `డాకు మహారాజ్‌` కూడా సుమారు రూ.160కోట్ల గ్రాస్‌ చేసింది. కానీ ఇంకా వంద కోట్ల షేర్ సాధించలేదు. మరి పూర్తి రన్‌లో అయినా వంద కోట్లని టచ్‌ చేస్తుందేమో చూడాలి. 

read  more: టాప్ 10లో ఐదుగురు టాలీవుడ్ వాళ్లే, అల్లు అర్జున్ స్థానం ఏదో తెలుసా.. ఇండియాలో మోస్ట్ పాపులర్ హీరోలు

also read: ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాభాలు దిల్ రాజుకు అందవా?

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories