పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. హీరోగా, నాయకుడిగా తనను తాను నిరూపించుకున్నాడు. విలువలతో కూడిన జీవితాన్ని లీడ్ చేస్తున్నాడు. ఇబ్బంది కలిగించే ఏ పని అయినా చేయడానికి ఇష్టపడడు. అందుకే 40 కోట్ల ప్రాజెక్ట్ ను సింపుల్ గా వదిలేశాడట పవన్.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యూత్ ఐకాన్ .. ఎంతో మంది యువతకు మోటివేషన్. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీ, నాయకుడు పవన్ కళ్యాణ్ . తన ఆలోచనలు, సిద్ధాంతాలతో అందరిని ఆకట్టుకుంటున్న పవన్.. ఇండస్ట్రీలో కూడా స్టార్ గా వెలుగు వెలిగారు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా స్టార్ గానే ఉన్నాడు. ఆయన ఏది చేసినా.. నలుగురికి ఉపయోగపడేలా చూసుకుంటారు. ఇండస్ట్రీలో కూడా సాయం అని వెళ్లిన వారికి లేదు అనకుండా సమస్య తీర్చి పంపిస్తారు పవన్. ఎంతో మంది స్టార్స్ సినిమాలతో పాటు రకరకాల మార్గాల్లో డబ్బు సంపాదిస్తుంటారు. కానీ పవన్ మాత్రం కొన్ని విషయాల్లో చాలా కఠినంగా ఉంటారు.
24
ప్రకటనలకు దూరంగా పవర్ స్టార్
జనాలకు హాని కలిగించే పనులకు ఆయన దూరంగా ఉంటుంటారు. ఆ మధ్య కాలంలో ఒక ప్రముఖ టొబాకో కంపెనీ పవన్ కల్యాణ్‌ను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకోవాలని భావించింది. ఇందుకోసం ఆయనకు 40 కోట్ల రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేసిందట. కానీ పవన్ మాత్రం ఈ విషయం గురించి ఆలోచించాల్సిన పనిలేదు.. అని పూర్తిగా వినకుండానే ఈ ప్రతిపాదనను తిరస్కరించారట. టొబాకో, సిగరెట్ వంటి హానికర ఉత్పత్తులకు సంబంధించిన ప్రకటనలు చేయడం తనకు ఇష్టం లేదని ఆయన స్పష్టంగా తెలిపారు.
34
సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉంటే చేయను..
యువత ఆరోగ్యం, శ్రేయస్సుపై తనకు ఉన్న బాధ్యతాభావమే ఈ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. హానికరమైన ఉత్పత్తుల ప్రచారం ద్వారా యువతపై ప్రతికూల ప్రభావం పడుతుందని పవన్ కల్యాణ్ నమ్మకం. అందుకే ఎంత పెద్ద మొత్తం ఆఫర్ చేసినా, తన సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉండే యాడ్‌లను అంగీకరించబోనని ఆయన నిర్ణయం తీసుకున్నారు.ఈ విషయంలో పవన్ కల్యాణ్‌పై ప్రశంసల వెల్లువెత్తింది. మా హీరో విలువలున్న దేవుడు.. కోట్లిచ్చిన తప్పు చేయడు” అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో తన కెరీర్ కు సబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కేవలం నటుడిగా మాత్రమే కాకుండా, నిర్మాతగా కూడా కొనసాగాలనే ఉద్దేశంతో ఆయన తన నిర్మాణ సంస్థ ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ బ్యానర్‌ను మళ్లీ యాక్టివ్ చేశారట. ఈ బ్యానర్‌పై పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థతో కలిసి వరుసగా సినిమాలను నిర్మించేందుకు పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ నాలుగు చిత్రాల్లో రెండు సినిమాల్లో ఆయనే హీరోగా నటించనుండగా, మిగిలిన రెండు సినిమాలను ఇతర హీరోలతో నిర్మించాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.