ఓజి చిత్రానికి ఊహకందని క్రేజ్.. మైండ్ బ్లాక్ అయ్యేలా ప్రీరిలీజ్ బిజినెస్

Published : Jul 12, 2025, 09:30 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పాన్ ఇండియా గ్యాంగ్ స్టార్ చిత్రం ఓజి. సుజీత్ దర్శకత్వంలో, డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతోంది.

PREV
15

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పాన్ ఇండియా గ్యాంగ్ స్టార్ చిత్రం ఓజి. సుజీత్ దర్శకత్వంలో, డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతోంది. తాజాగా ఈ చిత్ర షూటింగ్ మొత్తం పూర్తయినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రం ప్రారంభమైనప్పటి నుంచి రోజురోజుకు అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ పై కనీ వినీ ఎరుగని రీతిలో అంచనాలు నెలకొన్నాయి.

25

సెప్టెంబర్ 25న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. ఈ సినిమాపై ఉన్న అంచనాలకు తగ్గట్లుగానే ప్రీరిలీజ్ బిజినెస్ లో కూడా సంచలనాలు నమోదు అవుతున్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఓజి మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ 169 కోట్లుగా నమోదైనట్లు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.

35

ఇక వరల్డ్ వైడ్ గా థియేటర్ రైట్స్, శాటిలైట్, డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ మొత్తం కలిపి ప్రీరిలీజ్ బిజినెస్ 325 కోట్లు దాటినట్లు తెలుస్తోంది. ఓజి చిత్రంపై ఉన్న క్రేజ్ కి ఇది నిదర్శనం. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.

45

ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు నెవర్ బిఫోర్ అనిపించే విధంగా ఉండబోతున్నట్లు చిత్ర వర్గాల నుంచి సమాచారం. సాహో డైరెక్టర్ సుజిత్ పవన్ కళ్యాణ్ ని ఫ్యాన్స్ కోరుకునే విధంగా మోస్ట్ స్టైలిష్ గా ప్రజెంట్ చేయబోతున్నారు.

55

ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఓజి కన్నా ముందు మరికొన్ని రోజుల్లోనే జూలై 24న పవన్ కళ్యాణ్ నటించిన పిరియాడిక్ చిత్రం హరిహర వీరమల్లు రిలీజ్ అవుతోంది. 

Read more Photos on
click me!

Recommended Stories