ఆ ఫ్యామిలీలో నలుగురు హీరోలతో రొమాన్స్ చేసిన హీరోయిన్.. కొడుకు, తండ్రి, బాబాయ్, మేనల్లుడు ఇలా అందరితో..

Published : Jul 12, 2025, 08:22 PM IST

చిత్ర పరిశ్రమలో దశాబ్దాల పాటు హీరోయిన్ గా కొనసాగే అదృష్టం కొందరికే దక్కుతుంది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కొన్ని చిత్రాల్లో వెలుగు వెలిగిన హీరోయిన్లు ఆ తర్వాత అవకాశాలు లేక కనుమరుగైపోతున్నాయి.

PREV
15

చిత్ర పరిశ్రమలో దశాబ్దాల పాటు హీరోయిన్ గా కొనసాగే అదృష్టం కొందరికే దక్కుతుంది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కొన్ని చిత్రాల్లో వెలుగు వెలిగిన హీరోయిన్లు ఆ తర్వాత అవకాశాలు లేక కనుమరుగైపోతున్నాయి. ఇటీవల కాలంలో ఎక్కువ కాలం హీరోయిన్ గా రాణించే అవకాశం కాజల్ అగర్వాల్ కి దక్కింది.

25

కాజల్ అగర్వాల్ తన కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఓకే ఫ్యామిలీలో ఏకంగా నలుగురు హీరోలతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసిన ఘనత కూడా కాజల్ అగర్వాల్ కే దక్కుతుంది. మెగా ఫ్యామిలీలో కాజల్ అగర్వాల్ నలుగురు హీరోలతో సినిమాలు చేసింది.

35

ముందుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ మగధీర చిత్రంలో కాజల్ నటించిన సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం ఒక దృశ్య కావ్యంలా మిగిలిపోయింది. ఆ తర్వాత రామ్ చరణ్ తో మరికొన్ని చిత్రాల్లో కూడా కాజల్ నటించింది. ఇక చిరంజీవి మేనల్లుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఆర్య 2 చిత్రంలో కాజల్ నటించింది.

45

రామ్ చరణ్ బాబాయ్ అయినా పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో మెరిసింది. ఆ తర్వాత రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవితో ఖైదీ నెంబర్ 150 చిత్రంలో నటించి మెప్పించింది. చిరంజీవి రీ ఎంట్రీ చిత్రంగా పొందిన ఖైదీ నెంబర్ 150 భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విధంగా కాజల్ అగర్వాల్ మెగా ఫ్యామిలీలో చిరంజీవి, రామ్ చరణ్, పవన్, అల్లు అర్జున్ లతో సినిమాలు చేయడం విశేషం.

55

పెళ్లయిన తర్వాత కాజల్ అగర్వాల్ తగ్గుతూ వచ్చింది. కాజల్ చివరగా మంచు విష్ణు కన్నప్ప చిత్రంలో పార్వతీదేవిగా డివోషనల్ రోల్లో నటించింది.నందమూరి ఫ్యామిలీలో కూడా కాజల్ బాలకృష్ణ, కళ్యాణ్ రామ్, జూ.ఎన్టీఆర్ లతో నటించడం విశేషం. 

Read more Photos on
click me!

Recommended Stories