యూట్యూబర్ గా గుర్తింపు పొంది ఆ తర్వాత సినిమాల్లో కమెడియన్ గా అవకాశాలు అందుకున్న నటుల్లో మహేష్ విట్టా ఒకరు. రాయలసీమ యాసలో డైలాగులు చెప్పడం మహేష్ విట్టా స్టైల్.
యూట్యూబర్ గా గుర్తింపు పొంది ఆ తర్వాత సినిమాల్లో కమెడియన్ గా అవకాశాలు అందుకున్న నటుల్లో మహేష్ విట్టా ఒకరు. రాయలసీమ యాసలో డైలాగులు చెప్పడం మహేష్ విట్టా స్టైల్. మహేష్ విట్టా బిగ్ బాస్ షోలో కూడా కంటెస్టెంట్ గా పాల్గొన్నారు.
25
ప్రస్తుతం మహేష్ విట్టాకి కమెడియన్ గా మంచి అవకాశాలు వస్తున్నాయి. మహేష్ విట్టా త్వరలో తండ్రి కాబోతున్నాడు. మహేష్ విట్టా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే తన లవ్ స్టోరీ గురించి చెప్పాడు. తన చెల్లెలి ఫ్రెండ్ శ్రావణి రెడ్డి అనే అమ్మాయితో దాదాపు ఐదేళ్లపాటు మహేష్ విట్టా ప్రేమలో ఉన్నాడు.
35
ఈ జంట 2023లో కుటుంబ సభ్యులను ఒప్పించి వివాహం చేసుకున్నారు. కాగా ప్రస్తుతం శ్రావణి రెడ్డి గర్భవతి. తన భార్య ప్రెగ్నెన్సీ గురించి మహేష్ విట్టా గత నెలలో అనౌన్స్ చేశాడు. తాజాగా సీమంతం వేడుక ఘనంగా జరిగింది. ఆ దృశ్యాల్ని మహేష్ విట్టా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
సీమంతం దృశ్యాలు నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. మహేష్, శ్రావణి దంపతుల మధ్య ప్రేమని తెలియజేసేలా సీమంతం దృశ్యాలు ఉన్నాయి. మహేష్ విట్టా ఛలో, కొండ పొలం, కృష్ణార్జున యుద్ధం లాంటి చిత్రాల్లో నటించారు. మహేష్ విట్టాకి వెబ్ సిరీస్ లో కూడా అవకాశాలు వస్తున్నాయి.
55
మహేష్ విట్టా తన కెరీర్ లో ఒక గోల్డెన్ ఛాన్స్ ని కోల్పోయాడు. వాస్తవానికి పుష్ప చిత్రంలో అత్యంత కీలకమైన కేశవ పాత్ర కోసం ముందుగా డైరెక్టర్ సుకుమార్ మహేష్ విట్టానే అనుకున్నారట. దీనికోసం ఆడిషన్ కూడా జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ పాత్ర జగదీష్ కి వెళ్ళింది.